ఆతరంతో..ఈ తరంతో


Sun,August 18, 2019 12:55 AM

టాలెంట్‌ ఉంటే వయసుతో సంబంధం ఉండదు. అది చిత్రపరిశ్రమకు కూడా వర్తిస్తుంది. ఎన్టీయార్‌-శ్రీదేవి, ఎన్టీయార్‌ సావిత్రి, తెలుగుతెర మీద నిలిచిన సక్సెస్‌ఫుల్‌ జోడీలు. అప్పటి నటీనటులు మధ్య ఎక్కువ వయసులో తేడా ఉండేది. అయినా ఎన్నో సినిమాలు హిట్టయ్యాయి. ఈ ట్రెండ్‌ ఇప్పటికీ కొనసాగుతున్నది. ఎక్కువ మంది హిరోయిన్‌లు పెద్ద హీరోలతో నటిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా జతకడుతున్నారు. తండ్రి-కొడుకుతోనూ, బాబాయ్‌-అబ్బాయితోనూ కనిపించి టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారుతున్నారు. అలాంటి వారే వీరు..

- వినోద్‌ మామిడాల
kajal

కాజల్‌ అగర్వాల్‌

ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు పొందిన కలువకండ్ల చిన్నది కాజల్‌ అగర్వాల్‌. మెగా ఫ్యామిలీ హీరోలతో నటించి అగ్రనాయికల లిస్టులో చేరిపోయింది. రామ్‌చరణ్‌తో మగధీర నుంచి గోవిందుడు అందరివాడేలే, నాయక్‌ సినిమా వరకూ నటించింది. అట్లాగే మెగాస్టార్‌ 150వ సినిమాలోనే చిరంజీవితో జతకట్టింది. అల్ల్లు అర్జున్‌తో ఆర్య2, పవన్‌ కల్యాణ్‌తో సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ చేసి మొత్తం మెగా ఫ్యామిలీని కవర్‌ చేసింది.
rakul

రకుల్‌, లావణ్య త్రిపాఠి

రకుల్‌, లావణ్య త్రిపాఠి అక్కినేని హీరోస్‌తో నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఏజ్‌తో సంబంధం లేకుండా నాగ్‌తో,చైతో నటించి ఫిదా చేశారు. సోగ్గాడే చిన్ని నాయనలో నాగ్‌తో నటించిన లావణ్య త్రిపాఠి యుద్ధం శరణంలో నాగచైతన్యతో కూడా జతకట్టింది. అట్లాగే రారండోయ్‌ వేడుక చూద్దాంలో చైతన్యతో నటించిన రకుల్‌ ఇప్పుడు మన్మధుడు2లో నాగార్జునతో కలిసి నటించింది.
Nayanthara

నయనతార, శ్రియ

తెలుగులో ముఖ్యమైన పాత్రల్లో నటించిన హీరోయిన్లలో నయనతార, శ్రియా ఉన్నారు. ఇద్దరూ కూడా నందమూరి ఫ్యామిలీలో రెండు జెనరేషన్ల హీరోలతో నటించారు. సింహ, శ్రీరామరాజ్యం, జై సింహలో బాలకృష్ణతో నటించిన నయనతార. అదుర్స్‌లో ఎన్టీయార్‌తో నటించింది. అట్లాగే బాలకృష్ణతో గౌతమి పుత్ర శాతకర్ణ్ణి, పైసావసూల్‌లో నటించిన శ్రియ అప్పట్లో ఎన్టీయార్‌తో అల్లుడులో నటించారు. కృష్ణం వందే జగద్గురులో రాణా సరసన నటించిన నయనతార బాబు బంగారంతో వెంకటేశ్‌తో నటించారు.
samantha

సమంత

మెగాఫ్యామిలీతో నటించిన వారిలో సమంతా కూడా ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌తో అత్తారింటికి దారేది, అల్లు అర్జున్‌తో సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, రామ్‌చరణ్‌తో రంగస్థలంలో నటించి మెగా ఫ్యామిలీని కవర్‌ చేసింది.
thamanna

తమన్నా

మిల్క్‌ బ్యూటీ తమన్నా మెగాహీరోలతో నటించింది. పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌తో స్టెప్పులేసి తెలుగు తెరమీద వెలుగు వెలిగింది. కెమెరామెన్‌ గంగతో రాంబాబులో పవన్‌కల్యాణ్‌తో నటించింది, రామ్‌చరణ్‌తో రచ్చలో రచ్చ చేసిందీ బ్యూటీ. అట్లాగే అల్లుఅర్జున్‌తో బద్రీనాథ్‌ సినిమా కూడా చేసింది.
sruthihasan

శృతి హాసన్‌

అగ్రనాయికగా రాణించిన శృతి హసన్‌ కూడా మెగా హీరోలతో నటించిన లిస్టులో ఉంది. గబ్బర్‌సింగ్‌లో పవన్‌కల్యాణ్‌తో, ఎవడులో రామ్‌చరణ్‌ పక్కన, రేసుగుర్రంలో అల్లుఅర్జున్‌ సరసన ఇలా ముగ్గురితో చేసిన మరో నటి శృతిహాసన్‌.

795
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles