మూడు గోడల కథ!


Sun,July 14, 2019 01:46 AM

గోడా.. గోడా! నువ్వేం చేస్తావ్ అంటే నేను ఇద్దరి మనుషులను, రెండు హృదయాలను కలిపి.. వారికి ప్రేమను పంచుతా అని అంటుంది. గోడా.. గోడా నువ్వేం చేస్తావ్ అని మరో గోడను అడిగితే.. నేను మానవత్వానికి, దయార్ద్ర హృదయానికి ప్రతీకగా నిలుస్తా అని అంటున్నది. గోడా.. గోడా నువ్వేం చేస్తావ్ అని మరొక గోడను అడిగితే.. నేను భావితరాలకు చక్కనైన సందేశాన్ని ఇస్తానని అంటున్నది. అసలీ గోడల గొడవేమిటి అనుకుంటున్నారా? ప్రేమను పంచి, మానవత్వాన్ని పెంచి, ఆచరణాత్మక సందేశాన్ని ఇచ్చే ఆ మూడు గోడలు గురించే ఇది.

మానవత్వాన్ని పంచే గోడ

పుణెకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఈ వాల్ ఆఫ్ హ్యూమానిటీని రూపొందించారు. ఇక్కడ నిరుపయోగంగా ఉన్న దుస్తులను ఉంచితే.. అవి అవసరమైన వారు తీసుకొని ఉపయోగించుకుంటారు. దీన్ని నెల రోజుల క్రితం ప్రారంభించారు విజయ్, అతని తమ్ముడు అనిల్. వీరిద్దరి ప్రయత్నం చూసి.. చాలామంది తమకు నిరుపయోగంగా ఉన్న దుస్తులు ఇక్కడ ఇచ్చేస్తున్నారు. దీనివల్ల పేదలు చాలా మంది మంచి బట్టలు పొందుతున్నారు. ఉన్నవాళ్లు.. పేదలకు సాయం చేస్తేనే కదా మానవత్వానికి అర్థం అని రాథోడ్ అనే వ్యక్తి అంటున్నాడు. ఇతనికి చేతిలో డబ్బులు లేవు. బట్టలు కొనుక్కునే స్థోమతా లేదు. ఈ వాల్ ఆఫ్ హ్యూమానిటీ ద్వారా తాను మంచి బట్టలు తొడుక్కోగలుగుతున్నానని సంతోషంగా చెబుతున్నాడు.
wall-of-love

చెత్తపై సందేశం!

చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఈ గోడ ఉత్తరాఖండ్‌లో ఉన్నది. దీనిని చూడగానే ఇటుకలతో కట్టి.. అందంగా రంగులు వేశారని ఎవరైనా అనుకుంటారు. అయితే.. ఈ అందమైన గోడను ప్లాస్టిక్ బాటిల్స్‌తో నిర్మించారు. ఇది ఉత్తరాఖండ్‌లోని మసూరీలో ఉన్నది. దీని పేరు వాల్ ఆఫ్ హోప్. మల్టీనేషనల్ కార్పొరేషన్ డైరెక్టర్ సంజయ్ ఖాజూరియా సీఎస్‌ఆర్ ఫండ్స్‌తో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు. ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేయడానికి ఇదొక క్రియేటివ్ ఐడియా. అంతేకాకుండా అందిరినీ ఆలోజింపజేస్తున్నది కూడా. భవిష్యత్ తరాలకు ఇదొక పాఠంగా ఉంటున్నది. దీనిని నిర్మించడానికి 15,000 ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించారు. 1500 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తులో ఈ వాల్ ఆఫ్ హోప్ రూపు దిద్దుకున్నది. బంగ్లా కి కండి గ్రామ ప్రజలు స్కూల్, కాలేజ్ విద్యార్థులు, 50 మంది వలంటీర్లు కలిసి ఈ గోడ నిర్మాణంలో సహాయం చేశారు. ఈ గోడ చెత్త వేయకూడదనే సందేశాన్ని ఇస్తున్నది.
wall-of-love1

ప్రేమను పంచే గోడ

ప్రపంచంలోని మోస్ట్ రొమాంటిక్ స్పాట్ ఏంటని అడిగితే పారిస్ అంటారు. అలాంటి రొమాంటింక్ ప్రదేశాల్లో ఒకటి వాల్ ఆఫ్ లవ్. ఇక్కడికి వచ్చి ఎవరినైనా ప్రపోజ్ చేస్తే ప్రియుడు/ప్రేయసి తప్పకుండా ప్రేమను అంగీకరిస్తారనే నమ్మకం ఉంది. అందుకే ప్రేమికులు ఎవరైనా ఈ ప్రదేశానికి రావాల్సిందే అంటున్నారు సందర్శకులు. ఈ వాల్ ఆఫ్ లవ్ మీద 312 భాషల్లో ఎలా ప్రపోజ్ చేయాలో రాసి ఉంటుంది. ఫ్రెడెరిక్ బారన్, ైక్లెర్ కిటో అనే ఇద్దరు ఆర్టిస్టులు ఈ గోడను డిజైన్ చేశారు. పారిస్‌లో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రేమను ఎలా తెలియజేస్తారో తెలుసుకున్నారు. ఈ గోడ పారిస్‌లోని డి అబ్బెస్సెస్‌లో ఉన్నది. అక్కడికి ఎవరైనా వెళ్లొచ్చు. ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. వాల్ ఆఫ్ లవ్ ఇప్పుడు టూరిస్ట్ ప్రదేశంగా మారిందంటున్నాడు బారన్.
wall-of-love2

587
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles