రాశి ఫలాలు


Sun,December 15, 2019 12:40 AM

15-12-2019 నుంచి 21-12-2019 వరకు

మేషం

అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ధైర్య సాహసాలతో పనులు చేస్తారు. మంచి ఆలోచనలు వస్తాయి. వాటిని సద్వియోగ పరచుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన వారం. ప్రయాణాలు కలిసొస్తాయి. డబ్బు ఇవ్వడం తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. తొందరపడకుండా పనులు చేయాలి. రాజకీయంలో ఉన్న వారికి పై వారితో మంచి సంబంధాలు ఉంటాయి. పెద్దలకు విలువ ఇచ్చి పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు. ఆదరణ పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

వృషభం

సంగీత, సాహిత్య అభిమానులకు ఈ వారం ఆనందాన్ని కలిగిస్తుంది. సభలకు, సమావేశాలకు వెళతారు. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారంలోని వారికి కలిసివస్తుంది. బంధుమిత్రులతో చర్చించడం మూలంగా చాలా పనులు కలిసివస్తాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. ఓపిక అవసరం. పెద్దల సలహాలు, సూచనలకు ప్రాధాన్యాన్ని ఇస్తూ పనులు చేయాలి. అనవసరమైన ఖర్చులుంటాయి. విద్యార్థులు చదువుపై మనసు పెట్టాలి. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ఫలితం ఉంటుంది. శాశ్వత ఫలితం కోసం శ్రమించాలి. జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి.

మిథునం

ఈ వారంలో ఈ రాశివారు శుభకార్యాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన వారం. పోటీ పరీక్షలలో విజయం వరిస్తుంది. మంచి సంస్థల్లో చేరుతారు. మంచి సంబంధాలు పెరుగుతాయి. దేవతా, గురుభక్తి వల్ల ప్రశాంతంగా పనులు చేస్తారు. నిత్య వ్యాపార లావాదేవీలు కలిసొస్తాయి. న్యాయవాద, వైద్య వృత్తిలలో ఉన్న వారికి ఈ వారం కలిసివస్తుంది. వస్త్ర, వస్తువులను, ఆభరణాలను కొంటారు. రాజకీయంలో ఉన్న వారికి పై వారితో మంచి సంబంధాలుంటాయి. కింది స్థాయి వారితో జాగ్రత్త అవసరం.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో, ఆఫీసులో అనుకూలత ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయి. పేరును సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. పనివారితో సమస్యలు తీరుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, నదీస్నానాలను ఆచరిస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యవసాయంలో ఇరుగు పొరుగు వారితో సయోధ్య లేకపోవడం. అనవసర ప్రయాణాల వల్ల అలసట, అనారోగ్యం ఉంటాయి. వ్యాపారులకు ఆర్థిక పరమైన లాభాలుంటాయి.

సింహం

చదువు నిరాటంకంగా కొనసాగుతుంది. శ్రద్ధ కనబరుస్తారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సంబంధాలు పెరుగుతాయి. ఉపాధ్యాయ, న్యాయవాద వృత్తిలోని వారు సంతృప్తిని పొందుతారు. హాయిగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి. నిర్మాణరంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో బంధువులతో మంచి మాట ఉండడం వల్ల పనులు అనుకూలిస్తాయి. లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. పనులు శ్రద్ధతో పూర్తి చేస్తారు.

కన్య

ఈ రాశి వారికి ఈ వారంలో ప్రధానమైన గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ జాగ్రత్తతో ఆచితూచి అడుగులు వేయడం అవసరం. వ్యాపార, ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. సహనంతో పనులు చేస్తూ వెళ్లాలి. అనుకున్న ఫలితాలు రావడానికి విద్యార్థులు బాగా శ్రమించాలి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అనవసరమైన ఆలోచనల మూలంగా నియంత్రణలోలేని ఖర్చులు ఉంటాయి. వ్యాపారస్తులు కొత్త పనులు ప్రారంభించకుండా ఉండడం, పాతవి పూర్తి చేయడం అన్ని విధాలుగా మంచిది.

తుల

ఈ రాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తాత్కాలికంగా కొన్ని విషయాలు కలిసిరావడం, కొన్ని పనులు వాయిదా పడడం ఉంటుంది. నిత్యావసర వస్తు, షేర్, వడ్డీ, వ్యాపారాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. ఇంజినీరింగ్, వైద్యవృత్తుల్లోని వారికి బాగా కలిసి వస్తుంది. విద్యార్థులు బాగా శ్రమించాలి. అనుకున్న ఫలితాలను సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో అందరితో మంచి ప్రవర్తన మూలంగా ప్రమోషన్‌లుంటాయి.

వృశ్చికం

విద్యార్థులకు అనుకూలమైన వారం. చదువులో రాణిస్తారు. పోటీ పరీక్షలలో మంచి స్థాయిలో నిలుస్తారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగం లభిస్తుంది. పెద్దల పట్ల భక్తిభావాలు పెరుగుతాయి. సమాజంలో మంచివారితో స్నేహం పెరగడం మూలంగా పనులు నెరవేరుతాయి. కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు. విందులు, వినోదాలలో పాలు పంచుకుంటారు. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా కలిసివస్తుంది.

ధనుస్సు

ఈ వారంలో ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. తాత్కాలికంగా కొన్ని విషయాలలో మంచి ఫలితాలు కలగవచ్చు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారికి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. భార్యాపిల్లలతో సంతోషంగా వుంటారు. వ్యవసాయదారులకు దిగుబడి అనుకూలంగా ఉంటుంది. వాహనాల మూలంగా కొన్ని పనులు నెరవేరుతాయి. అన్నదమ్ములు, బంధువులతో సంబంధాలు పెంపొందుతాయి. నిర్మాణరంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి.

మకరం

ఈ వారంలో ఈ రాశి వారికి వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. న్యాయవాద, వైద్యవృత్తిలో ఉన్న వారికి కలిసి వస్తుంది. నిత్యావసర వస్తు, షేర్, వడ్డీ వ్యాపారాల్లో తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. ప్రయాణాలు బాగా కలిసివస్తాయి. శ్రద్ధతో పనులు చేస్తారు. ఇంట్లో భార్యాపిల్లలతో సంతోషంగా వుంటారు. వస్త్ర, వస్తువులను కొంటారు. నిర్మాణ రంగంలో ఉన్న వారు కొత్త పనులను ప్రారంభించకుండా పాతవి పూర్తి చేయడం అన్ని విధాలా మంచిది. రాజకీయంలో ఉన్నవారికి తాత్కాలిక ప్రయోజనాలు ఈ వారం ఉంటాయి.

కుంభం

ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అన్ని విషయాలలో మంచి జరుగుతుంది. కొంత ఓపిక, ఆలోచనలతో ముందుకు వెళ్లాలి. కొత్త వస్త్ర, వస్తువులు, ఆభరణాలను కొంటారు. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు చేస్తారు. ప్రభుత్వ, కార్పొరేట్ ఉద్యోగాలలో ఉన్న వారికి అన్ని విధాలుగా అనుకూలమైన వారం. ఉద్యోగంలో ప్రమోషన్‌లుంటాయి.

మీనం

ఈ వారంలో ఉద్యోగంలో ఉన్న వారు ఆఫీసులో అందరితోనూ సమన్వయంగా ఉంటారు. పై అధికారుల ఆదరణ చాలా పనులకు కలిసి వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారు స్వయం ప్రతిపత్తితో ముందుకు వెళతారు. ఉత్సాహంతో, ఉల్లాసంతో ఉంటారు. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. సంగీత, సాహిత్య అభిమానులకు అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రధానమైన గ్రహాల స్థితి ప్రతికూలంగా ఉంది. కనుక దీర్ఘకాలిక పెట్టుబడులు, వ్యాపారాలు చేసే ముందు ఆలోచించడం మంచిది. పుణ్యక్షేత్రాల సందర్శనతో మానసిక ప్రశాంతత పొందుతారు.

RasiPhalalu
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : [email protected]

2201
Tags

More News

VIRAL NEWS