పునర్వైభవమే లక్ష్యంగా.. వారసత్వ భవనాల పరిరక్షణ


Sun,August 4, 2019 02:01 AM

Church
పెండ్లి చేయాలంటే.. పూల దండలు, వంటల దగ్గర్నుంచి మండపం వరకు అన్ని పనులు ఈవెంట్ నిర్వాహకులు చూసుకుంటారు. ఇల్లు కట్టాలంటే.. స్థలం చూపించి ఎలా కావాలో చెబితే చాలు ఇక గృహప్రవేశం వరకు పనే ఉండదు. ఈ రెండు సరే కాని. ఎప్పుడో కట్టిన ఇంటిని తిరిగి పునరుద్ధరించడం అంటే.. అది చిన్న పని కాదు. దానికంటే మరో ఇల్లు కట్టుకోవడం బెటర్ అంటారు. కానీ, ఆ ఇంటితో కొన్ని జ్ఞాపకాలు ముడిపడుంటాయి. చిన్నప్పుడు గోరుముద్దలు తింటూ తిరిగిన ప్రదేశం. అమ్మ తిడితే తలుపు చాటున అలగడం, అన్నతో ఆడుకున్న ప్రదేశం ఈ తీపి జ్ఞాపకాలను ఒక్కసారిగా కూల్చాలంటే మనసెలా వస్తుంది. మరి పెద్దవాళ్లు కట్టిన నిర్మాణం ఎన్నో యేండ్ల చారిత్రక కట్టడమైతే! ఎవరేమన్నా సరే పరిరక్షించుకోవాలంటున్న ఐశ్వర్య టిప్నిస్ పరిచయం.

ఢిల్లీలోని సేత్ రామ్ లాల్ ఖేమ్‌కా హవేలీలలో నివసిస్తున్న దేవకీ నందన్, నేహా దంపతులు కూడా అలాగే అనుకున్నారు. దేవకీ నందన్‌కి ఢిల్లీ, కశ్మీరీ గేట్ సమీపంలో ఉన్న హవేలీ 175 యేండ్ల నాటి కట్టడం. మొఘలుల కాలం నాటి నిర్మాణం. ఆ హవేలీకి మరమ్మతులు చేసుకున్నారు. అప్పుడు ఎలా కట్టారో అచ్చం అలానే మళ్లీ కట్టారా! అనిపించేటట్లు పునరుద్ధరించుకున్నారు. ఢిల్లీ చాందినీ చౌక్‌లోని ధరంపురా హవేలీ కూడా అలాంటిదే. ఈ రకంగా పాతనిర్మాణాలకు కొత్తదనం తెస్తున్నది ఐశ్వర్య టిప్నిస్. ఇళ్లను పరిరక్షించడమే కష్టమైన పని అంటున్నది ఐశ్వర్య. కోటల ఒరిజినల్ డిజైన్‌కు అనుగుణంగా పనిచేస్తే సరిపోతుంది. అప్పుడు వాడిన లైమ్, ఇసుక, రాళ్ళ స్థానంలో అదే లుక్ తీసుకురావడానికి కొంతవరకు ప్రత్యామ్నాయాలను కూడా వాడొచ్చు. ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాల కోసం టెంపరరీ వైరింగ్ చేస్తారు. కొన్ని వైర్లు బయటకు వేలాడి ఉంటాయి. ఈ ఇరువై ఒకటో శతాబ్దపు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంటీరియర్ అంతా రీ డిజైన్ చేయాల్సి ఉంటుంది. అటాచ్‌డ్ బాత్రూమ్, మాడ్యులర్ కిచెన్‌తో ఇంటికి మోడరన్ టచ్ ఇవ్వాలి.

మహిద్ కోట పునరుద్ధరణకు మూడేండ్లు పడితే సేత్ రామ్ లాల్ ఖేమ్‌కా హవేలీకి దాదాపుగా ఎనిమిదేండ్లు పట్టింది. ఒక ప్రాజెక్ట్ మీద ఆర్కిటెక్ట్ స్నేహితులు ఇన్నేండ్లు పని చేయాలంటే బోర్ ఫీలవుతారు. చిన్నప్పుడు చదువుకున్న కుందేలు-తాబేలు కథలోని తాబేలునే స్ఫూర్తిగా తీసుకున్నది. ఎన్నిప్రాజెక్టులు చేసేమన్నది కాదు. ఎంతమంచి ప్రాజెక్టులు చేశానన్నదే ముఖ్యం అంటుంది ఐశ్వర్య. మధ్యప్రదేశ్‌లోని మహిద్‌పూర్ కోట, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చదువుకున్న డెహ్రాడూన్ స్కూల్, కోల్‌కతా చందన్‌నగర్‌లోని ఫ్రెంచ్ చర్చి ప్రత్యేకమైన ఆనవాళ్లుగా నిలిచిన కట్టడాలను పటిష్ఠపరిచారామె. ఈస్టిండియా కంపెనీకి మరాఠా సమాఖ్యకు మధ్య క్రీ.శ.1817లో భీకరమైన యుద్ధం జరిగింది. ఇందులో హోల్కర్ రాజులు, యువరాజుల నుంచి సామాన్యుల వరకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ యుద్ధంలో కోట దాదాపుగా ధ్వంసమైందనే చెప్పాలి. స్వాతంత్య్రం వచ్నిన తర్వాత కోటల నిర్వహణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడంతో నిర్మాణాలు మరింతగా శిథిలం కాసాగాయి. చారిత్రక వారసత్వ కట్టడాల పునరుద్ధరణ బాధ్యత తలకెత్తుకున్నది ఐశ్వర్య మాత్రమే.
Church1

పాత ఇల్లే ఇష్టంగా..

ఐశ్వర్య న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్. 2003లో గ్యాడ్యుయేషన్ చేసింది. తర్వాత స్కాట్లాండ్‌లోని డూండీ యూనివర్సిటీ నుంచి యూరోపియన్ అర్బన్ కన్జర్వేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఇప్పుడామె ఐశ్వర్య టిప్నిస్ ఆర్కిటెక్చర్ పేరున సొంత సంస్థ నిర్వహిస్తున్నది. ఆమె చదివిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లోనూ విజిటింగ్ ఫ్యాకల్టీగా విధులు నిర్వర్తిస్తున్నారు.ఆ ఇష్టమే ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టడానికి దారి తీసిందని అంటున్నది ఐశ్వర్య. పరిరక్షణ అనేది తెలియని విద్యేమీ కాదు. ఒక వస్తువును ఎన్ని రకాలుగా వాడొచ్చో అన్ని రకాలుగా మలుచుకుంటూ ఉపయోగిస్తాం. దీన్నే గ్రోయింగ్ గ్రీన్ అని సస్టెనెబులిటీ అని అంటున్నారు. సంప్రదాయ నిర్మాణాలు, చారిత్రక కట్టడాలమీద ఆమెకున్న ఇష్టమే. వాటిని పరిరక్షించడాన్ని కెరీర్‌గా తీసుకునేలా చేసింది. వెర్నాక్యులర్ ట్రెడిషన్స్, కాంటెంపరరీ ఆర్కిటెక్చర్ పేరున ఓ పుస్తకం కూడా రాసింది.

ఈ అవార్డులు అందరివి

చందన్ నగర్ పట్టణం కోల్‌కతాకు దగ్గరలో ఉంటుంది, అక్కడ ఫ్రెంచ్ కాలనీ ఉంది. ఫ్రెంచ్ వాస్తుశైలి భవనాలు వందకుపైగా ఉన్నాయి. అవన్నీ వారసత్వ సంపదగా కాపాడుకోవాల్సిన నిర్మాణాలే. వారసత్వ కట్టడాల మీద ఆసక్తి ఉన్న యువ ఆర్కిటెక్ట్‌లను సమీకరించి, వారందరి సహకారంతో ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగాను. కష్టానికి తగ్గ ప్రతిఫలంగా పట్టణానికి ఉన్న చారిత్రక నిర్మాణ నైపుణ్యాన్ని తిరిగి తీసుకురాగలిగాను. అందుకు గాను గత యేడాది ఫ్రెంచ్ అంబాసిడర్ అలెగ్జాండ్రె జిగ్లర్ అవుట్ స్టాండింగ్ కమిట్‌మెంట్ అవార్డూ అందుకున్నాను. ఇది ఫ్రెంచ్‌లో కళ, సాంస్కృతిక రంగాలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం. భారతదేశంలో ఉన్న ఫ్రెంచ్ వారసత్వ కట్టడాలను పునరుద్ధరించినందుకు ఈ అవార్డు వచ్చింది. డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్ పునరుద్ధరణను పూర్తి చేసినందుకు యునెస్కో నుంచి ప్రశంసా పత్రం అందుకోవడం కూడా నాకు అత్యంత సంతోషకరమైన సందర్భమే. నేను చేపట్టిన ప్రాజెక్ట్‌లకు నాతోపాటు మా టీం అందరి సహాకారం ఉంటుంది. అందుకే ఏ పురస్కారమైనా నా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికీ చెందుతుంది అని సగర్వంగా చెబుతున్నది.

గత యేడాది ఫ్రెంచ్ అంబాసిడర్ అలెగ్జాండ్రె జిగ్లర్ అవుట్ స్టాండింగ్ కమిట్‌మెంట్ అవార్డూ అందుకున్నాను. ఇది ఫ్రెంచ్‌లో కళ, సాంస్కృతిక రంగాలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం. భారతదేశంలో ఉన్న ఫ్రెంచ్ వారసత్వ కట్టడాలను
పునరుద్ధరించినందుకు ఈ అవార్డు వచ్చింది.

186
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles