ఏనుగంత హృదయుడు!


Sun,July 21, 2019 01:12 AM

sarma
32 ఏండ్లు అలుపెరగని వైద్యసేవ. నిరంతర వైద్యుడిలా గడిపాడు. ప్రతియేటా 700లకు పైగా ఏనుగులు, ఇతర జంతువులను ప్రణాపాయం నుంచి కాపాడుతుంటాడు. ప్రేమ, పెండ్లి, కుటుంబానికి దూరంగా ఉంటూ వన్యప్రాణాలను చూసుకోవడానికి జీవితాన్నే ధారపోశాడు. ఎప్పుడో చిన్నప్పుడు ఆయన స్నేహితురాలి లక్ష్మి మరణం ఆయన్ను డాక్టర్ అయ్యేలా చేసింది. లక్ష్మికి, డాక్టర్‌కు, జంతువులకు మధ్య చాలా దగ్గరి సంబంధమే ఉంది. పూర్తి వివరాలు ఏంటంటే..

అసోంలోని బరామాకు చెందిన ఈ డాక్టర్ పేరు కుశాల్ కొన్వర్ శర్మ. అతనికి చిన్నప్పుడు లక్ష్మి అనే చిన్న ఏనుగుతో సావాసం కుదిరింది. శర్మ ఎక్కడికి వెళ్లినా లక్ష్మిని వెంటపెట్టుకొని తీసుకెళ్లేవాడు. అలా కొన్ని రోజులు సంతోషంగా గడిచాయి. అప్పుడు శర్మకు ఎనిమిదేండ్లు. అనుకోకుండా ఒకరోజు శర్మ తండ్రికి ఉద్యోగ రీత్యా పట్టణానికి ట్రాన్స్‌ఫర్ అయింది. కుటుంబం మొత్తం పట్టణానికి మారారు. చిన్న ఏనుగు అయిన లక్ష్మి అంటే శర్మ తల్లిదండ్రులకు కొంచెం భయం. పట్టణానికి లక్ష్మిని కూడా తీసుకెళ్లాలనుకున్నాడు. కాని తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో లక్ష్మిని అక్కడే వదలి వెళ్లాడు శర్మ. అలా 20 ఏండ్లు గడిచాయి. అమ్మమ్మకు ఫోన్ చేసి లక్ష్మిని అడిగాడు. లక్ష్మి చనిపోయింది. సరైన వైద్యుడు లేకపోవడంతో అనారోగ్యంతో చనిపోయిందని అమ్మమ్మ చెప్పింది. చిన్నప్పటి జ్ఞాపకాలు శర్మను వెంటాడుతూనే ఉన్నాయి. వైద్యుడు లేక ఏనుగు చనిపోయిందన్న వార్తను జీర్ణించుకోలేకపోయాడు. ఇలా ఎన్ని ఏనుగులు అనారోగ్యంతో చనిపోతున్నాయో.. శర్మ డాక్టర్ కావాలని సంకల్పించుకున్నాడు. 1986లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. 1994లో పశువైద్య శస్త్రచికిత్సలో పీహెచ్‌డీ చేసి చిన్న జీవుల నుంచి పెద్ద జీవుల వరకు వేటికైనా చికిత్స చేసేలా అనుభవం సంపాదించాడు.
sarma1
ఆసియాలో ఎక్కవ అవసరం: ఇక్కడి ఏనుగుల కన్నా ఆసియా ఏనుగులు ఎక్కువ అనారోగ్యానికి గురవుతుంటాయి. వాటికి వైద్యుడి అవసరం ఎంతో ఉంది. కుక్క, పిల్లి, గేదె, ఆవు ఇలా చిన్న జీవులను చూసుకోవడానికి దేశంలో ఎంతోమంది జంతువైద్యులున్నారు. కానీ, పెద్ద ఆకారంలో ఉన్న ఏనుగుల సంరక్షణకు డాక్టర్లు అరుదు. అందరిలా శర్మ కూడా అనుకుంటే అర్థం ఉండదు. శర్మ ఉండే పరిసరాల్లోనే కాకుండా చుట్టుపక్కల ఎక్కడ వైద్య అవసరం వచ్చినా క్షణాల్లో అక్కడ వాలిపోతాడు. అవసరం ఉంటే రాష్ర్టాలు, దేశాలు ప్రయాణించిన రోజులు కూడా ఉన్నాయంటున్నారు శర్మ. మానవ జీవనానికి అవసరమయ్యే పేపర్, ఫర్నీచర్ పనులకు అడవులను నరుకుతున్నారు. దీంతో జంతువులకు జీవనం కష్టభరితంగా మారుతుంది. ఏనుగులకు ప్రత్యేకంగా అడవిని ఏర్పాటు చేయాలనుకున్నాడు శర్మ. ఫ్యాక్టరీలు కట్టాలనుకుంటున్న స్థలాలను కొని ఆ ప్రదేశంలో చెట్లు నాటి, వాటి పెరుగుదల బాధ్యత తీసుకున్నాడు. ఈ అడవిలో ఏనుగులు, చిరుత పులులు, ఖడ్గమృగాలు పెద్ద జంతువులు సైతం ఉంటాయి. శర్మ ఇప్పటికీ ఒక స్టూడెంట్‌లా రోజుకు 12 గంటలు అసోంలోని గౌహతి అనే పట్టణంలో కాలేజ్ ఆఫ్ వెటెరినరీ సైన్స్‌లో క్లాసులు వింటుంటాడు. ఇందులో జంతువులకు పెద్ద ఆపరేషన్‌లు ఎలా చేయాలో చెబుతుంటారు. క్లాసులు, వైద్యంతో పాటు అడవులను పెంచుతున్నాడు. ఈ చెట్లు నీడతో పాటు జంతువులు తినే పండ్లు, కాయలను అందిస్తున్నాయి. అడవిలో గడ్డి ఎక్కువగా మొలిచేలా ఏర్పాటు చేశాడు.
sarma2
గవర్నమెంట్ సహకారం: శర్మ ఎల్రక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నాడు. ఎలక్ట్రిక్ వైర్లు అడవుల మీదుగా ఉన్నాయి. ఒక్కోసారి షార్ట్‌సర్క్యూట్ అవ్వడంతో చెట్లు తగలబడ్డాయి. దీంతోపాటు కొన్ని జంతువులు మరణిస్తున్నాయి. వీటిని పరిరక్షించేందుకు శర్మ అసోం గవర్నమెంట్‌కు అర్జీ పెట్టాడు. అధికారులను కలిసి వైర్లను తొలిగించాడు. అస్సాం టీ తోటలకు ప్రత్యేకం. టీ తోటల పెంపకం వల్ల ఏనుగుల మనుగడ ఉండదు. పంట పండించడానికి అడవిని పొలాలుగా మార్చడానికి ప్రయత్నించారు. వారికి అడవి, అక్కడుండే వన్యప్రాణుల ప్రత్యేకతను వివరించాడు. ఆవు, గేదె, మేకలను పెంచుకుంటే సంపాదన ఉంటుంది. ఏనుగుల పెంపకంతో ఏం ప్రయోజనం ఉందని శర్మని ఎదురుప్రశ్న వేశారు. ఏనుగులు లేకుండా అడవులు లేవు. అడవుల్లేకుండా మానవ మనుగడే ఉండదు అని శర్మ బదులిచ్చాడు. అరవై ఏండ్ల జీవితంలో ప్రతిఏడాది 700కు పైగా ఏనుగులను కాపాడుతున్న శర్మకు 2018లో అసోం గవర్నర్ జగదీశ్ ముఖి చేతుల మీదుగా ఎలిఫాంట్ మ్యాన్ ఆఫ్ ఆసియా టైటిల్‌ను అందుకున్నాడు శర్మ. నగరాల్లో జీవించడం కన్నా అడవిలో జంతువుల మధ్య ఉండడమంటే శర్మ తనకు ఇష్టం అంటున్నాడు.

ఈ అడవిలో ఏనుగులు, చిరుత పులులు, ఖడ్గమృగాలు పెద్ద జంతువులు సైతం ఉంటాయి. శర్మ ఇప్పటికీ ఒక స్టూడెంట్‌లా రోజుకు 12 గంటలు అసోంలోని గౌహతి అనే పట్టణంలో కాలేజ్ ఆఫ్ వెటెరినరీ సైన్స్‌లో క్లాసులు వింటుంటాడు. ఇందులో జంతువులకు పెద్ద ఆపరేషన్‌లు ఎలా చేయాలో చెబుతుంటారు.

213
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles