రాశి ఫలాలు


Sun,July 21, 2019 12:31 AM

21-7-2019 నుంచి 27-7-2019 వరకు

మేషం

వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. సంగీత, సాహిత్య సభలకు, సమావేశాలకు హాజరవుతారు. వైద్య, న్యాయవాద, ఇంజినీరింగ్ వృత్తులలో ఉన్నవారు రాణిస్తారు. తలపెట్టిన ప్రయాణాలు సానుకూలంగా ఉంటాయి. ప్రధాన గ్రహాలస్థితి ప్రతికూలంగా ఉంది. కాబట్టి దీర్ఘకాలిక పనులలో ఆటంకాలుంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అన్నదమ్ములు, బంధువులతో మనస్పర్థలు ఉండొచ్చు. వాహనాల వల్ల ఖర్చులుంటాయి. నలుగురి సహాయ సహకారాలు అనుకున్న సమయానికి అందకపోవచ్చు.

వృషభం

ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. తోటివారితో మంచి మాట ఉంటుంది. తగిన ఆదాయం పెంపొందించుకునే అవకాశాలు ఉంటాయి. దేవతా గురుభక్తి పెరుగుతుంది. మంచి వారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. పిల్లల చదువు, శుభకార్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితుల వల్ల చాలా పనులు కలిసొస్తాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ, పారిశ్రామిక రంగాలలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. డబ్బు విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

మిథునం

రోజువారీ వ్యాపారం అనుకూలిస్తుంది. నిత్యావసర వస్తు, షేర్, వడ్డీ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. సంగీత, సాహిత్య సభలలో పాల్గొంటారు. హోటలు, క్యాటరింగు వ్యాపా రాలు సంతృప్తికరంగా ఉంటాయి. తోటి ఉద్యోగులతో మనస్పర్థలు రాకుండా చూసుకోండి. పెద్దల సూచనలు తప్పక పాటించాలి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాహనాల వల్ల వృథా ఖర్చులు ఉంటాయి. ఆర్థిక సమస్యల వల్ల పనులు వాయిదా పడుతాయి.దీర్ఘకాలిక పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది.

కర్కాటకం

రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. ప్రారంభించిన పనులు వేగం గా పూర్తి చేస్తారు. మంచి వారితో సంబంధాలు పెరుగుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు తీరుతాయి. ఇంటా, బయటా అందరితోనూ సంతృప్తికరంగా ఉంటారు. కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు. సంగీత, సాహిత్య సభలకు హాజరవుతారు. పత్రికా, సాహిత్య రంగాలలో ఉన్నవారికి మంచి పేరు వస్తుంది. అనుభవజ్ఞులు, తల్లిదండ్రులు, పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగులకు పై అధికారులతో ఇబ్బందులు ఉంటాయి. అధిగమించడానికి ఓపిక, నిబద్ధత అవసరం.

సింహం

సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నవారికి తాత్కాలిక ప్రయోజనాలు చేకూరుతాయి. వారం మొత్తం సంతృప్తికరంగా ప్రధానగ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. దీనివల్ల పెద్ద పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు ఉండొచ్చు. ఆఫీసులో తోటి వారితో, పై అధికారులతో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనాల వల్ల ఖర్చులుంటాయి. ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్నవారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది.

కన్య

ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. తాత్కాలిక ప్రయోజనాలున్నాయి. ఉద్యోగులకు ఆఫీసులో మంచి పేరు వస్తుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. నిత్యావసర వస్తు వ్యాపారం, వడ్డీ, షేర్, రియల్ ఎస్టేట్, హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ మొదలైన వ్యాపారాలలో తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది. న్యాయవాద, వైద్య వృత్తులలో ఉన్న వారి పనులు నిరాటంకంగా సాగుతాయి. సోదరులు, ఆత్మీయులతో సంబంధాలు పెరుగుతాయి.

తుల

ఉద్యోగులకు ఆఫీసులో మంచిపేరు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు పెడతారు. నూతన వస్త్ర, వస్తువులను కొంటారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. న్యాయవాద, ఉపాధ్యాయ, వైద్య వృత్తులలో ఉన్నవారు సంతృప్తికరంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. లాభాలను గడిస్తారు. రోజువారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలు చేస్తారు. రావాల్సిన డబ్బు వస్తుంది. ఆర్థిక సమస్యలు తీరతాయి.

వృశ్చికం

గ్రహాలన్నీ ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి పనుల్లో నిబద్ధత, ఓపిక అవసరం. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాలలో కార్యకర్తలతో ఇబ్బందులు ఉంటాయి. చేసే పనులలో గుర్తింపు లభించకపోవచ్చు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. వృథా ఖర్చులుంటాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవచ్చు. పనివారితో తగాదాలు ఏర్పడతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనుభవజ్ఞులు, పెద్దల సూచనలు పాటించాలి.

ధనుస్సు

రోజువారీ వ్యాపారం కొంత కలిసి వస్తుంది. న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి సంతృప్తికర వాతావరణం ఉంటుంది. చిన్న వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఇంట్లో అనవసరమైన చర్చలు జరుగుతాయి. విందులు, వినోదాలకు వెళ్లాలని ఉన్నా సాధ్యం కాకపోవచ్చు. పెద్దవారు, అనుభవజ్ఞులు, తల్లిదండ్రుల మాటలను, సూచనలను పట్టించుకోక పోవడం వల్ల నష్టం జరుగుతుంది. పనివారితో వైషమ్యాలు ఏర్పడతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవ చ్చు. ఖర్చులు మాత్రం పెరిగిపోతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మకరం

శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి వారితో సాహచర్యం పెరుగుతుంది. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. చదువులు అనుకూలిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంగీత, సాహిత్యసభలకు హాజరవుతారు. పనివారితో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. వృథా ఖర్చులుంటాయి. రావాల్సిన డబ్బు అందకపోవచ్చు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వాహనాల వల్ల ఖర్చులుంటాయి.

కుంభం

ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలుంటాయి. రోజువారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. నిత్యావసర వస్తు, వడ్డీ, షేర్, హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ, భూముల వ్యాపారాలు అనుకూలిస్తాయి. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేస్తారు. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. పనివారితో సమస్యలు తీరుతాయి. వాహనాల వల్ల కలిసొస్తుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు.

మీనం

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలు, ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో మంచి పేరు గడిస్తారు. పెద్దల విషయంలో భక్తి భావన పెరుగుతుంది. ఇంట్లో సుహృద్భావ వాతావరణం ఉంటుంది. వస్త్ర, వస్తువులను కొంటారు. ఆఫీసులో తోటి ఉద్యోగులతో ఇబ్బందులుంటాయి. పై అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందక పోవచ్చు. పనివారితో మనస్పర్థలు ఏర్పడొచ్చు. సోదరులు, ఆత్మీయులతో వైషమ్యాలు గోచరిస్తున్నాయి. రోజువారీ వ్యాపారంలో ఒడిదుడుకులుంటాయి.

rasi-phalalu
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : [email protected]

2114
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles