దొరసాని శివాత్మిక


Sun,July 21, 2019 01:47 AM

Dorasani
దొరసానితో ప్రేక్షకులకు పరిచయమైన రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది. సినిమా కుటుంబం నుంచి వచ్చిన ఈమె షూటింగ్స్‌లోనే ఎక్కువ కాలం గడిపింది. చిన్నప్పటి నుంచి నటి కావాలనుకొని, అమ్మా నాన్నలను స్ఫూర్తిగా తీసుకున్నది. సహజమైన ప్రేమకథతో నటిగా పరిచయమైన శివాత్మిక గురించి మరిన్ని సంగతులు.

చిన్నప్పటి నుంచీ ప్రేమకథతో ముడిపడి ఉన్న సినిమాలను ఇష్టపడి చూసేది. మోడ్రన్ గర్ల్‌గా తను కనిపించాలనుకోలేదు. అందుకే దొరసాని కథ వినగానే కనెక్ట్ అయింది. ఇష్టపడి చేసింది. వాళ్ల అమ్మ చేసిన సినిమాల్లో స్టయిల్, అలంకరణ రిఫరెన్స్‌గా తీసుకుంటుంది.

ప్రేమ గురించి అడిగితే.. ఇప్పటికే తనకు ఎలాంటి అభిప్రాయం లేదనీ, ప్రేమ గురించి చెప్పే వయసు కాదనీ చెప్తున్నది.

పుస్తకాలు చదవడం, డ్యాన్సింగ్, సింగింగ్ శివాత్మికకు అలవాటు. రానున్న సినిమాల్లో సింగర్‌గానూ మారనున్నదట.

చిన్నప్పుడు ఎక్కువగా షూటింగ్ స్పాట్స్‌లోనే గడిపేది. స్కూల్‌కు ఎక్కువ వెళ్లేది కాదు. అయినా స్కూల్‌లో టాప్ స్టూడెంట్. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే గ్రాడ్యుయేషన్ చేస్తూ నీట్ పరీక్షకు సిద్ధం అవుతుంది. బయాలజీ సబ్జెక్ట్ శివాత్మికకు ఇష్టం.

యాక్టింగ్‌లో వాళ్ల అమ్మ జీవితను ఆదర్శంగా తీసుకుంది. రాజశేఖర్ సినిమాల్లో గరుడవేగ అంటే శివాత్మకు చాలా ఇష్టం. రాజశేఖర్, జీవిత కలిసి చేసిన సినిమాలన్నిటినీ ఎక్కువగా ఇష్టపడుతుంది. యాక్టింగ్‌లో కూడా జీవితను స్ఫూర్తి గా తీసుకున్నది.

శివాత్మికకు పానీ పూరీ అంటే చాలా ఇష్టం. బర్త్‌డే పార్టీల్లో పానీపూరీ పోటీలు పెట్టుకుంటారట.ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఆక్టీవ్‌గా ఉంటుంది.

శివాత్మిక అక్క శివానీ. వీళ్లిద్దరికీ సొంతంగా శివానీ శివాత్మిక ప్రొడక్షన్స్ హౌస్ ఉంది.

పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు కానీ జయలలిత బయోపిక్ చేయాలనుకుంటుంది.

డాన్సింగ్ అంటే మక్కువ. లిరిక్స్ డీసెంట్‌గా ఉంటే స్పెషల్ సాంగ్స్ చేయాలని భావిస్తున్నది.

1084
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles