ముచ్చటగా మూడింటిలో


Sun,September 8, 2019 03:09 AM

తెలుగు, కన్నడ, తమిళ ప్రాంతాలతో సంబంధం లేకుండా చిత్రపరిశ్రమలో అభినయానికి, గ్లామర్‌కు చాన్స్‌ ఉంటుంది. ఇలాంటి చాన్స్‌నే అందుకుంది చెన్నయ్‌ చిన్నది ‘ప్రియాంక అరుల్‌ మోహన్‌'. ఒకేసారి ఒక తమిళ్‌, రెండు తెలుగుసినిమాలకు సైన్‌ చేసింది. ప్రస్తుతం విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ‘నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌' సినిమాలో హీరోయిన్‌గా కనిపిస్తున్న ఈ చిన్నదాని గురించిన కొన్ని సంగతులు.
priyanka
ప్రియాంక పుట్టింది చెన్నయ్‌లో. చదువుకుందిబెంగళూర్‌లో. ప్రియాంక బెంగళూర్‌లో చదువుకునేటప్పుడు నటనలో అనుభవం పొందేందుకు రెండు నాటకాల్లో నటించింది. అట్లాగే థియేటర్‌ ఆర్ట్స్‌ కోసం ప్రయత్నాలు కూడా చేసింది.థియేటర్‌ ఆర్ట్స్‌లో ప్రియాంక ఆసక్తిని తల్లిదండ్రులు అర్థం చేసుకుని, ప్రోత్సహించారు.ప్రియాంక ఫ్యామిలీకి సినిమాలతో సంబంధం లేదు. కానీ ప్రియాంకకు యాక్టింగ్‌ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా సినిమాల్లో నటించాలన్నది ఆమె కోరిక.
తల్లి కన్నడ, తండ్రి అరుణ్‌ మోహన్‌ తమిళనాడు. చెన్నయ్‌లో స్థిరపడ్డారు.
priyanka1
ఓసారి తీసిన సాధారణ ఫొటోషూట్‌ మరిన్ని సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది ప్రియాంకకు. అది చూసే ‘మైత్రీ మూవీ మేకర్స్‌', ‘నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌' చిత్ర బృందాలు ప్రియాంకను సంప్రదించాయి. ప్రస్తుతం తమిళ్‌, కన్నడ, తెలుగులో బిజీగా గడుపుతున్న ప్రియాంక సౌత్‌ అన్నిభాషల్లో చేస్తానంటున్నది.
డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న కిషోర్‌ రెడ్డి.. శర్వానంద్‌తో తీస్తున్న ‘శ్రీకారం’ సినిమాలో ప్రియాంక నటిస్తున్నది. అట్లాగే తమిళ్‌ డైరెక్టర్‌ నెల్సన్‌ దర్శతక్వంలో వస్తున్న మరో సినిమాకు కూడా టైం ఇచ్చింది ప్రియాంక.‘ఇలాంటి అవకాశాలు వస్తాయని ఊహించలేదనీ, అసలు చేస్తున్నది నేనేనా’ అని అశ్చర్యపోతున్నది ప్రియాంక.
-వినోద్‌ మామిడాల

690
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles