భలే.. భలే.. బెల్ట్‌!


Sun,August 18, 2019 01:09 AM

dress
చీర కట్టినప్పుడు.. నాజూకు నడుముకు వడ్డాణం పెడతాం.. అదే డ్రెస్‌ వేసినప్పుడు.. ఏమీ ఉండదు.. జీన్స్‌ వేస్తే మాత్రం బెల్ట్‌ కోసం వెతుకుతాం.. కానీ ఇప్పుడు డ్రెస్‌ ఏదైనా సరే.. బెల్ట్‌ స్టయిల్‌ స్టేట్‌మెంట్‌ అనేస్తున్నారు ఫ్యాషనిస్టులు.. అయితే వీటిని ఎంచుకునేటప్పుడు.. ఏవి పడితే అవి తీసుకోవడానికి వీల్లేదంటున్నారు.. అందుకే ఎలాంటి సమయంలో ఏ బెల్ట్‌లు.. ఎలా ఉంటే ఏ రకమైన బెల్ట్‌లు వాడాలో.. ఈ ‘జంటకమ్మ’ చెబుతున్నది..

- సౌమ్య పలుస
dress1

క్యాజువల్‌గా..

రోజూ బోర్‌ కొట్టేలా డ్రెస్సింగ్‌ ఉండొద్దు అనుకుంటే ఈ బెల్ట్‌ని ట్రై చేయండి. బేసిక్‌ స్టయిల్‌ బెల్ట్‌గా దీన్ని చెప్పొచ్చు. బ్లాక్‌, బ్రౌన్‌ కలర్‌లో ఈ బెల్ట్‌లు తీసుకుంటే ఏ కలర్‌కైనా మ్యాచ్‌ చేసుకోవచ్చు. ట్రౌజర్‌, స్కర్ట్స్‌, డెనిమ్స్‌ మీదకి ఇవి బాగా నప్పుతాయి. కచ్చితంగా వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన బెల్ట్‌ల లిస్ట్‌లో ఇది ప్రథమ స్థానంలో ఉంటుంది. కాకపోతే.. హై క్వాలిటీ బెల్ట్‌లను కొంటే ఎక్కువ కాలం మన్నుతాయి. స్మార్ట్‌ లుక్‌ కోసం తప్పక ఈ బెల్ట్‌ని ఎంచుకోండి.
dress2

సాహో.. సాష్‌

ఈ మధ్య కాలంలో పాపులర్‌ అయిన బెల్ట్‌లుగా ఇవి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. కాలేజ్‌కి వెళ్లే అమ్మాయిలు సూపర్‌ స్టయిల్‌గా మెరిసిపోవాలంటే మాత్రం ఈ బెల్ట్‌ల ఎంపిక తప్పనిసరంటున్నారు ైస్టెలిస్టులు. ఈ బెల్ట్‌ల ప్రత్యేకత ఏంటంటే.. వీటికి బకల్స్‌ ఉండవు. మూడు ఇంచుల వెడల్పుతో.. ఒంటికి అంటుకుపోయేలా ఈ బెల్ట్‌లను పెట్టుకోవాలి. ఫార్మల్‌ ప్యాంట్‌, షర్ట్‌ వేసుకున్నప్పుడే కాదు.. అందమైన పొట్టి గౌన్లు వేసుకున్నప్పుడు కూడా ఈ బెల్ట్‌లు ధరించవచ్చు.
dress3

మెరిసే మెటాలిక్‌..

ఈ బెల్ట్‌లు సరిగ్గా కనిపించాలనుకుంటే కచ్చితంగా ప్లెయిన్‌ డ్రెస్‌లను ఎంచుకోండి. ఒక అంగుళం వెడల్పుతో మాత్రమే ఈ బెల్ట్‌లు వస్తాయి. రోజువారీ డ్రెస్‌ల మీదకి నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. పైగా చాలా రంగుల్లో ఈ బెల్ట్‌లు లభ్యమవుతున్నాయి మార్కెట్‌లో. కాబట్టి డ్రెస్‌ల మీదకి మ్యాచ్‌ అయ్యే విధంగా కొన్ని రంగుల బెల్ట్‌లను కొని పెట్టుకోండి. స్టయిల్‌ ఐకాన్‌గా, ఫినిషింగ్‌ లుక్‌గా ఉండాలంటే ఇవి బెటర్‌ ఆప్షన్‌. ఫార్మల్‌ డ్రెస్‌ల మీదకే కాదు.. ఎలాంటి డ్రెస్‌ల మీదకైనా ఈ బెల్ట్‌లు చాలా బాగుంటాయి.
dress4

సూపర్‌ లెదర్‌..

అందరికీ తెలిసినా.. అందరి వార్డ్‌రోబ్‌ల్లో ఉండే బెల్ట్‌లే ఇవి. ఎప్పటి నుంచో బెల్ట్‌ కావాలనుకుంటే తెచ్చుకునే రకమే. కాకపోతే ఇందులో కూడా బోలెడు రకాలు వచ్చాయి. సన్నని తీగలా ఉండే బెల్ట్‌ల నుంచి పెద్దగా ఉండే బెల్ట్‌ల వరకు ఈ రకాల్లో ఉన్నాయి. కేవలం ఫార్మల్‌గా ఉండే వాటిమీదకి పెట్టుకోవాలంటే సింపుల్‌గా, ప్లెయిన్‌గా ఉండే రకాలను ఎంచుకోవాలి. ఎక్కువ కాలం మన్నాలనుకుంటే కూడా ఈ బెల్ట్‌లు మంచి ఆప్షన్‌. ఈ బెల్ట్‌లతో రాయల్‌ లుక్‌ వస్తుందంటున్నారు ఫ్యాషనిస్టులు.
dress5

పెద్దగా.. చక్కగా..

కాస్త సన్నగా ఉన్నారా? అలాంటప్పుడు బెల్ట్‌ పెట్టినా పెద్దగా కనపడదు మీ నడుముకి. అందుకే కాస్త వెడల్పుగా, మందంగా ఉండే బెల్ట్‌లను ఎంచుకోమంటున్నారు ఫ్యాషన్‌ పండితులు. దీనివల్ల సూపర్‌ లుక్‌ సొంతమవుతుందంటున్నారు. లెదర్‌, క్లాత్‌తో వచ్చే బెల్ట్‌లు నడుమును పట్టేసినట్టు చూడచక్కగా ఉంటాయట. కాకపోతే మెటీరియల్‌, కలర్‌ల ఎంపిక అప్పుడు జాగ్రత్త వహించండి. బకల్స్‌ లేకుండా కూడా కొన్ని రకాల బెల్ట్‌లు వస్తున్నాయి. వాటిని ఎంచుకోవచ్చు.
dress8

చక్కని చెయిన్‌..

అన్ని బెల్ట్‌లు లెదర్‌ లేదా బట్టతో తయారు చేసినవి ఉంటాయి. కొన్ని మెటల్‌తో అది కూడా స్టిఫ్‌ బెల్ట్‌లే కనిపిస్తున్నాయి. అయితే.. వడ్డాణాన్ని ప్రేరణగా తీసుకొని చెయిన్‌ బెల్ట్‌లను తయారు చేశారు ఫ్యాషనిస్టులు. మెరిసిపోయే ఈ చెయిన్‌ బెల్ట్‌లు సిల్వర్‌, గోల్డ్‌, ప్లాటినం కలర్‌లలో కనిపిస్తాయి. దీంట్లో ఎన్నో రకాల మోడల్స్‌ని కూడా మార్కెట్‌లో చూడొచ్చు. పార్టీలకు ఇవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి.
dress6

ప్రింట్‌ పర్‌ఫెక్ట్‌..

ఫంకీగా రెడీ అవ్వాలనుకుంటే ఈ రకమైన బెల్ట్‌లను ఎంచుకోవచ్చు. జంతువుల ప్రింట్‌తో వచ్చే బెల్ట్‌లు పార్టీల్లో మిమ్మల్ని ప్రత్యేకంగా చూపిస్తాయి. డ్రెస్‌ కూడా ఫంకీగా లేదా ప్లెయిన్‌గా ఉన్నప్పుడే ఈ ప్రింట్‌ బెల్ట్‌లు బాగుంటాయి. కాకపోతే దీంట్లో హెవీ ప్రింట్‌ వచ్చే వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎలాంటి డ్రెస్‌ల మీదకైనా ఈ బెల్ట్‌లు బాగుంటాయి. అయితే.. డ్రెస్‌ని బట్టి బెల్ట్‌ సైజ్‌ని నిర్ణయించుకోవాలి. ఫార్మల్‌ డ్రెస్‌ల మీదకి సన్నగా ఉండేవి.. గౌన్‌ల మీదకి కాస్త వెడల్పాటివి అయితే బాగుంటాయి.
dress

నడుము కిందకు..

ఇలాంటి బెల్ట్‌లు ప్రత్యేకంగా నడుము కింది భాగంలో పెట్టుకోవడానికి వస్తున్నాయి. ముఖ్యంగా లాంగ్‌ టాప్స్‌, లాంగ్‌ స్కర్ట్స్‌ వేసుకున్నప్పుడు సూపర్‌గా కనిపించేలా ఈ బెల్ట్‌లు వస్తాయి. ఇవి సన్నగా కాకుండా కాస్త వెడల్పుగా రావడం వీటి ప్రత్యేకత. వీ-షేప్‌ ైస్టెల్‌ బెల్ట్‌లు మరింత అందంగా కనిపిస్తాయి. హిప్‌స్టర్‌ జీన్స్‌ల మీదకి కూడా ఈ బెల్ట్‌లు బాగుంటాయి.

ఎంచుకోండి ఇలా

మీరు ఏపిల్‌ షేప్‌లో ఉంటారా? అయితే మీకు డార్క్‌ కలర్‌ బెల్ట్‌లను అంటే.. బ్లాక్‌, నావీ బ్లూ, డార్క్‌ బ్రౌన్‌ కలర్స్‌ బాగుంటాయి. అలాగే బెల్ట్‌ వెడల్పుగా ఉండడం వల్ల మీ నడుము చాలా వరకు కవర్‌ అయిపోతుంది. దాంతో నడుము సన్నగా కనిపిస్తుందన్నమాట. ఓవెన్‌ టాప్‌లతో ఈ బెల్ట్‌లను మ్యాచ్‌ చేస్తే మరింత బాగుంటారు.

రెక్టాంగిల్‌, ఇన్వర్టెడ్‌ ట్రయాంగిల్‌ షేప్‌లో ఉన్న వాళ్లు.. కొంచెం ఆలోచించి డ్రెస్‌లను ఎంచుకోవాలి. వదులుగా ఉండే డ్రెస్‌ వేసుకోవాలి. సింపుల్‌ బెల్ట్‌ను సెలెక్ట్‌ చేసుకొని మరీ టైట్‌గా కాకుండా ఉండే బెల్ట్‌ను ధరించడం మంచిది.

పియర్‌, హోవర్‌ గ్లాస్‌ వాళ్లు తమకు నచ్చిన బెల్ట్‌లను ఎంచుకోవచ్చు. లేత, ముదురు ఏ రంగులవైనా తీసుకోండి. సన్నని బెల్ట్‌లు, వాటికి మెరిసిపోయే బకల్స్‌ ఉండే విధంగా చూసుకోండి. అప్పుడు అందరిలో మీరే సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ అవ్వొచ్చు.

సన్నని నడుము అయితే.. మీ టాప్‌ రంగు బెల్ట్‌లనే ఎంచుకోవాలి. అలాగే.. బెల్ట్‌ కూడా సన్నగానే ఉండాలి. వెడల్పు బెల్ట్‌లను ఎంచుకుంటే మీరు పొట్టిగా కనిపించే ప్రమాదం ఉంది. కాబట్టి వాటి జోలికి వెళ్లొద్దు. అలాగే కాంట్రాస్ట్‌ కలర్స్‌ కూడా బాగుండవు.

లావు నడుము ఉందని అనుకుంటున్నారా? అయితే బెల్ట్‌ కాస్త వెడల్పుగా ఉండేలా చూసుకోండి. అలాగే.. డ్రెస్‌కి కాంట్రాస్ట్‌ బెల్ట్‌లను ఎంచుకోండి. బకల్స్‌ కూడా పెద్దగా ఉంటే లుక్‌ అదిరిపోతుంది.

633
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles