మంచుకురిసే వేళలో..


Sun,December 1, 2019 02:20 AM

sweter
శీతాకాలం వచ్చేసింది.. చలి మొదలైంది.. వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు పరిచయ మవుతున్నాయి. ఎన్ని మారినా, ఏమొచ్చినా ఆఫీసుకు, బయటపనులకు వెళ్లక తప్పదు. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉన్నట్లే.. చలికి కూడా ఉంది. మంచు పడకుండా ఆపలేం కాబట్టి శరీరం మీద పడకుండా చూసుకోగలం. ఎలా అంటారా? అదేనండి స్వెటర్లు, టోపీలు.. పాతకాలం చలికోట్లు, టోపీలు పెట్టుకొని ఆఫీసుకి వెళ్తే అందరూ నవ్వుతారు.. సందర్భానికి తగినట్లుగా వేసుకొనేలా కొన్నిరకాల స్వెటర్ల గురించి ఈ వారం జంటకమ్మలో చదివి తెలుసుకోండి.

ఉలెన్‌ స్వెటర్‌

వీటిని రెగ్యులర్‌ స్వెటర్లు అని కూడా అంటారు. శీతాకాలం రాగానే గుర్తొచ్చే మొట్టమొదటి స్వెటర్‌ ఇదే అని చెప్పవచ్చు. ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి. వీటిలో వేర్వేరు రంగుల్లో రకరకాలుగా డిజైన్‌ చేసుకోవచ్చు. ఇవి ఎవరికి అయినా నప్పుతాయి. ఉన్నితో చేసిన స్వెటర్‌ శరీరానికి అంటుకొని వెచ్చదనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా రేయాన్‌, కాటన్‌, బ్లెండెండ్‌ ఫ్యాబ్రిక్‌తో రెగ్యులర్‌ స్వెటర్లు తయారు చేస్తుంటారు. శీతాకాలంలోనే కాకుండా సాధారణంగానూ ధరించవచ్చు.
sweter1

స్వెట్‌షర్ట్‌

శీతాకాలంలో ఎంత చల్లగా ఉన్నా బయట తిరిగేటప్పుడు చెమట పట్టక మానదు. ఒకవైపు చలి, మరోవైపు చెమట. రెండింటినీ బ్యాలెన్స్‌ చేసే విధంగా స్వెట్‌షర్ట్‌ను రూపొందించారు. వీటికి బటన్స్‌, జిప్‌ ఉండదు. బనియన్‌లా వేసుకోవాలి. స్ట్రెచ్‌బుల్‌గా ఉంటుంది. అన్ని వేళల్లో స్వెట్‌షర్ట్‌ వేసుకోవచ్చు. ధరించినప్పుడు అందంగా కనిపిస్తారు. జిమ్‌లో వర్కౌట్స్‌, నైట్‌వేర్‌గానూ ధరించవచ్చు. ఉన్ని, నైలాన్‌, పాలిస్టర్‌, ఫ్లీస్‌, విస్కోస్‌, కాటన్‌ ఫ్యాబ్రిక్‌తో స్వెట్‌షర్ట్స్‌ తయారుచేస్తారు.
sweter2

పుల్‌ఓవర్‌

స్వెటర్‌కు పర్యాయపదం పుల్‌ఓవర్‌. ఇవి చాలా సింపుల్‌గా కనిపిస్తాయి. దీనికి జిప్పర్‌లు, బటన్‌లు అటాచ్‌ చేసి ఉంటారు. వీటి ద్వారా సులువుగా ధరించవచ్చు. ఇవి రకరకాల నెక్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. శీతాకాలంలో ఈ స్వెటర్లు సర్వ సాధారణం. కొంచెం గాలిని కూడా లోపలికి పోనివ్వకుండా అడ్డుకుంటుంది. ఈ స్వెటర్లు ధరించినవారికి సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా గ్రాండ్‌లుక్‌నిస్తుంది. సాధారణ సందర్భాలకు వీటిని ధరించవచ్చు. రేయాన్‌, కాష్మెర్‌, కాటన్‌, బ్లెండెడ్‌ ఫ్యాబ్రిక్‌లలో ఈ స్వెటర్లు తయారు చేస్తారు.
sweter3

రోబ్‌ స్వెటర్‌

శీతాకాలంలో రోబ్‌స్వెటర్లు కొత్త ట్రెండ్‌గా నిలుస్తున్నాయి. అమ్మాయిలు ఎక్కువగా వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. నెక్‌ నుంచి యాంకిల్స్‌ వరకు పొడవుగా ఉంటుంది. రెండువైపులా పాకెట్లు అమర్చి ఉంటాయి. మధ్యలో ఫ్యాంట్‌, టీషర్ట్‌ కనిపించేలా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే డాన్‌లా కనిపిస్తారు. ఇది చాలా మెత్తగా ఉంటాయి. ప్రయాణాలకు, రోడ్‌ట్రిప్స్‌, సాధారణంగా ధరించవచ్చు. రేయాన్‌, కాష్మెర్‌, కాటన్‌, బ్లెండెండ్‌ ఫ్యాబ్రిక్‌తో ఈ స్వెటర్‌ను తయారు చేస్తారు.
sweter4

హుడీ స్వెటర్‌

హూడీ స్వెటర్‌ ప్రయాణాలు, షికార్లకు సరైన ఎంపిక. హుడీస్‌ రాప్‌స్టార్లు, స్ట్రీట్‌ పంక్‌ ఫ్యాషన్‌ రావడంతో ఫ్యాషన్‌ వెలుగులోకి వచ్చింది. ఇది స్వెట్‌షర్ట్‌ ఆకారంలో ఉండి నెక్‌వద్ద రెండు తాళ్లు, కింది భాగంలో రెండువైపులా అటాచ్డ్‌ పాకెట్లు ఉంటాయి. కూల్‌లుక్‌ ఇస్తుంది. వీటిలో చాలా వైరైటీలు ఉన్నాయి. ధరించినప్పుడు సౌకర్యంగా ఉంటుంది. తక్కువ బరువుతో దీన్ని తయారు చేశారు. ఈ స్వెటర్‌ను నైట్‌వేర్‌, స్లీప్‌వేర్‌, క్యాజువల్‌వేర్‌గా ధరించవచ్చు. పాలిస్టర్‌, కాటన్‌తో తయారు చేస్తారు.
sweter5

కేప్‌ స్వెటర్‌

కొత్తగా పెండ్లయిన వారు హనీమూన్‌కు వెళ్లేవారు కేప్‌ స్వెటర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందులోనూ శీతాకాలం. ఇది స్లీవ్స్‌ కత్తిరించి పొడవుగా ఉంటాయి. కొన్ని షర్ట్‌ వరకే ఉంటాయి. కొంతమంది యాంకిల్స్‌ వరకు పొడవుగా ఉండేవాటిని ఇష్టపడుతారు. పొడవైన బూట్లతో అందమైన కేప్‌ స్వెటర్‌ వేసుకుంటే అందరిచూపు మీపైనే ఉంటుంది. పార్టీలకు, క్లబ్‌లకు వెళ్లేటప్పుడు ఈ స్వెటర్‌ ధరించవచ్చు. రేయాన్‌, కాష్మెరా, కాటన్‌, బ్లెండెండ్‌ ఫ్యాబ్రిక్‌తో తయారు చేస్తారు.
sweter6

పోంచో స్వెటర్‌

శీతాకాలం రాగానే అమ్మాయిల వార్డ్‌రోబ్‌లో ఈ రకం స్వెటర్లు ఐదారున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇవి స్వెటర్లుగానే కాదు వెస్ట్రన్‌లుక్‌ని కూడా ఇస్తాయి. కాలేజ్‌కు వెళ్లే అమ్మాయిలు స్వెటర్లు వేసుకోవాలంటే ఇష్టపడరు. వీటిని చూపించగానే ఓకే అనేస్తారు. భుజాలపై చక్కగా కూర్చొని తల్లిప్రేమ లాగా మిమ్మల్ని కప్పి ఉంచుతాయి. క్రోచెట్‌, బ్లెండెడ్‌, కాటన్‌, లైక్రా వంటి ఫ్యాబ్రిక్‌లతో పోంచో స్వెటర్స్‌ తయారు చేస్తారు. విభిన్న రంగులలో ఉత్తమంగా కనిపిస్తాయి.
sweter7

థర్మల్‌ స్వెటర్‌

శీతాకాలంలో చలి నుంచి తప్పించుకొనేందుకు థర్మల్‌ స్వెటర్‌ సరైన ఎంపిక. ఇది శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చి, ఉత్సాహంగా ఉంచుతుంది. బయట చలిని లోపలికి ప్రవేశింపనీయకుండా అడ్డుకుంటుంది. వీటిలో అందమైన డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా తక్కువ బరువుతో ఉంటాయి. ఈ స్వెటర్‌లో అమ్మాయిలు అందంగా కనిపిస్తారు. దీన్ని నైట్‌వేర్‌గానూ ధరించవచ్చు. స్పాండెక్స్‌ బ్లెండ్‌, కాటన్‌, పాలిస్టర్‌తో తయారు చేస్తారు.
sweter8

కార్డిగాన్‌ స్వెటర్‌

ఈ రకం స్వెటర్‌, షర్ట్‌ను పోలి ఉంటుంది. దగ్గర దగ్గరగా బటన్లు ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సులువుగా వేసుకునే విధంగా ఉంటుంది. చిన్నపిల్లలు ఎక్కువగా దీన్నే ఇష్టపడుతారు. దీనిలో చాలా డిజైన్లు ఉంటాయి. ఎంత సులువుగా ధరించవచ్చో అంతే సులువుగా తొలగించవచ్చు. ఈ స్వెటర్లను సాధారణంగా ధరించవచ్చు. రేయాన్‌, కాష్మెర్‌, కాటన్‌, బ్లెండెండ్‌ ఫ్యాబ్రిక్‌తో తయారు చేస్తారు.
sweter9

జంపర్‌ స్వెటర్‌

చూడ్డానికి ఫుల్‌హ్యాండ్స్‌ టీషర్ట్‌లా కనిపించినా దీన్ని జంపర్‌ స్వెటర్‌ అంటారు. ఇది చాలా వదులుగా ఉంటుంది. అయినా వెచ్చగా ఉంటుంది. బిగుతుగా ఉండే జీన్స్‌ మీదకి జంపర్‌ స్వెటర్‌ ధరిస్తే అందంగా కనిపిస్తారు. దీన్ని రెగ్యులర్‌గా ధరించవచ్చు. ఇంట్లోనే కాకుండా కాలేజ్‌, ప్రయాణాలకు వేసుకోవచ్చు. రేయాన్‌, కాష్మెర్‌, కాటన్‌, బ్లెండెడ్‌ ఫ్యాబ్రిక్‌తో బంపర్‌ స్వెటర్లు తయారు చేస్తారు.
sweter10

602
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles