కెమెరాతో తీసినవి కావు


Sun,August 18, 2019 02:30 AM

Javier-Arizabalo
ఒకసారి గీసిన బొమ్మను మరోసారి గీస్తే.. మొదటి పెయింట్‌కు, రెండో పెయింట్‌కు ఎక్కడో ఓ చోట తేడా కనిపిస్తుంటుంది. ఈ విషయాన్ని పెయింటింగ్‌ దిగ్గజాలు కూడా అంగీకరిస్తారు. కానీ ఫ్రాన్స్‌కు చెందిన జేవియర్‌ అరిజబలో మాత్రం ఇందుకు అతీతుడనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి వీటిని చూడండి. ఎంతో ప్రతిభ ఉన్న ఫొటోగ్రాఫర్‌ తీసిన అందమైన ఫొటోల్లా ఉన్నాయి కదా ఇవి. అయితే ఇవి ఫొటోలు ఏమాత్రం కావు. కుంచెతో గీసిన బొమ్మలే. వీటిని పెయింటింగ్స్‌ అంటే ఎవ్వరూ నమ్మని పరిస్థితి. బొమ్మకు ప్రాణం పోసి, కుంచెతో ప్రాణ వాయువులు ఊదిన ఈ చిత్రకారుడు మరో విధాతే అంటున్నారు.
Javier-Arizabalo1
ఫ్రాన్స్‌కి చెందిన జేవియర్‌.. 1965లో సెయింట్‌ జీన్‌ డీ లజ్‌లో జన్మించాడు. ఇతనికి ప్రస్తుతం 54 యేండ్లు. ఈ వయసులోనూ ఏ మాత్రం తొణకకుండా, చెక్కు చెదరని విధంగా పెయింటింగ్స్‌ వేయడం జేవీయర్‌ ప్రత్యేకత. ఫైన్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన అతను.. ప్రస్తుతం స్పెయిన్‌లో తన వర్స్‌ చేస్తున్నాడు. మొదట్లో గ్రాఫిక్స్‌, డిజైనింగ్‌ వంటివి చేసిన జేవియర్‌కి తర్వాత ఫొటోగ్రఫీపై విరక్తి వచ్చింది. ఒక్కసారిగా తన ఫొటోగ్రఫీ కెరియర్‌ను వదిలేశాడు. అప్పటి నుంచీ గ్రాఫిక్స్‌, డిజైనింగ్‌ జోలికే వెళ్లలేదు. ఆ తర్వాత తనపని తాను చేసుకుంటూ ఉన్నాడు. తొమ్మిదేండ్ల క్రితం జేవియర్‌ మనసు ఫైన్‌ ఆర్ట్స్‌పైకి మళ్లింది. దానిపై ఆసక్తి చూపాడు. ‘లైట్‌ అండ్‌ షాడో’ పెయింటింగ్‌పై దృష్టిపెట్టాడు జేవియర్‌. ఇందులో ఫొటోరియలిజం, క్లాసికల్‌ పెయింటింగ్స్‌పై ప్రయోగాలు చేశాడు. అప్పటికే తనకు ఫొటోగ్రఫీ, డిజైనింగ్‌పై పట్టు ఉండడంతో ఆ ప్రతిభను పెయిటింగ్స్‌ వేయడానికి ఉపయోగించాడు. అప్పటినుంచి ‘పిక్సెల్‌ టు పిక్సెల్‌' క్లారిటీతో పెయింటింగ్స్‌ వేయడంపై కసరత్తు చేశాడు. లైట్‌ అండ్‌ షాడోలో ఎలా బొమ్మలు గీయాలో అవగాహన చేసుకున్నాడు జేవియర్‌. తన ప్రయోగం ఫలించేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులను త్యాగం చేశాడు. చివరికి సాధించాడు. ఇప్పుడు తన మదిలో ఒక దృశ్యాన్ని ఊహించుకుంటే.. అచ్చు గుద్దినట్లు అలా దించేస్తాడు జేవియర్‌. ఇవన్నీ అతని ప్రతిభకు నిదర్శనాలే. ఇలా అరుదైన కళతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు జేవియర్‌. బిడాసోవా ప్రాంతానికి చెందిన స్థానిక కళాకారులకు పెయింటింగ్స్‌లో మెళకువలు నేర్పాడు. 1997 నుంచి 2001 వరకు ఇరున్‌ అకాడమీ ఆఫ్‌ డ్రాయింగ్‌ అండ్‌ డ్రాయింగ్‌లో ఫ్యాకల్టీగా చేశాడు.
Javier-Arizabalo2
జేవియర్‌ గీసిన ప్రతీ పెయింటింగ్‌లోనూ జీవం ఉట్టిపడుతుంది. వెలుతురులో, చీకటిలో మావన శరీరాకృతి ఎలా ఉంటుందో.. అతని పెయింటింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రత్యేకంగా ‘లైట్‌ ఎఫెక్ట్స్‌'పై అధ్యయనం చేశాడు జేవియర్‌. ఇతని చిత్రాలు సరళమైనవి, సొగసైనవి. పెయింట్‌ గీశాక చివరలో ఇచ్చే బ్రష్‌స్ట్రోక్‌తో ఏ బొమ్మకైనా ప్రాణం వచ్చేస్తుంది. కుంచెతో ఈ ప్రకృతిలోని ఎన్నో అంశాలనూ స్పృశించాడు జేవియర్‌. ఇతని గీసిన చిత్రాలు చూసినవారంతా ఓ కొత్త లోకంలో విహరిస్తారు. ఓ యువతి పెయింటింగ్‌ గీయాలనుకుంటే.. తాను కూర్చున్న కుర్చీకి ఉన్న కలర్‌ నుంచి.. ఆమె వెంట్రుకల వరకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. వాటిని చూస్తే ఎవ్వరైనా అవి ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ తీసిన ఫొటోనే అనుకుంటారు.
Javier-Arizabalo3

264
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles