వాస్తు


Sun,July 14, 2019 12:45 AM

VASTHU

ఇండ్లలో జంతువులను పెంచుకోవచ్చా?

- ఏలె రామలక్ష్మి, నర్సంపేట
మన సనాతన సంప్రదాయంలో ఏ జీవన వైభవం ఉందో దానినే మనం అనుసరించాలి. దానిని ఆమోదించే మన శాస్త్రం పెంపుడు జంతువులుగా మనకు కోళ్లు, ఆవులు, మేకలు, గొర్లు, గుర్రాలు, కుక్కలు.. ఎక్కువ. ఇక ఆ తరువాత ఇవాళ ఎన్నో చేరుకున్నాయి. పాములు, ముంగీసలు, తాబేళ్లు ఇలా ఎన్ని చేరినా ఏవి ఎంత దగ్గరగా మనిషితో జతకట్టినా, సహజీవనం చేసినా వాటి జీవన విధానం, ఆహారం సంతాన సంయోగాలు విభిన్నంగా ఉంటాయి. ఇంటితో పాటు కలిపి కాకుండా ఇంటికి దూరంగా వాటి నివాసాలు ఏర్పాటు చేయాలి. పిలగాడు ముద్దు అయితే వాడి విసర్జకాలు ముద్దు కాదు అన్నట్లు పెంపుడు జంతువుల ఏర్పాట్లను ఉపగదులుగా ఆగ్నేయ, వాయవ్యాలతో కట్టుకోవాలి. మన పెరడులో వాటిని పెంచుకుంటే బాగుంటుంది. మనిషి మనిషే, జంతువు జంతువే ఆ విభజన నివాసంలో చాలా అవసరం.

ఎండిపోయిన కాలువ కూడిపి రోడ్డు వేసుకోవచ్చా. దానికి ముందు స్థలంలో మా ఇల్లు కట్టొచ్చా?

- రాపెల్లి సుజాత, బెజ్జంకి
కాలువ లోతుగా ఉంటే దానిని కూడ్పినా మళ్లీ మళ్లీ కృంగే అవకాశం ఉంటుంది. మరి ఎండిపోయిన కాలువ అయితే కూడిపేసినా ఫరవాలేదు అనుకుంటే ఇంజినీర్ల సలహా తీసుకొని దానికి ముందు వైపు మీరు ఇల్లు కట్టుకోవచ్చు. అయితే ఆ కూడిపిన కాలువ భాగాన్ని మాత్రం ఇంటి నిర్మాణంలోకి రానివ్వకూడదు. నిర్మాణం నిలువదు. తప్పక మీ ఇంటికి ప్రహరీ గోడలు కట్టుకోవాల్సి ఉంటుంది. ప్రహరీలు కూడా కాలువ మీదకు పోనివ్వకుండా ముందే మీ స్థలాన్ని తొంభై డిగ్రీలకు మట్టం చేసుకొని లోపల ఇంటికొరకు ప్లాను చేసుకొని శాస్ర్తానికి అనుగుణంగా ఇల్లు కట్టుకోండి. శుభాలు కలుగుతాయి.

మా ప్రాంతంలో దిశలు సరిగ్గా ఉండవు. రోడ్డు వైపు లెట్రిన్, ఇంట్లో బావి ఉంది. మాకు బాగుంటుందా?

- కె.మణిరత్నం, మంచిర్యాల
దిశలు లేని ఇండ్లలో మనుషులు నివసిస్తే వాటితో పాటు సమస్యలు కూడా నివసిస్తాయి. దిశ విషయంగా రాజీ పడితే ఇబ్బందుల విషయంలో కూడా రాజీపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈశాన్యం రోడ్డు తప్ప మిగతా దిక్కులన్నీ అనేక విషమ సమస్యలను తెచ్చిపెడతాయి. మీరు చెప్పినట్టు ఇంటిముందు లెట్రిన్ ఉంటే అది ఈశాన్యం అయినా తూర్పు అయినా ఉత్తరం అయినా దోషమే అవుతుంది. పోతే ఇంట్లో బావి ఉంది అంటున్నారు. ఇంట్లో బావి మరణాల దీవి ఇంటి లోపల చేద బావులు మంచివి కావు. మీరు ఉండేది గొప్ప గృహం కాదని స్పష్టంగా చెప్పవచ్చు. మీకు రోడ్డు ఈశాన్యం వచ్చి ఉంటే ఆ లెట్రిన్ గదిని మార్చండి. ఇంట్లోని బావిని పూడ్చండి. లేదా ఇంటికి నైరుతి వీధి ఉంటే అటువైపే మఖద్వారం ఉంటే ఇంటినే మార్చండి. మంచి దిశలున్న ప్రాంతంలో రెంటు ఇంటికైనా వెళ్లండి. కష్టమైనా తప్పదు మార్పు.

హైటెన్షన్ వైర్ల కింద ఇండ్లు ఉండొచ్చా?

- పి.రాజశేఖర్, మదీనాగూడ
ఇండ్ల నిర్మాణంలో పరిసరాల ఎంపిక చూడకుండా నిర్ణయం తీసుకోవద్దు. గొప్ప వాస్తు గృహం అయినా భూకంపాల ప్రదేశంలో కడితే ఉండదు కూలుతుంది. అట్లాగే హైటెన్షన్ వైర్ల కింద, దగ్గరలో ఇండ్ల నిర్మాణం చాలా భయంకరం. అనేక శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. యమ పాశాలు ఎక్కడి నుండో రావాల్సిన అక్కరలేదు మన నెత్తిమీదనే ఉంటాయి. ఇవాళ చాలా కాలనీలు వాటి కింద నిర్మిస్తున్నారు. అనేక సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు ఊరికి చాలా దూరంగా ఉండేవి. ఇప్పుడు ఊర్లే వాటి కిందికి చేరుతున్నాయి. కనీసం డ్బ్భై అడుగుల నుండి వంద అడుగుల దూరంగా అవి ఉంటేనే ఇంటికి రక్షణ. తాటి చెట్ల కిందనే ఇల్లు కట్టొద్దు అన్నది శాస్త్రం. కారణం పిడుగును అవి ఆకర్షిస్తాయి అని. అలాంటిది హైటెన్షన్ ఇండ్ల కింద ఇండ్లు పనికి వస్తాయా? పనికిరావు. ఉంటే ఇల్లు మారండి.
VASTHU1
సుద్దాల సుధాకర్ తేజ
[email protected]
Cell: 7993467678

223
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles