వర్షం పడ్డా టెన్షన్ ఉండదు..


Sun,July 21, 2019 12:40 AM

UE-Wonderboom
వర్షాకాలం వచ్చేసింది. బయటకెళ్తే ఎప్పుడు వాన కురుస్తుందో తెలియదు. వెంట తీసుకెళ్లిన ప్రతిదీ తడిసిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వ్యాలెట్, మొబైల్ ఫోన్, ఇతర హ్యాండీ యాక్సెసరీస్ అన్నీ తడిసిపోవాల్సిందే. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే వాటర్ ప్రూఫ్ గాడ్జెట్లే వాడితే ఎలా ఉంటుంది! వర్షం పడ్డా టెన్షన్ ఉండదు కదా! ఇలాంటి గాడ్జెట్లే ఇవి..

అల్టిమేట్ ఇయర్స్ బ్లూటూత్:

సరదాగా బయటకు వెళ్లేటప్పుడు బ్లూటూత్ స్పీకర్లను వెంట పెట్టుకొని వెళ్లడం చాలామందికి అలవాటైంది. మాన్‌సూన్ కదా అది తడుస్తుందేమో అని జాగ్రత్తపడి బయటకు తీసుకెళ్లడమే మానేస్తారు. అలాంటి వారి కోసమే వాటర్‌ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్లు ఉన్నాయి. వాటిలో UE Wonderboom ( అల్టిమేట్ ఇయర్స్ బ్లూటూత్) అందుబాటులో ఉంది. ఒకసారి చార్జింగ్ చేస్తే పది గంటలు వస్తుంది. మొబైల్‌కు కనెక్ట్ చేసి వంద ఫీట్ల రేడియేషన్‌లో దీన్ని వాడుకోవచ్చు. విషయం ఏంటంటే వాటర్‌లో పడినా ఇది పని చేస్తుంది. 30 నిమిషాలు నీటిలో తడిసినా కూడ 360 డిగ్రీల్లో సౌండ్‌ను క్వాలిటీగా ఇస్తుంది.

కెమెరా:

మాన్‌సూన్‌లో చూడాల్సిన ప్రదేశాలు ఉంటాయి. వాటిని చూడడానికి వెళ్లేటప్పుడు కెమెరా లేకపోతే టూర్‌కు కిక్కే రాదు. కానీ వర్షాకాలం కెమెరాను వాడలేం. అట్లాగే వాటర్ స్పోర్ట్స్ ఆడుతూ వీడియో తీయాలంటే వాటర్ ప్రూఫ్ కెమెరాలుండాలి. అలాంటి వాటిని కొనాలనుకుంటే GoPro Hero5 Session గోప్రో కెమెరా ఉంది. నీటిలో తడిసినప్పటికీ దాని పని అది సమర్థవంతంగా నిర్వహిస్తుంది. అట్లాగే Nikons Coolpix AW130 కెమెరా కూడా వాటర్‌ప్రూఫ్ సిస్టమ్‌ను కలిగిఉంది. 16 ఎంపీ సామర్థ్యం తో సాధారణ బడ్జెట్ ధరలో ఇది అందుబాటులో ఉంది.

మొబైల్:

ఇప్పుడు వస్తున్న మొబైల్స్ చాలా మట్టుకు వాటర్ రెసిస్టెన్స్ బాడీతో వస్తున్నాయి. అలాంటి టాప్ మొబైల్స్‌లో యాపిల్ ఐఫోన్ 7, 7 ప్లస్, శామ్‌సంగ్‌లో గెలాక్సీ ఎస్10, ఎస్8, ఎస్8ప్లస్, గూగుల్ పిక్సెల్ 3, 3ఎక్స్‌ల్, సో నీ ఎక్స్‌పీరియా జెడ్ ఆర్ ఫోన్లు ఉన్నాయి. ఈ అన్ని ఫోన్లు 1 మీటర్ నీటిలో దాదాపు 30 నిమిషాలు తడిసినా పని చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

258
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles