నెట్టిల్లు


Sun,November 10, 2019 03:58 AM

లఘచిత్ర నిడివి చిన్నదే అయినా కటెంట్ ముఖ్యం. ఇలాంటి కంటెంట్‌తో నేటి తరం లఘుచిత్రాలు తీస్తూ ప్రతిభను కనబరుస్తున్నారు. ఇట్లా కిందటి వారం యూట్యూబ్‌లో కొన్ని లఘుచిత్రాలు వచ్చాయి. వాటి సమీక్షలే ఇవి.

శాస్త్రి వెడ్స్ బేగం

దర్శకత్వం: సాయికుమార్ అల్లూరి
నటీనటులు : రాజేశ్ ఖన్నా, భ్రమరాంబిక
శాస్త్రి, బేగం చిన్నప్పటి నుంచీ ప్రేమించుకుంటారు. పెండ్లి విషయం ముందు బేగం వాళ్ల ఇంట్లో చెప్తుంది. ఎలాంటి పట్టింపులు లేకుండా ఆ తండ్రి ఒప్పుకుంటాడు. శాస్త్రిని కూడా తన ఇంట్లో ఒప్పించాలని కోరతాడు. దీనికి సంతోషిస్తాడు శాస్త్రి. కానీ ఇక్కడే ఓ ఘటన జరుగుతుంది. బేగం తండ్రికి ఎలాంటి మతపట్టింపులు లేకపోయినా తోటి వారు దాని గురించి చెప్తారు. మతాంతర పెండ్లి చేసుకుంటే తోటివారందరిలో ఎలా ఉంటుందో చెప్తారు. దీంతో ఆయన ఆలోచిస్తాడు. శాస్త్రిని మతం మారాల్సిందిగా కోరతాడు. దీనికి శాస్త్రి కూడా ఒప్పుకుంటాడు. ఇదే విషయం శాస్త్రి తల్లిదండ్రులకు చెప్తాడు. దీనికి వాళ్లు నిరాకరిస్తారు. మేం చచ్చినట్టుగా భావిస్తే నువ్వు మతం మారి ఆ పెండ్లి చేసుకో, లేదంటే మన ఆచారాల ప్రకారం ఆ అమ్మాయిని తీసుకురా అంటారు. ఏం చేయాలో అర్థం కాదు. పెండ్లికి పెద్దలు అడ్డం రాకపోయినా, మత ఆచారాలు అడ్డం వస్తాయి. చివరికి వారు తల్లిదండ్రులను కాదని పెండ్లి చేసుకుంటారా, దూరం అవుతారా? యూట్యూబ్‌లో చూడండి.
Sastri-weds-Begum


Total views 40,372+ (నవంబర్ 2 నాటికి) published on Oct 27, 2019చూసి చూడంగానే..

దర్శకత్వం: ఫణి
నటీనటులు : దివ్య, టోని, మహేశ్
ప్రీతి కొంచెం మోడ్రన్ అమ్మాయి. ఎన్‌ఆర్‌ఐ పెండ్లి సంబంధాలు వస్తాయి. కానీ ఇంట్లో టైం అడుగుతుంది. ఒకరోజు పార్కులో ఉన్నప్పుడు వరుణ్ వస్తాడు. తనను కొన్ని రోజులుగా చూస్తున్నట్టు, ప్రేమిస్తున్నట్టు చెప్తాడు. ప్రీతి వెంటనే సరే అంటుంది. వరుణ్‌కు అర్థం కాదు. అప్పుడు ప్రీతి చెప్తుంది తను కూడా వరుణ్‌ను చాలారోజుల నుంచి ప్రేమిస్తున్నట్టు, తెలియజేయడానికి భయపడుతున్నట్టు చెప్తుంది. వరుణే వచ్చి ప్రేమగురించి చెప్పడంతో ఇద్దరూ ఆనందిస్తారు. కలిసి తిరుగుతారు. ఈ క్రమంలో వరుణ్ కొంచెం సామాజిక బాధ్యతలు, మానవత్వం అని దానం చేయడం, ఆనాథాశ్రమాలకు వెళ్లడం చేస్తాడు. ఇదంతా ప్రీతికి నచ్చదు. చాలాసార్లు చెప్పినా వరుణ్ పట్టించుకోడు. తోచిన సాయం చేయడమే ముఖ్యం అంటాడు. తీవ్రంగా కోప్పడి ప్రీతి వెళ్లిపోతుంది. మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు వరుణ్. అదే పార్కులో కలుసుకొని మాట్లాడతాడు. కానీ ఓ ఘటన ప్రీతి అభిప్రాయాన్ని మార్చేస్తుంది. అదేంటో అర్థం కావాలంటే యూట్యూబ్‌లో చూడండి. మేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, బాగున్నాయి.
chusi-chadangane

Total views 2,043+ (నవంబర్ 2 నాటికి) Published on Oct 28, 2019

నన్ను దోచేశావే

దర్శకత్వం: వంశీ
నటీనటులు : కుమర్, రసజ్ఞ
అప్పుడే వీధిలోకి వచ్చిన అమ్మాయి. తననే ఫాలో అయిన అబ్బాయి. నాలుగు రోజుల తర్వాత అడ్డంపడి పలకరిస్తాడతను. తనను ప్రేమిస్తున్నట్టు చెప్తాడు. మాటలతో ఇంప్రెస్ చేయడానికి చూస్తాడు. కొన్ని రోజులు ఇలాగే నడుస్తుంది. ఓ రోజు అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆమె కూడా బాగానే స్పందించినా నేరుగా చెప్పదు. అర్థం కానీ మాటలు మాట్లాడుతుంది. క్లాస్ కూడా పీకుతుంది. చదువు, కలలు, భవిష్యత్ అంటూ మాట్లాడుతుంది. అప్పుడు అతను స్పందిస్తూ నేనూ చదువుకున్నాను. టాపర్‌ను నాకూ లక్ష్యాలున్నాయి. కానీ, ప్రేమంటే ఈ వయస్సులోనే కదా అని అతను థియరీ చెప్తాడు. అమ్మాయి తన అభిప్రాయం చెప్తుంది. అతనికి అర్థం కాదు. తలమునకలవుతాడు. ఒకరోజు వెంటపడి సూటిగా అడుగుతాడు. అతనికి అర్థం అవుతుంది. మీకూ అర్థం కావాలంటే యూట్యూబ్‌కు వెళ్లండి. బాగుంటుంది. నిర్మాణం, పాత్రలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటాయి.
Nannu-Dochesave

Total views 17,262+ (నవంబర్ 2 నాటికి) Published on Oct 27, 2019

నటుడు

దర్శకత్వం: అనిల్ అర్జున్
నటీనటులు : విష్ణు, రామకృష్ణ
నెరవేరుతుందో లేదో తెలియని ఓ లక్ష్యం కోసం అతను ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాడు. పాతికేండ్లు అతనికి. హైదరాబాద్ వచ్చి స్థిరపడతాడు. పండగలొచ్చినా, ఏం వచ్చినా ఇంటికి వెళ్లడు. సాధారణంగానే తల్లి దిగాలు పడుతుంటుంది. ఇతను ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా, నిద్రలేని రాత్రులు గడిపినా ఆనందంగానే ఉన్నట్టు తల్లికి చెప్తాడు. మరోవైపు రోజులు గడిచే కొద్దీ ఆందోళన ఎక్కువవుతుంటుంది. మరోవైపు తల్లి తరచూ ఫోన్ చేసి బాగోగుల గురించి అడుగుతుంది. దీంతో కోపం తెచ్చుకుంటాడు అతను. ఓ రోజు ఇక తల్లిని బాధపెట్టడకూడదనీ, ఇంటికి వెళ్లి వాళ్లతో ఉందాం అని నిర్ణయించుకుంటాడు. తల్లిదండ్రులను బాధపెడుతూ ఇతను కలలు కనడం కంటే, వాళ్లను సంతోషపెట్టే పని ఏదైనా చేయాలనుకుంటాడు. మరి.. అతను తిరిగి ఇంటికి వెళ్తాడా? లేక హైదరాబాద్‌లోనే ఉండి తన ప్రయత్నాలు చేశాడా? యూట్యూబ్‌లో చూడండి.
Natudu

Total views 695+ (నవంబర్ 2 నాటికి) Published on Oct 31, 2019

-వినోద్ మామిడాల, సెల్: 7660066469

185
Tags

More News

VIRAL NEWS