వాస్తు


Sun,July 21, 2019 12:37 AM

vasthu

నైరుతిలో వర్కర్స్ గదులు వేసుకోవచ్చా? అక్కడ బరువు కోసం ఉండాలట కదా?

- మోక్షరామ్, భువనగిరి
ఇల్లు-ఇతర గదులు ప్రతి స్వతంత్ర గృహ నిర్మాణంలో అవసరం అవుతాయి. వాటిని శాస్త్ర సమన్వయంతో రూపొందించడం ముఖ్యం. నైరుతి బరువు, ఈశాన్యం తేలిక అనేది భౌతికమైన బరువుతో లెక్కించవద్దు. వాస్తు వకాబులరీ అంతరార్థం వేరుగా ఉంటుంది. నైరుతి గది ఎప్పుడూ యాజమాన్యానికి చెందినదై ఉండాలనేది శాస్త్ర సంకేతం. కారణం ఆ దిశ ఆరోగ్య, ఐశ్వర్య సంపదలతో పుష్ఠిని వ్యక్తులకు అందిస్తుంది. ఇంట్లో బరువు బాధ్యతలు చూసుకునే వారికి ఆ స్థానం ఇవ్వాలి. ఇది వాస్తు అంశం. నడుపగలవారే కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలి కదా... డ్రైవింగ్ రాని వారు కాదు కదా! అందుకని ఆ గదులు నైరుతిలోని ఖాళీ ప్రదేశంలో వేస్తే వాటిని ఇంటి పెద్దనే వాడాల్సి ఉంటుంది. మీరు ఏ ఉద్దేశ్యంతో వేయాలనుకుంటున్నారో ముందు తేల్చుకుని ఆ ఉపగదులు వర్కర్స్ కోసం అయినప్పుడు నైరుతి కాకుండా.. ఆగ్నేయం, వాయువ్యంలో వేసుకోండి. అవి ఇంటి కప్పు కన్నా తక్కువ ఎత్తు, అలాగే ఫ్లోరింగ్ కూడా తక్కువ ఎత్తులో ఉండేలా చూసుకోండి.

సెల్లార్ ఈశాన్యంలో తీస్తే బాగుంటుందా?

అన్నింటికీ సెల్లార్ తప్పనిసరి కాదు... వద్దనీ కాదు.. వ్యాపార నిర్మాణాలకు ఈ రోజుల్లో తప్పనిసరి అయింది. సెల్లార్ ఏ రోడ్లకు తీయాలి ఏ రోడ్లకు తీయవద్దనేది తప్పక చర్చించాల్సినవసరం ఉన్నది. ఈశాన్యంలో తీయాల్సిందే అనేది లేదు. కొందరు స్థలం వాడకం ఎక్కువ చేసుకోవడానికి ఉత్తరం లేదా ఈశాన్యం సెల్లార్ తీసుకొని అక్కడే కొంత పార్కింగ్ పెంచుకుంటారు. అది ఫర్వాలేదు. ఈశాన్యం సెల్లార్ ఓకే... కానీ ఎవరు అనేది తెలియాలి. దక్షిణం, పడమర స్థలాల వారు మాత్రమే సెల్లార్‌కు వెళ్లాలి అనేది ఖచ్చితమైన విషయం. ఆకలి అని షుగర్ వ్యాధిగ్రస్తుడు స్వీట్లతో కడుపు నింపుకోవద్దు కదా....! తూర్పు, ఉత్తరం వాళ్లు సెల్లార్ కాకుండా స్టిల్డ్‌కు (నేలమీద పార్కింగ్)వెళ్లాలి. దక్షిణం, పడమర రోడ్లు ఉన్నా కూడా సెల్లార్ తీసుకోవల్సినవసరం మాత్రం లేదు. ఏదైనా అవసరం ఉంటేనే నిర్ణయం తీసుకోవాలి.
- సోమశేఖర్, నెల్లుట్ల .

బాత్‌రూముల్లో అద్దం పెట్టుకోవచ్చా?

ఒకప్పుడు టాయిలెట్లు ఇంటికి దూరంగా ఉండేవి. పైగా మరుగుదొడ్లు వేరుగా స్నానాల గది వేరుగా కట్టి అందులో వేడి నీటికి పొయ్యి బాయిలర్ అమర్చేవారు. అలా ఇంటి అంతర ఆవరణ గొప్ప శుద్ధిని కలిగి ఉండేది. అలా మరుగుదొడ్ల వ్యవస్థ వేరుగా ఇండిపెండెంటుగా ఉండేది.ఇప్పుడు లెట్రిన్, స్నానాల గది కలిసిపోయాయి. ఇదంతా స్థలాభావం వల్ల వచ్చిన ఒత్తిడి. ఇది గొప్పదని కాదు. తప్పని స్థితి. ఇక ఇలాంటి పరిస్థితిలో వాటిల్లో అవసరాలకు అద్దాలు బిగిస్తున్నారు. అద్దాలు పెట్టుకొని వాడడం తప్పుకాదు. అందులో షేవింగ్ వంటి పనులు చేసుకోవచ్చు. దానికి తగిన అద్దం వాష్ బేసిన్ పెట్టొచ్చు. కానీ బ్రష్షింగ్ (పండ్లు తోమే బ్రష్‌లు) చేసుకోవడం మంచిది కాదు. కేవలం స్నానాల గది ఒక్కటే ఉంటే అందులో అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి మీరు బాత్‌రూమ్‌లో అద్దం పెట్టుకోవచ్చు. అది మన అంతరంగ వ్యవస్థను రూపుదిద్దుతుంది.
- కె. రమణాచారి, నాదర్‌గుల్

డూప్లెక్స్ ఇంట్లో సీత్రూ తూర్పులో ఉండాలా? ఈశాన్యంలో ఉండాలా? లేకున్నా ఫర్వాలేదా?

- వీణవంక నీలకంఠ, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్.
పైనుంచి కిందకు చూసేవిధంగా హోల్ డూప్లెక్స్ ఇండ్లలో ఏర్పాటు చేస్తుంటారు. కారణం ఆ ఇండ్లలో దక్షిణం, పడమరలో మెట్లు విశాలంగా తీసుకొని ఆ మెట్ల మధ్య డైనింగ్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలా పెద్దగా రెండు విశాలమైన మెట్ల వల్ల దక్షిణం గొయ్యి అవుతుంది. దానిని బ్యాలెన్స్ చేయడానికి ఆ మెట్లకు అభిముఖంగా మరొక గొయ్యి(సీత్రూ)తియ్యాలి. అంటే మెట్లు కట్టింగ్ దక్షిణంలో వస్తే ఉత్తరం వైపు, పడమర మెట్లు వేసుకొనిఉంటే తూర్పులో సీత్రూ పెట్టుకోవచ్చు. ఏదేమైనా బ్యాలెన్స్ చేయాలి అనేది వాస్తులో ప్రధానం.
vasthu1
సుద్దాల సుధాకర్ తేజ
[email protected]
Cell: 7993467678

240
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles