90 ఎమ్‌ఎల్‌తో కిక్కొస్తుంది!


Sun,December 15, 2019 01:04 AM

90ML
సినిమాలు ప్రతిఒక్కరూ చూస్తారు. దీన్నే ఫేషన్‌గా మార్చుకునే వాళ్లు కొందరే ఉంటారు. వారే తర్వాతి తరానికి గుర్తుండిపోయే కథానాయికలు. సినిమాలో ఒక చాన్స్‌కోసం ఎదురుచూస్తున్న ఆమెకు 90 ఎమ్‌ఎల్‌తో కోరిక తీరిందంటున్నది. జీవితంలో కిక్‌నిచ్చే మరెన్నో పాత్రలు చేయాలంటున్న నేహా సోలంకి గురించి కొన్ని విశేషాలు.

-నేహా ప్రొఫెషనల్ మోడల్, నటి. ఇవి కాకుండా ఫ్లిప్‌కార్ట్, పేపే జీన్స్, జ్యువెలరీ వంటి అనేక బ్రాండ్‌లకు పనిచేసింది.
-కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ నేహాను నీను అని ముద్దుగా పిలుస్తారు. చిన్నతనం నుంచీ నటిగా తనను తాను చూసుకోవాలని ముచ్చట పడేది.
-భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని హల్దానీలో జన్మించింది. అమ్రపాలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ డిప్లొమా చేసింది.
-2017లో సేత్‌జీ సీరియల్‌లో, 2018లో మయావి మాలింగ్ సీరియల్‌లో నటించింది. ఆ తర్వాత 90 MLతో ముచ్చట తీరిందంటున్నది.
-1998 డిసెంబర్ 25న జన్మించిన నేహా ఖాళీ సమయం దొరికిందంటే షాపింగ్‌కు చెక్కేస్తుందట. బయటకు వెళ్లడం ఎందుకులే అనుకుంటే ఇంట్లో డాన్స్ చేస్తుందట.
-నేహాకు టీవీ షోలో అవకాశం రాకముందే కొన్ని షోలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది.
-షాంపింగ్, డాన్స్‌తోపాటు అప్పుడప్పుడు వంట కూడా ట్రై చేస్తుంది. ఫేవరెట్ ఫుడ్ బూందీరైతా తయారు చేసి తల్లిదండ్రులకు రుచి చూపిస్తుంది.
-నేహా ఒకవేళ నటి కాకుంటే మంచి ఉద్యోగం చేసే అమ్మాయిగా పేరు తెచ్చుకొనేదాన్నని అంటున్నది.
-నటించడం వరంలా భావించిన నేహా 70 ఏండ్ల వరకూ నటిస్తూనే ఉంటానంటున్నది.
-హీరోయిన్ అవ్వాలన్న కోరిక కత్రినాకైఫ్‌ను చూశాక మొదలైందట. ఫేవరెట్ హీరో షారుఖ్‌ఖాన్ అంటున్నది.

-సరస్వతి వనజ

290
Tags

More News

VIRAL NEWS