నెట్టిల్లు


Sun,December 15, 2019 01:17 AM

ఎవరినినైనా ఓ ఘటన తాలూకూ అనుభవాలు వెంటాడుతాయి. వాటిలో కొన్ని భయాన్నీ , కొన్ని అనందాన్ని, కొన్ని బాధను , మరికొన్ని అవగాహనను పెంచుతాయి. అలాంటి ఘటనల ఆధారంగానే ఈ వారం లఘుచిత్రాలు యూట్యూబ్‌లో వచ్చాయి. వాటి సమీక్షలే ఇవి.

సారీ ప్రియాంక

దర్శకత్వం: రఖీ నేత
నటీనటులు : కల్పన, భరత్, భూమేశ్, ప్రసాద్, రవి
ఇటీవల కొన్ని ఘటనలు అందరినీ భయాందోళనకు గురి చేశాయి. చాలా రకాల విషయాలు చర్చకు వచ్చాయి. పిల్లల పెంపకం, తలిదండ్రుల జాగ్రత్తలు, సమాజం.. ఇలా అనేక అంశాలూ తెలుసుకోవాలనే సందేశాలు వినిపించాయి. ఇలాంటి వృత్తాంతం ఉన్న లఘుచిత్రమే సారీ ప్రియాంక. కథ విషయానికి వస్తే.. బడికి వెళ్తున్న పిల్లలకు ఒక వ్యక్తి చాక్లెట్ల ఆశ చూపిస్తాడు. మరోవైపు ఇలా ఎవరైనా చాక్లెట్లు ఇస్తే ఎలా స్పందించాలో తల్లిదండ్రులు పిల్లలకు నేరిస్తారు. ఓ రోజు పిల్లలంతా బడికి వెళ్తుంటే అదే వ్యక్తి చాక్లెట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ తల్లిదండ్రులు చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చి చాక్లెట్ తీసుకోవడమే కాకుండా, అతని చుట్టూ చేసి కొట్టడం ప్రారంభిస్తారు. ఇంకోసన్నివేశంలో ఒంటరిగా వెళ్తున్న ఓ యువతిని కొందరు ఆకతాయిలు వెంబడించి దారుణానికి పాల్పడతారు. ఇలాంటివి జరిగినన్ని రోజులూ సమాజం ఎలా ఉంటుందో చెప్పే సందేశంతో లఘుచిత్రం ముగుస్తుంది.
Sorry-priyanka

Total views5,51,039+ (డిసెంబర్ 7 నాటికి)Published on Dec 2 2019

అనురాగం To అర్జున్ రెడ్డి

నటీనటులు : సాహితి, అబ్దుల్ కరీం, అరవింద్,
ఇద్దరూ ప్రేమించుకుంటారు. చెట్టాపట్టాలతో తిరుగుతారు. కానీ అమ్మాయికి వేరే అబ్బాయితో పెండ్లి అవుతుంది. గోపీ, రంగ చిన్ననాటి స్నేహితులు. పెద్దయ్యాక అనుకోకుండా ఓ రోజు ఎదురుపడుతారు. రంగ అతని భార్య రాధను పరిచయం చేస్తాడు.
ఆ ఇద్దరు ఆశ్చర్యపోతారు. గతంలో ప్రేమించుకున్న ఆ ఇద్దరూ వీళ్లే గోపి, రాధ. విషయం రంగకు అర్థం అవుతుంది. ఇద్దరినీ కలుపుతాడు. అదే ప్రేమ అంటాడు. అది గతంలో.. కానీ ఇలాంటి యాధృశ్చిక ఘటనలు నేటి కాలంలో జరిగితే ఎలా ఉంటుంది? అనే అంశంలో ఓ కోణాన్ని చూపించారు. సందర్భం ఒక్కటే అయినా పరిస్థితులను బట్టి స్పందనలుంటాయని అర్థం అవుతుంది. పాతకాలంలో, నేటి కాలంలో రెండు రకాల మేకింగ్‌లను చూపించారు. బాగుంటుంది మీరూ చూడండి.
Samskaram-to

Total views6,553+(డిసెంబర్ 7 నాటికి)published on Dec 4, 2019

మైత్రి

దర్శకత్వం: లక్ష్మణ్
నటీనటులు : తేజశ్రీ, నితిన్
మైత్రి, రాహుల్ ఇద్దరు అనాథలు. చిన్నప్పుడే స్నేహితులవుతారు. రాహుల్, మైత్రిని బాగా చూసుకొంటాడు. ఇద్దరు పెద్దవాళ్లవుతారు. మైత్రిని ఎంబీబీఎస్ చేయించాలని ఉంటుంది. దాని కోసం యూకే పంపాలనుకుంటాడు. మిగతా ఫ్రెండ్స్‌తో కలిసి ఆ ఏర్పాట్లు చేస్తాడు. దాని కోసం మైత్రి కొంత ఇబ్బంది పడ్డా వెళ్లడానికి నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఆమె వెళ్లిన తర్వాత రాహుల్ ఒంటరిగా ఫీలవుతాడు. ఆమె లేని లోటు కనిపిస్తుంది. స్నేహితులతో కలిసి ఆ బాధను పంచుకుంటాడు. అది ప్రేమ అని చెప్తాడు. మైత్రిని రాహుల్ ప్రేమిస్తున్నట్టు స్నేహితులతో చెప్తాడు. కానీ విదేశాల్లో ఉన్న మైత్రికి ఎలా తెలిసేది. వచ్చిన తర్వాత చెప్పాలి అనుకుంటాడు. మూడేండ్ల తర్వాత మైత్రి ఇండియాకు వస్తుంది. వస్తునే విదేశాల్లో ఒకరిని ప్రేమించినట్టు నువ్వు ఒప్పుకుంటే పెండ్లి చేసుకుంటానని రాహుల్‌తో చెప్తుంది. దానికి రాహుల్‌కు ఎలా స్పందించాలో తెలియదు. బాధపడతాడు. కొద్ది సేపటికి మైత్రి రాహుల్ దగ్గరకు వచ్చి తన అభిప్రాయం చెప్తుంది. తర్వాత ఏమై ఉంటుంది? రాహుల్ ప్రేమ ఏమైందో తెలియాలంటే యూట్యూబ్‌లో చూడండి.
Mytri

Total views6,553+(డిసెంబర్ 7 నాటికి)published on Dec 4, 2019

తను

దర్శకత్వం: మల్లిఖార్జున్
నటీనటులు : గాయత్రి, ఆషిక్
ప్రేమించిన అమ్మాయి ఇక కనబడదు అని తెలిసినప్పుడు అతని వేదనను చూపించే ప్రయత్నం చేశారు ఈ లఘుచిత్రంలో. కథ విషయానికి వస్తే. ఒకతను కాఫీషాప్‌కి వెళ్తాడు. అక్కడో అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. అక్కడే తన ప్రేమ గురించి చెప్పాలనుకుంటాడు. కొద్దిసేపటికే ఆమెమీద కలిగిన ఫీలింగ్స్‌ను చెప్తాడు. కానీ ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాదు. తనకు తెలుగు రాదన్న సంగతి చెప్తుంది. అప్పుడు అతనికి ఏం చేయాలో అర్థంకాదు. ఆయనకు తెలుగు తప్ప వేరే భాష రాదు. నేరుగా ఐ లవ్ యూ అని చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అనుకుంటాడు. అయినా సరే చెప్తాడు. ఒకేసారి సీన్ మారిపోతుంది. కాఫీషాప్‌లో ఉన్న వాళ్లందరూ కుర్చీల్లోంచి పడిపోతారు. కాసేపు అతనికి ఏమీ అర్థం కాదు. ఎదురుగా ఉన్న ఆ ఆమ్మాయి కూడా పడిపోతుంది. ఇంతకి ఏం జరిగిందో, అతని ప్రేమ ఏమైందో మీరే చూడండి.
Thanu

Total views1,093+(డిసెంబర్ 7 నాటికి)Published on Dec 5, 2019

-వినోద్ మామిడాల, సెల్: 7660066469

156
Tags

More News

VIRAL NEWS