ఓ బొజ్జగణపయ్యా..నీకిదే.. నైవేద్యమయ్యా!


Sun,September 1, 2019 12:23 AM

విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడి పండుగే వినాయకచవితి. ఆ రోజు భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి.. విజయాలు చేకూరాలని ఆ దేవుడిని కోరుకుంటారంతా! ఆ గణపయ్య భోజనప్రియుడు. ఆయన కృపావీక్షణాలు మనపై కురవడానికి విలక్షణ నైవేద్యాలను సమర్పించి ఆ గణనాథుడిని ప్రసన్నం చేసుకోండి..

పాల ఉండ్రాళ్లు

కావాల్సినవి : బియ్యం పిండి : కప్పున్నర పాలు : 2 1/2 కప్పులు చక్కెర : 100 గ్రా. యాలకుల పొడి : చిటికెడు సాబుదానా : 3 టేబుల్‌స్పూన్స్ నూనె : పావు టీస్పూన్స్
pala-thalikalu

తయారీ : ఒక గిన్నెలో నీళ్లు, నూనె పోసి మరిగించాలి. దీంట్లో బియ్యం పిండి ఉండలు లేకుండా కలుపాలి. కొద్దిగా నూనె చేతులకు రాసుకొని వీటిని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టాక ఇడ్లీ కుక్కర్‌లో కొన్ని నీళ్లు పోసి ఆవిరి మీద ఈ ఉండ్రాళ్లను ఉడికించాలి. ఈలోపు పాలు పోసి మరిగించాలి. దీంట్లో సాబుదానా, చక్కెర, యాలకుల పొడి వేసి సన్నని మంటమీద పది నిమిషాలు ఉడికించాలి. ఇందులో కొద్దిగా బియ్యం పిండి వేసి చిక్కగా అయ్యేలా చూడాలి. ఆ తర్వాత ఉండ్రాళ్లను వేసి సన్నని మంటమీద నాలుగు నిమిషాలు ఉంచి దించేయాలి.

రవ్వ లడ్డు

కావాల్సినవి :బొంబాయి రవ్వ : ఒక కప్పు చక్కెర : ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి : అర కప్పు పాలు : పావు కప్పు యాలకులు : 4
నెయ్యి : 3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు : 10 కిస్‌మిస్ : 10
coconut-ladoo

తయారీ :చక్కెర, యాలకులను మిక్సీ పట్టాలి. మెత్తటి పొడి అయ్యేవరకు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌లను వేయించాలి. బంగారు వర్ణం వచ్చాక కడాయిలో నుంచి తీసి ఓ ప్లేటులో వేసుకోవాలి. అదే కడాయిలో ఉన్న నెయ్యి వేసి సన్నని మంటమీద రవ్వను వేయించుకోవాలి. రవ్వ రంగు మారిన తర్వాత పొడి చేసుకున్న చక్కెర, వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లను వేసి కలపాలి. చివరగా పాలు వేసి మరికొద్దిసేపు కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌమీద నుంచి దించి వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని లడ్డూల్లాగా చేసుకోవాలి. చల్లగా అయితే లడ్డూలు చేయడానికి రావు.

మోదక్

కావాల్సినవి : బియ్యం పిండి : ఒక కప్పు నెయ్యి : 3 టీస్పూన్స్ బెల్లం తురుము : ఒక కప్పు కొబ్బరి తురుము : 2 కప్పులు
యాలకులు : 3 ఉప్పు : చిటికెడు
Modak

తయారీ : కడాయిలో నెయ్యి వేసి బెల్లం, కొబ్బరి తురుము వేసి కలుపాలి. అవసరమైతే నీళ్లు పోయొచ్చు. దీంట్లో యాలకులు వేసి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. ఇందులో ఉప్పు, నెయ్యి వేసి కాసేపు ఉంచి దించేయాలి. ఈ నీళ్లు చల్లారక ముందే.. బియ్యం పిండి వేసి ఉండలు కట్టకుండా పూరీ పిండిలా కలుపుకోవాలి. వీటిని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఈ ముద్దని మధ్యలో చిన్న దొప్పలా చేసుకోవాలి. దీంట్లో బెల్లం మిశ్రమాన్ని ఉంచి మళ్లీ బాల్‌లా చేసుకోవాలి. దీన్ని మనకు నచ్చిన రీతిలో ముడుచవచ్చు. ఇలా అన్నీ చేసుకున్నాక.. ఇడ్లీ కుక్కర్‌లో ఒక క్లాత్ వేసి ఈ మోదక్‌లు ఉంచాలి. వీటిని పదినిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. టేస్టీ.. మోదక్స్ మీ ముందుంటాయి.

చింతపండు పులిహోర

కావాల్సినవి :
బియ్యం : ఒక కప్పు, చింతపండు: కొద్దిగా, పసుపు : ఒక టేబుల్ స్పూన్, పల్లీలు : 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు : ఒక టీ స్పూన్, శనగపప్పు : ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర : ఒక టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు : 4, నూనె, ఉప్పు : తగినంత
pulihora

తయారీ :చింతపండుని వేడి నీళ్ళు పోసి నానబెట్టాలి. బియ్యాన్ని కడిగి కాసేపు నాననివ్వాలి. ఆ తర్వాత అన్నం మెత్తగా కాకుండా వండి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో చింతపండు రసం, కొన్ని నీళ్ళు పోసి చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి. ఈలోపు కడాయిలో నూనె పోసి ఆవాలు, శనగపప్పును వేయించాలి. ఇందులోనే జీలకర్ర, పల్లీలు, ఎండుమిరపకాయలు, పసుపు కూడా వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. దీన్ని బాగా ఉడికిన చింతపండులో వేసేసి కాసేపు మరగనివ్వాలి. ఉప్పు, ఈ మిశ్రమాన్ని చల్లార్చిన అన్నంలో వేసి బాగా కలపాలి. నోరూరించే.. పులిహోర మీ ముందుంటుంది.

రవ్వ అప్పాలు

కావాల్సినవి : బొంబాయి రవ్వ : ఒక కప్పు చక్కెర : 3/4 కప్పు యాలకులు : 3 నెయ్యి : 5 టేబుల్‌స్పూన్స్ నూనె : తగినంత
rava-appalu

తయారీ : ఒక గిన్నెలో కప్పు నీళ్లు పోసి మరిగించాలి. ఇది మరుగుతున్నప్పుడు.. నెయ్యి వేసి రెండు నిమిషాల తర్వాత రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపాలి. ఐదు నిమిషాలు సన్నని మంటమీద ఉంచి మూత పెట్టి దించేయాలి. కాస్త చల్లారనిచ్చి దీంట్లో చక్కెర, యాలకుల పొడి వేసి కలిపి ఉంచాలి. ఇప్పుడు దీన్ని మళ్లీ స్టౌ మీద పెట్టి సన్నని మంటమీద రెండు నిమిషాలు ఉంచాలి. కలిపినప్పుడు తప్ప.. మిగతా సమయంలో మూత పెట్టే ఉంచాలి. ఐదు నిమిషాలయ్యాక దించేయాలి. ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. చేతికి నెయ్యి రాసుకొని వీటిని అప్పాల్లా ఒత్తుకోవాలి. ఇలా పిండి మొత్తం చేయాలి. ఆ తర్వాత కడాయిలో నూనె పోసి అప్పాలను గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.

స్వీట్ పొంగల్

కావాల్సినవి : బియ్యం : అర కప్పు, పెసరపప్పు: అర కప్పు, బెల్లం తురుము : అర కప్పు, యాలకుల పొడి : చిటికెడు, పచ్చ కర్పూరం : చిన్నది, నెయ్యి : 3 టేబుల్‌స్పూన్, జీడిపప్పులు : 12, కిస్మిస్ : ఒక టేబుల్‌స్పూన్, లవంగాలు : 2, ఎండు కొబ్బరి ముక్కలు : 2 టేబుల్‌స్పూన్స్
sweet-pongal

తయారీ :
కుక్కర్‌లో పెసరపప్పు వేసి వేయించుకొని దించేయాలి. ఇందులోనే బియ్యం పోసి రెండూ కలిపి బాగా కడుగాలి. ఆ తర్వాత నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో బెల్లం వేసి నీళ్లు పోసి సన్నని మంటమీద చిక్కగా అయ్యే వరకు ఉంచి దించేయాలి. ఇప్పుడు అన్నం, పెసరపప్పును మరీ మెత్తగా కాకుండా పప్పు గుత్తితో మెదుపాలి. దీంట్లో బెల్లం పాకం, యాలకుల పొడి వేసి బాగా కలుపాలి. దీన్ని స్టౌ మీద పెట్టి సన్నని మంటమీద ఉంచాలి. రెండు నిమిషాల తర్వాత నెయ్యి వేసి కలుపాలి. ఇది అయ్యేలోపు.. చిన్న కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, లవంగాలు, కొబ్బరి ముక్కలను వేసి వేయించుకోవాలి. దించేముందు పచ్చకర్పూరం వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పొంగల్‌లో వేసి రెండు నిమిషాలు ఉంచి దించేస్తే సరి.

405
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles