పసందైన పర్యాటకం కర్నాటకం


Sun,October 27, 2019 02:25 AM

పర్యాటక రంగంలో కర్నాటకకు ప్రత్యేక స్థానముంది. కూర్గ్, నంది హిల్స్, చిక్‌మంగళూరు వంటి హిల్ స్టేషన్స్, పట్టదకళ్, హలేబీడు, హంపి వంటి శిల్పకళా వేదికలతోపాటు మైసూరు, మంగళూరు, బెంగళూరు వంటి మహానగరాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలైన గోకర్ణం, ఉడిపితోపాటు ఎంతో అందమైన సముద్ర తీరం ఉన్న రాష్ట్రం కర్నాటక. ఇక్కడ చూడటానికి ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.

శ్రావణ బెళగొళ

కర్నాటకలోని హాసన్ జిల్లాలో శ్రావణబెళగొళ ఉంది. ఇది బెంగళూరు నుంచి 158 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జైనులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షత్రం. ఈ పట్టణం మధ్యలో ఒక కొలను ఉంది. దీనికి శ్వేత కొలను లేదా ధవళ సరోవరం అని పేరు. ఈ శ్వేత కొలనుకు కన్నడంలో బెళగొళ అని అంటారు. శ్రవణుడు అంటే గోమఠేశ్వరుడి బెళగొళ కాబట్టి ఈ ప్రాంతానికి శ్రావణ బెళగొళ అని పేరు వచ్చింది. శ్రావణ బెళగొళకు ప్రాముఖ్యాన్ని తీసుకొచ్చింది బాహుబలి గోమఠేశ్వరుడు. ఇది ఇంద్రగిరి పర్వతం పై 59 అడుగుల ఎత్తుగల ఈ ఏకశిలా విగ్రహం కాయోత్సర్గ భంగిమలో నగ్నంగా నిలబెట్టి వుంటుంది.
Viharam

మురుడేశ్వర

కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ తాలూకాలోని చిన్న పట్టణం మురుడేశ్వర. ఇది అరేబియా సముద్రం ఒడ్డున ఉంది. ఇక్కడి ఉన్న ప్రధాన శివాలయంలో శివుడు మురుడేశ్వరుడి పేరుతో అర్చనలు అందుకుంటున్నాడు. ఇది ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం. శివుడి ఆత్మలింగం ఇక్కడ ప్రతిష్ఠితమైందని చెబుతారు. అందువల్లే దీనిని భూ కైలాసంగా పేర్కొంటారు. ఇక్కడ మురుడేశ్వర కోట, శివుని విగ్రహం చూడదగినవి. 123 అడుగులు అంటే 37 మీటర్ల ఎత్తు ఉన్న ఈ శివుడి విగ్రహం చెక్కడానికి ఏడాది పట్టింది. ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే సూర్యరశ్మి పడినప్పుడు మెరుస్తుంది.
murudeshwara

విరూపాక్ష దేవాలయం

హంపి వీధికి పశ్చిమ చివర విరూపాక్ష దేవాలయం ఉంది. 50 మీటర్ల ఎత్తున ఉన్న తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయంలోనికి స్వాగతం పలుకుతుంది. దేవాలయంలో ప్రధాన దైవం విరూపాక్షుడు (శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానం గా పంపాదేవి గుడి, భువనేశ్వరిదేవి గుడి ఉంటా యి. ఈ దేవాలయానికి 7 వ శతాబ్దం నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉంది. విరూపాక్ష -పంపా ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముం దు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నా యి. 10-12 శతాబ్దానికి చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయసలుల కాలంలో మార్పులు జరిగాయి.
Virupaksha-Temple

హంపి

భారతదేశ చరిత్రలో హంపిది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య రాజధాని ఇది. ప్రస్తుతం బళ్లారి జిల్లాలో ఉంది. 14వ శతాబ్దం నగర అవశేషాలు 26 చదరపు కి.మీ. విస్తీర్ణం లో ఉంటాయి. ఉత్తరం వైపు తుంగభద్రా నది మిగతా మూడువైపుల పెద్ద పెద్ద గ్రానైటు శిలలు అప్పటి విజయనగర వీధుల వైభవాన్ని తెలుపుతాయి. ఈ పట్టణంలోకి ప్రవేశిస్తుంటే కనిపించే విశాలమైన భవంతులు, పెద్ద పెద్ద ప్రాకారాలు అప్పటి నగర నిర్మాణ నైపుణ్యాన్ని చాటుతాయి.
HAMPI

కూర్గ్

కర్నాటకలో ప్రముఖ హిల్ స్టేషన్లలో ఒకటి కూర్గ్. ఒకవైపు పచ్చటి చెట్లు, మరోవైపు గంభీరంగా జాలువారే జలపాతాలతోపాటు అంతరించే స్థితికి చేరుకున్న ఎన్నో జంతువులకు ఈ కూర్గ్ నెలవు. పచ్చని అందాల్ని తనివితీరా వీక్షిస్తూ జలపాతాల హోరులో సందడి చేస్తూ పర్యటించడం మరిచిపోలేని అనూభూతిని మిగుల్చుతుంది. ముఖ్యంగా హానీమూన్ జంటలు ఎక్కువ మంది ఈ సమయంలోనే ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడి అబ్బే ఫాల్స్, బ్రహ్మగిరి, దుబారే ఎలిఫెంట్ క్యాంప్, ఇరుప్పు ఫాల్స్, నాగర్ హోల్ నేషనల్ పార్క్, చిత్తాలి, బైలుకుప్పే, కావేరి నిసర్గధామ తదితర ప్రాంతాలను చూడదగినవి.
COORG

730
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles