పశ్చిమ చాళుక్యుల కాలం నాటి ఓదెల మల్లన్న


Sat,July 20, 2019 11:24 PM

mallanna
తెలంగాణ రాష్ట్రంలోని మల్లన్న ఆలయాల్లో ఓదెల మల్లన్న ఆలయం ప్రముఖ క్షేత్రంగా విలసిల్లుతున్నది. ఇది పురాతన, చారిత్రాత్మకమైన శైవక్షేత్రం. ఇక్కడి శిల్పకళను పరిశీలిస్తే కాకతీయులు, రెడ్డి రాజులు, పశ్చిమ చాళుక్యుల కాలంలో
పునర్నిర్మితమైనట్లు తెలుస్తున్నది.

- డాక్టర్ పోతరవేన తిరుపతి, సెల్: 9963117456


ఎక్కడ ఉంది?: పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండల కేంద్రంలో ఉన్నది. ఖండేశ్వర స్వామి ఆలయం అని కూడా దీనిని పిలుస్తారు. ప్రతీ సంవత్సరం ఉగాది నుంచి ఏకాదశి సందర్భంగా ఆలయంలో జాతర జరుగుతుంది.

విశిష్ఠత ఏంటి?: ప్రాచీన శిల్పకళా వైభవంతో అలరారుతూ.. విశేషంగా ఆకర్షిస్తున్న ఓదెల మల్లన్న ఆలయం. ఓదెల మల్లన్న ఆలయంలో ప్రధాన దైవం మల్లిఖార్జున స్వామి. మల్లన్నను శివుని ప్రతిరూపంగా భావిస్తారు. వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం ఆగమయ్యలు అర్చనలు చేయగా ఒగ్గోళ్లు భక్తినిష్ఠలతో పట్నాల రూపంలో పూజలు చేస్తారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గడ్ భక్తులు కొలుస్తారు.
mallanna1
స్థలపురాణం: పూర్వం ఈ ప్రాంతంలో దండకారణ్యం ఉండేదట. చింతకింద ఓదెలు అనే రైతు పొలం దున్నుతుండగా నాగలి కర్రుకు శివలింగం తాకింది. అప్పుడు ఓంకార శబ్దంతో పాటు కాంతి రేఖలు విరజిమ్ముతూ.. ఆ ప్రాంతంలో శివాలయం కట్టించాలని పిలుపు వినిపించిందట. ఓదెలు ఈ ఆలయాన్ని నిర్మించడంతో ఓదెల మల్లిఖార్జున స్వామిగా పేరు పడినట్లు స్థానికులు చెప్తున్నారు.

ఒగ్గులే పూజారులు: ఈ ఆలయంలో దాదాపు డ్బ్బై మంది పూజారులు ఉంటారు. వీరంతా ఒగు ్గకళాకారులే కావడం విశేషం. 36 మంది కనగర్తి, 18 మంది కొమిరె, 18 మంది ఇందుర్తి గ్రామాలకు చెందిన ఒగ్గులు పూజలు చేస్తున్నారు.

ఆలయ ప్రత్యేకత: తెలంగాణలో పెద్ద జాతరలైన పెద్దగట్టు, కొమురెల్లి, ఐలోని తర్వాత అంతటి ప్రాధాన్యమైంది ఓదెల మల్లన్నస్వామి ఆలయం. మల్లన్న సంప్రదాయం గల ఆలయాలన్నింటిలో ఓదెల మల్లన్న ఆలయ గర్భగుడిలో మాత్రమే స్వామి లింగాకార రూపంలో ఉంటాడు. ఐలోని, కొమురెల్లి ఆలయాల్లో స్వామి విగ్రహరూపంలో ఉంటాడు. శ్రీశైల క్షేత్రంలో ఉండే ప్రధాన అర్చకులుగా ఉన్న జంగమయ్యలే ఇక్కడ కూడా ప్రధాన పూజారులుగా ఉంటారు.

ఏకైక ఆలయం: మామూలుగా మల్లన్న ఆలయాల్లో పసుపు బండారిని బొట్టుగా పెడతారు. అయితే ఓదెల మల్లన్న ఆలయంలో అయితే విభూదిని పెడతారు. మల్లన్న తల్లిగా భావించే నీలమ్మ విగ్రహం ఒక్క ఓదెల మల్లన్న ఆలయంలోనే ఉంటుంది.
mallanna2

మొక్కులు చెల్లించే పద్ధతులు

ఓదెల మల్లన్నస్వామి ఆలయానికి వచ్చే భక్తులు రెండు పద్ధతులలో మొక్కులు చెల్లిస్తారు.
1. బోనం: ఓదెల జాతరలో బోనం సమర్పించే ఆనవాయితీ తరతరాల నుంచి వస్తున్నది. ఓదెల మల్లన్నకు బోనం ప్రీతికరమైందిగా భక్తులు భావిస్తారు. జాతరలోనే కుండను కొంటారు. అక్కడ దొరికే కూరగాయలు తీసుకొని నైవేద్యం వండుతారు. ఓదెల మల్లన్నకు చెలక బోనం అంటే ఇష్టం. పూజారుల దగ్గరకు బోనం కాకుండా.. బోనం దగ్గరికే పూజారులు వచ్చి సమర్పించే పద్ధతిని చెలకబోనం అంటారు.
mallanna3
2. పట్నం: ఓదెల మల్లిఖార్జున స్వామిని పట్నాల రూపంలో ఆరాధిస్తారు. ఈ పట్నాలు రెండు రకాలుగా వేస్తారు.

చిన్నపట్నం: ప్రతిరోజూ ఆలయ ప్రాంగణంలో పట్నాలు వేయడాన్ని చిన్నపట్నం అంటారు. మండప పట్నం, నజర్ పట్నం, చెలక పట్నం దీంట్లో రకాలు.
పెద్దపట్నం: ఓదెల మల్లన్న ఆలయంలో ప్రతీ సంవత్సరం ఆషాఢమాసంలో తొలి ఆదివారం రోజున అర్థరాత్రి పెద్దపట్నం వేస్తారు. అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు పట్నం వేసి మల్లన్న కల్యాణం జరుపుతారు.

mallanna4

222
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles