రాశి ఫలాలు


Sun,November 10, 2019 01:06 AM

10-11-2019 నుంచి 16-11-2019 వరకు

మేషం

ఈ వారం ఈ రాశి వారికి ప్రశాంతత చేకూరుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూ లిస్తాయి. మంచి పేరు సంపాదిస్తారు. పిల్లల చదువు, ఉద్యోగం, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. కొత్త వస్త్ర, వస్తువులు కొంటారు. హోటలు, క్యాటరింగు, ఉపాధ్యాయ, సంగీత, సాహిత్య, సినిమా రంగాలలోని వారు సంతృప్తిగా ఉంటారు. కొత్త అవకాశాలు వస్తాయి. ప్రయాణాలు బాగా కలిసివస్తాయి. ఆనందంతో పనులు చేస్తారు. నిత్యావసర వస్తు వ్యాపారం, వడ్డీ, షేర్ వ్యాపారాలలో ఉన్న వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
Rasi-phalalu

వృషభం

వృత్తి, వ్యాపార, ఉద్యోగ పనులు ముందుకు సాగుతాయి. అనుకూలిస్తాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాలు లాభదాయకం. ఇంజినీరింగు, రియల్ ఎస్టేట్, వ్యవసాయ రంగాల్లో ప్రధానంగా ఆశావహంగా ఉంటుంది. వ్యాపారం అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విష యంలో ఆచితూచి వ్యవహరించాలి. లేదా కొన్ని రోజులకు వాయిదా వేసుకోవడం మంచిది. నలుగురిలో మంచి పేరు ఉండడంతో కొన్ని పనులలో సంతృప్తి ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శనలతో కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.

మిథునం

ఈ వారం గురు సంచారం అనుకూలంగా ఉంది. పనులు కలిసొస్తాయి. మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నా యి. కాబట్టి ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. పనులు సకాలంలో పూర్తవుతాయి. నలుగురిలో పేరును పొందుతారు. దేవతా గురుభక్తి పెరుగుతుంది. ఉన్నత విద్యా ప్రయత్నాలు కొనసాగుతాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆఫీసులో అందరితోనూ సమన్వయంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. షేర్, వడ్డీ వ్యాపారాలకు దూరంగా ఉండడం మంచిది.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. కొన్ని విషయాలలో తాత్కాలిక ప్రయత్నాలు గోచరిస్తున్నాయి. నిత్య వ్యాపారం కలిసొస్తుంది. షేర్, వడ్డీ వ్యాపారాల్లో పెట్టుబడులు కొంత లాభదాయకంగా ఉంటాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. నూతన వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. పనివారితో సమస్యలు తీరుతాయి. పనులను ఉత్సాహంతో చేస్తారు. సమాజంలో అనుభవజ్ఞుల సహాయ సహకారాలు, ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో మంచివారి సాహచర్యంతో పనులు ముందుకు సాగుతాయి.

సింహం

ఉద్యోగులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. తోటి వారితో, పై అధికారులతో సమన్వయం ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆనందంతో సమయాన్ని గడుపుతారు. వ్యవసాయదారుల పనులు పూర్తవుతాయి. నిర్మాణ రంగంలోని వారు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. పోటీ పరీక్షలలో మంచి స్థాయిలో నిలుస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య

ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా యి. ఈ వారం తాత్కాలిక ప్రయోజనాలు ఉండవచ్చు. నిత్య వ్యాపారం కొంత లాభిస్తుంది. నిత్యావసర వస్తు వ్యాపారం, షేర్, వడ్డీ, హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాల్లో కొంత ఆలోచనా పూర్వకంగా పెట్టుబడులు పెడుతూ ముందుకు వెళితే ఈ వారం బాగా కలిసివస్తుంది. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. నలుగురిలో ఉన్న మంచి పేరు మూలంగా పిల్లల వివాహ ప్రయత్నాలలో కొంత కలిసివస్తుంది.

తుల

సమయానికి పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు, క్షేత్రాలను సందర్శిస్తారు. పుణ్యస్నానాలను ఆచరిస్తారు. రావాల్సిన డబ్బు అందుతుంది. ఆర్థిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. కిందిస్థాయి వారితో సమన్వయం ఏర్పడుతుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది. సుదీర్ఘ ప్రయత్నాలు అవసరం.

వృశ్చికం

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. పోటీ పరీక్షలలో మంచి స్థాయిలో నిలుస్తారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచివారి సాహచర్యంతో పనులు చాలా మటుకు నెరవేరుతాయి. పిల్లలు, భార్య, ఆత్మీయులతో సంబంధాలు పెంపొందుతాయి. విందులు, వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సహాయ సహకారాలు అందినప్పటికీ సద్వినియోగ పరచుకోక పోవడంతో పనులలో ఆలస్యం ఉంటుంది.

ధనుస్సు

ఈ వారంలో ఈ రాశి వారికి తాత్కాలిక ప్రయోజనాలుంటాయి. వ్యవసా య రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. ఇరుగు పొరుగువారితో మంచి సంబంధాలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్, వ్యాపారాలు అనుకూలిస్తాయి. అన్నదమ్ములు, బంధువులతో పనులు నెరవేరుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. న్యాయవాద, వైద్యవృత్తిలో ఉన్న వారు సమయానుకూల నిర్ణయాలవల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో రాణిస్తారు. అధికారులతో సమన్వయంగా ఉంటారు.

మకరం

ఈ వారంలో ఈ రాశి వారికి అనవసరమైన ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆలోచనలను అమలు చేసే క్రమంలో ఉత్సాహం కనబరుస్తారు. శ్రద్ధతో పనులు చేస్తారు. వ్యాపారం అనుకూలంగా ఉం టుంది. న్యాయవాద, వైద్య వృత్తిలోని వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాలలోమంచి ఫలితాలుంటాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలోని వారికి పైవారితో, కార్యకర్తలతో మంచి సంబంధాలు పెంపొందుతాయి. తద్వారా మంచి పేరు సంపాదిస్తారు.

కుంభం

పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. పోటీ పరీక్షలలో మంచి స్థాయి లో నిలుస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. మంచివారితో సంబంధ బాంధవ్యాలు పెంపొందుతాయి. రావాల్సిన డబ్బు అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. తల్లిదండ్రులు, పెద్దవారి సలహాలు, సూచనలకు ప్రాధాన్యం ఇస్తారు. నిర్మాణ రంగాల్లో చేపట్టిన పనులు పూర్తవుతాయి.

మీనం

ఈ వారంలో ఈ రాశివారికి ప్రధానమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో తాత్కాలిక లాభాలు ఉంటాయి. దీర్ఘకాలిక పనులు ప్రారంభించే ముందు ఆలోచించడం అన్ని విధాలుగా మంచిది. నిత్య వ్యాపా రం కలిసివస్తుంది. న్యాయవాద, వైద్య వృత్తులలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది. స్థిరమైన ఉద్యోగం కోసం ప్రయత్నాలు అవసరం. విద్యార్థులు శ్రమించాలి. వివాహ ప్రయత్నాల్లో భాగంగా నలుగురిలో మంచిపేరు వల్ల సమయం కలిసి వస్తుంది.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : [email protected]

1442
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles