రాశి ఫలాలు


Sun,October 20, 2019 12:47 AM

20-10-2019 నుంచి 26-10-2019 వరకు

మేషం

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. శ్రద్ధతో, సమయస్ఫూర్తితో పనులు చేస్తారు. ఆత్మీయుల సలహాలు పనుల్లో కలిసొస్తాయి. వ్యవసాయదారులకు, రియల్‌ ఎస్టేట్‌ వారికి అనుకూలంగా ఉంది. వారాంతంలో వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. పిల్లల చదువు, శుభకార్యాల విషయంలో రెట్టింపు ప్రయత్నాలు అవసరం. పెద్దల సహవాసంతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు వారిపని వారు చేసుకుంటూ వెళ్లడం మంచిది. సమస్యలను అధిగమించడానికి సూచనలు, సలహాలకు ప్రాధాన్యమివ్వాలి.

వృషభం

ఈ రాశి వారు ఈ వారంలో ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆఫీసులో అందరితోనూ కలిసి మెలసి ఉంటారు. అనుకూల ట్రాన్స్‌ఫర్‌లు, ప్రమోషన్‌లుంటాయి. నిత్య క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. పిల్లల చదువు, ఉద్యోగం, శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచివారి సహాయ సహకారాలు పొందుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రల వల్ల మన శ్శాంతిని పొందుతారు. పనివారితో సమస్యలు తగ్గుముఖం పడతాయి. వారాంతంలో షేర్‌, వడ్డీ వ్యాపారాలకు దూరంగా ఉండడం మంచిది.

మిథునం

భార్యా పిల్లలతో హాయిగా గడుపుతారు. వారాంతంలో క్రయ విక్రయాలు, పను లు కలిసివస్తాయి. అయితే అలసట మూలంగా ఆరోగ్య సమస్యలు, ఆలోచన లేకుండా పెట్టుబడులు పెట్టడంతో మానసిక ఇబ్బందులు, ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కొంటారు. అనానుకూల ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్‌లు. మంచి వారితో సాహచర్యం మూలంగా కొన్ని పనులు నెరవేరుతాయి. సాంగత్యానికి ప్రాధాన్యమివ్వాలి.నిర్మాణరంగంలో ఉన్న వారు కొత్త పనులు ప్రారంభించకుండా పాత పనులను పూర్తి చేయడం మంచిది.

కర్కాటకం

ఈ రాశివారికి ఈ వారం ఆత్మీయులతో, స్నేహితులతో బాంధవ్యాలు మెరుగు పడతాయి. వ్యవసాయదారులకు దిగుబడి అనుకూలంగా ఉంటుంది. భూమిని కొనుగోలు చేస్తారు. వాహనాల మూలం గా పనులు నెరవేరుతాయి. నిర్మాణ రంగంలోని వారికి ఆదాయం పెరుగుతుంది. భార్యాపిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. క్రయ విక్రయాలకు అనుకూలం. పనులు సకాలంలో పూర్తవుతాయి. చదువు, శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన డబ్బు వస్తుంది. పూర్వపు పనులు కూడా పూర్తవుతాయి. తీర్థయాత్రలు, నదీస్నానాలు ఆచరిస్తారు. మొత్తానికి ఈవారం బాగా అనుకూలిస్తుంది.

సింహం

ఈ వారంలో ఈ రాశి ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. అనుకూలమైన పనులు ఆఫీసులో అధికారులు అప్పగిస్తారు. తద్వారా మంచిపేరును సంపాదిస్తారు. వారాంతంలో క్రయ విక్రయములు లాభదాయకంగా ఉంటాయి. వారం ప్రారంభంలో క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రద్ధతో పనులు చేస్తా రు. అయితే ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కనుక దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.

కన్య

క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. భార్యాపిల్లలతో సౌఖ్యంగా వుంటారు. సభలకు, సమావేశాలకు హాజరవుతారు. ప్రయాణాల వల్ల పను లు నెరవేరుతాయి. శ్రద్ధతో పనులు చేస్తారు. ఉద్యోగంలో తోటివారితో మనస్పర్ధలు. పైఅధికారుల అనాదరణ. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు రెట్టింపు చేయాలి. పెద్దల విషయంలో భక్తి భావనలు ఉండడం మూలంగా కొన్ని పనులు ముందుకు సాగుతాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు యథాతథంగా ఉంటాయి.

తుల

భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఉపాధ్యాయ, వైద్య వృత్తులలో ఉన్న వారికి ఆదాయం కలిసి వస్తుంది. చరాస్తుల కొనుగోలుపై మనసు పెడతారు. వారాంతంలో వ్యాపారం కలిసివస్తుంది. పిల్లల చదువు, శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సంబంధాలు పెంపొం దుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. అన్ని విధాలుగా ఆదాయం పెరగడంతో కొత్త పనులను ప్రారంభిస్తారు. పనివారితో అనుకూలత ఉంటుంది.

వృశ్చికం

ముఖ్యమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అన్ని విషయాలలోనూ, ఆలోచనతో, ఓపికగా ముందుకు సాగాలి. అన్నదమ్ములు స్నేహితులు, బంధువర్గంతో కొన్ని పనులు నెరవేరుతాయి. వాహనాల వల్ల పనులు కలిసివస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వస్త్ర, వస్తువులను కొనుగోలు చేయడంపై మనసు పెడతారు. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలికంగా కొంత ఊరట లభిస్తుంది. పనులలో ఆటంకాలు ఉంటాయి. కనుక ఓపిక అవసరం.

ధనుస్సు

ఈ వారం అనుకూలంగా ఉంది. పనులు కలిసివస్తాయి. ఆఫీసులో అందరితోనూ సమన్వయంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. భార్యాపిల్లలతో హాయిగా గడుపుతారు. హోటలు, క్యారింగ్‌ బిజినెస్‌లలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. వారం ప్రారంభంలో క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. వారాంతంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. న్యాయవాద వృత్తుల్లో ఉన్న వారు కోర్టు వ్యవహారంలో అనుకూల ఫలితాలను పొందుతారు. రాజకీయంలో ఉన్న వారికి అనుకూలమైన వారం. ఖర్చుల నియంత్రణ చాలా అవసరం.

మకరం

పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచివారి సాహచర్యం ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. పోటీ పరీక్షలలో అనుకూలత ఉంటుంది. ఉన్నతవిద్య, విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. నిత్య వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు, ఉద్యోగంలో ప్రమోషన్‌లు, అనుకూల ట్రాన్స్‌ఫర్‌లుంటాయి. ఉత్తేజంతో ఉంటారు. శ్రద్ధతో పనులు చేస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి.

కుంభం

భార్యాపిల్లలతో హాయిగా గడుపుతారు. విందులు, వినోదాల్లో పాల్గొం టారు. హోటలు, క్యాటరింగ్‌, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలలో ఉన్నవారి ఆదా యం పెరుగుతుంది. వైద్య, న్యాయవాద వృత్తుల్లో ఉన్నవారికి పనులు కలిసివస్తాయి. కొత్త వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు. వారాంతంలో క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. వారం ప్రారంభంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి.

మీనం

భార్యాపిల్లలతో సంతృప్తిగా, హాయిగా గడుపుతారు. వస్త్ర, వస్తువు, నగలను కొంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సంగీత, సాహిత్య,సినిమా రంగాలలో ఉన్న వారికి ఈ వారం అనుకూలిస్తుంది. నిత్య వ్యాపారం లాభ సాటిగా ఉంటుంది. క్రయ విక్రయాలు, పెట్టుబడులు కలిసివస్తాయి. వైద్య, న్యాయవాద, ఇంజినీరింగ్‌, ఉపాధ్యాయ వృత్తులలో ఉన్న వారికి సంతృప్తికరంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో గుర్తింపు పొందుతారు. మంచివారితో బాంధవ్యాలు పెరుగుతాయి. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు.
rasi-phalalu
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌., ఫోన్‌: 040-27651530
ఈ మెయిల్‌ : [email protected]

3559
Tags

More News

VIRAL NEWS