బాప్‌రే బాప్‌..వీరంతా డూప్‌!


Sun,September 8, 2019 02:00 AM

మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురుంటారని విన్నాం. ఆ భావన ఎంత బాగుందో కదా. నిజానికీ అలాంటి వారు మనకు అక్కడక్కడా తారసపడుతూనే ఉంటారు. వీరిలో సెలబ్రిటీలను పోలిన వారికి మాత్రమే అధిక గుర్తింపు వస్తుంది. ఇటీవల సోషల్‌ మీడియాలో ఎంతో మంది సినీ స్టార్ల మాదిరిగా ఉన్నవారి ఫొటోలు పెడుతున్నారు. తమ అభిమానం చాటుకునేందుకు డూప్‌ హీరోలను కలిసి మరీ ఫొటోలు దిగుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎవరు ఎవరిలా ఉన్నారంటే..
Samantha-Ashureddy
సమంత - అషురెడ్డి: సమంతని పోలి ఉండే అషురెడ్డి సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌. ‘చల్‌ మోహన్‌ రంగ’ సినిమాలో కూడా నటించింది. కానీ అషు ప్రస్తుతం బాగా మారిపోయింది. బరువు పెరిగింది. తెలుగు బిగ్‌బాస్‌ 3లో కంటెస్టంట్‌ వెళ్లి తాజాగా ఎలిమినేట్‌ అయ్యింది.
tamanna
తమన్నా - లీలా ఝుమాని: టీవీ నటి, మోడల్‌ లీలా చూడడానికి తమన్నాలా కనిపిస్తుంది. ఈమెను తమన్నా అనుకుని చాలామంది మేడం సెల్ఫీ ప్లీజ్‌ అని అడుగుతున్నారట!

kamalhasan
కమల్‌హాసన్‌: ఆ మధ్య హీరో విశాల్‌ సినిమా షూటింగ్‌ కోసం వేరే దేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఎయిర్‌పోర్టులో కమల్‌హాసన్‌లానే ఉన్న ఓ వ్యక్తి ఫొటో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Anushkasharma
అనుష్క శర్మ - జూలియా మైకెల్స్‌: జూలియా మైకేల్స్‌ అనే అమెరికన్‌ పాప్‌ సింగర్‌ అనుష్కలానే ఉంటుంది. ఆమె ఫొటో కొద్ది రోజుల క్రితం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది.

virat-kohli
విరాట్‌ కోహ్లీ - పాకిస్తాన్‌ సిటిజన్‌: ఇండియన్‌ క్రికెటర్‌ విరాట్‌ పోలికలతో పాకిస్తాన్‌లో ఓ వ్యక్తి ఉన్నాడు. అలానే న్యూజిలాండ్‌, ఇండియా మ్యాచ్‌ జరిగినప్పుడు స్టేడియంలో విరాట్‌ పోలికలతో ఉన్న ఓ వ్యక్తి ఫొటోలు బాగా వైరల్‌ అయ్యాయి.

NTR
ఎన్టీఆర్‌ - షమీందర్‌ సింగ్‌: పంజాబ్‌కు చెందిన షమీందర్‌ సింగ్‌ అచ్చుగుద్దినట్లుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ మాదిరిగానే ఉంటాడు. 26 ఏండ్ల షమీందర్‌సింగ్‌కు అక్కడ
అభిమానులు కూడా ఉన్నారంట!

Ranabeer-kapur
రణబీర్‌ కపూర్‌ - జునైద్‌ షా: వీరిద్దరిలో ఎవరు నిజమైన రణబీర్‌ అనేది పోల్చుకోలేం. అలా ఉన్నారు.

amithab
అమితాబ్‌ - ఆంధ్ర అమితాబ్‌ గోపి:ఆంధ్రా అమితాబ్‌ గోపి గురించి చాలా మందికి తెలుసు.. హీరో అమితాబ్‌కు సిమిలర్‌గా ఉంటారు.

prabhas
ప్రభాస్‌ - కిరణ్‌ రాజ్‌: బాహుబలి సినిమాలో ప్రభాస్‌ డూప్‌గా కొన్ని సీన్లలో నటించాడు కిరణ్‌రాజ్‌. అతడిలో ప్రభాస్‌ పోలికలు కనిపిస్తాయి. అలాగే టిక్‌ టాక్‌
వీడియోలతో ప్రభాస్‌లా ఉన్నాడంటూ ఈ మధ్య ఆయన వీడియోలు బాగా వైరల్‌ అయ్యాయి కూడా.

266
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles