ఎవరు?


Sun,June 16, 2019 12:50 AM

1870లలోని అమెరికా. ఎక్కడికి వెళ్ళాలన్నా గుర్రాలు లేదా గుర్రపు బగ్గేలనే ఉపయోగించే రోజులవి. కార్లు కనిపెట్టబడి నగరాలు విస్తరించాయి కానీ, అంతకు మునుపు నగరాలు తక్కువ. గ్రామాలు ఎక్కువ. కొచిన్ రివర్ కౌంటీలోని ప్లెజంట్ విల్ గ్రామ జనాభా 732. ఆ గ్రామస్తుల మధ్య ఏదీ దాగదు. ఆ గ్రామంలోని ఏభై ఏళ్ళ మోరిస్ ఏకైక వారసుడు కొడుకు హేరీ తన పద్దెనిమిదో పుట్టిన రోజున కొన్ని ఆవులను పొరుగు గ్రామంలోని సంతకి తీసుకెళ్ళి అమ్మి డబ్బు తీసుకు వస్తూంటే ఓ దుర్ఘటన జరిగింది. ఎవరో అతన్ని కాల్చి చంపి ఆ డబ్బుని తస్కరించారు. ఈ సంగతి తెలిసిన మోరిస్‌లో బయటకి ఎలాంటి భావోద్వేగాలు కనపడలేదు. ఆయనలో ఎవరికీ విచారం కనపడలేదు. ఆయన హంతకులకి ఎలాంటి హెచ్చరికలూ చేయలేదు. షెరీఫ్, ఇద్దరు డిప్యూటీ షెరీఫ్‌లు ఎంత ప్రయత్నించినా హేరీ హంతకుడ్ని కనుక్కోలేక పోవడంతో ఇక ఆ ప్రయత్నం విరమించుకున్నారు. ఇది తెలిశాక కూడా ఆయనలో ఎలాంటి భావోద్వేగాలు కనపడలేదు. తన చిన్న రేంచ్‌లో ఆవులను చూసుకుంటూ ఏం జరగనట్లే మోరిస్ జీవించసాగాడు.
Evaru-crime-story
మోరిస్ కొడుకుని చంపడంతో హంతకులు ఆగలేదు. సంవత్సరం తిరిగే లోగా కొచిన్ రివర్ కౌంటీకి చెందిన మరో ఇద్దరు డబ్బు తీసుకెళ్తూ, కాల్చి చంపబడ్డారు. డబ్బు కూడా మాయమైంది. వారిలోని కార్టర్ అనే మరో వ్యక్తి కూడా చాలా ఆవులని అమ్మాడు. కానీ, అతను డబ్బుని తన మిత్రుడి దగ్గర దాచి బయలుదేరాడు. అతని దగ్గర డబ్బు లేకపోవడంతో ఆ హంతకులు కసిగా ఆరు గుళ్ళు కాల్చి చంపారు. ప్రతీసారి హంతకులు హతుల రివాల్వర్లనే ఉపయోగించి చంపేవారు.
ఐతే, ఆ హంతకులు ఎవరన్న ఆధారం ఒక్కటీ షెరీఫ్, డిప్యూటీ షెరీఫ్‌లకు తెలీలేదు. షెరీఫ్ వృద్ధుడు. అతని ఇద్దరి డిప్యూటీలు శామ్, జోలు యువకులు. ఐనా, వారికి పరిశోధనలో పెద్దగా అనుభవం కాని, నైపుణ్యం కాని లేదు. ఆ ఇద్దరూ చాలా దూరం గుర్రాలమీద తిరిగి హంతకుల కోసం వెదికారు. కానీ, ఉపయోగం లేకపోయింది. దాంతో కొచినో కౌంటీకి చెందిన వారు డబ్బుతో ఒంటరిగా ప్రయాణించటం మానుకున్నారు.

మోరిస్‌కు అనుకోని అదృష్టం వచ్చింది. అతని భార్యకి చెందిన ఓక్లహామా భూమిలో చమురు పడటంతో అది పెద్ద మొత్తానికి అమ్ముడైంది. ఆయన హేరీ పోయినప్పుడు ఎలా విచారాన్ని ప్రకటించలేదో అలాగే భార్య ద్వారా చాలా డబ్బు వచ్చాక కూడా సంతోషాన్ని ప్రకటించలేదు. ఆ చెక్ తీసుకుని కుచినో సెంటర్ బ్యాంక్‌కు వెళ్ళి దాన్ని నగదుగా మార్చుకున్నాడు. ఆ గ్రామ షెరీఫ్ అంత డబ్బుని వెంట తీసుకెళ్ళవద్దని, బ్యాంక్‌లోనే డిపాజిట్ చేయవద్దని కోరినా మోరిస్ ఆ సలహాని స్వీకరించలేదు. కేషియర్ నోట్లని లెక్కపెట్టి ఇచ్చాక వాటిని చుట్టి రబ్బర్ బ్యాండ్‌లో పెట్టి జేబులో ఉంచుకుని దానికి గుండీలు పెట్టుకున్నాడు. ఆ డబ్బుతో ముప్పయి మైళ్ళ దూరంలోని తన గ్రామానికి బయలుదేరాడు. ఆ కౌంటీలోని అందరికీ అతని అదృష్టం గురించి తెలీడంతో షెరీఫ్ రక్షణకి వెంట ఎవరైనా పంపుతానని చెప్పినా మోరిస్ మర్యాదగా నిరాకరించాడు. రక్షణగా తన వెంట తీసుకెళ్ళే రివాల్వర్ని చూపించాడు.

ఇది చాలా పాతది. పాయింట్ 10 రివాల్వర్. ఈ రోజుల్లో ఎవరూ దీన్ని వాడరు. పాయింట్ 32 కోల్ రివాల్వర్ కొనుక్కెళ్ళు షెరీఫ్ దాన్ని చూసి నవ్వి చెప్పాడు. కానీ, మోరిస్ మొండిగా ఆ పాత రివాల్వర్‌తోనే తన గుర్రబ్బండి మీద బయల్దేరాడు. దాదాపు మూడు గంటలు ప్రయాణించాక మోరిస్ దూరంలోని కొండమీంచి ఎవరో గుర్రం మీద తనవైపు రావడం చూసాడు. గుర్రాన్ని ఆపి తన రివాల్వర్‌తో సిద్ధంగా ఉన్నాడు. కానీ, వచ్చింది తమ ఊరి డిప్యూటి షెరీఫ్ శామ్ అని తెలిసాక దాన్ని మళ్ళీ యథాస్థానంలో ఉంచుకున్నాడు.
హెరిట్ మౌంటెన్ ప్రాంతంలో ఓ కొత్త వ్యక్తి తచ్చాడుతున్నాడని చూసిన కొందరు నాకు ఫిర్యాదు చూసారు. షెరీఫ్‌కు చెప్తే నన్ను వెళ్ళి అతను ఎవరో కనుక్కోమని పంపాడు. దారిలో నీకు కొత్త వాళ్ళెవరైనా కనపడ్డారా? అని శామ్ ప్రశ్నించాడు.

ఊహు. నా పగ చల్లారడానికే నా పాత రివాల్వర్లో గుండు రివాల్వర్ గొట్టంలోంచి కాకుండా, కేవలం వెనకవైపు పేలేలా ఏర్పాటు చేశాను. డబ్బివ్వకపోతే నీకు కోపం వస్తుందని నాకు తెలుసు
నీకు డబ్బిస్తాను. చాలా డబ్బిస్తాను. నన్ను కాపాడు శామ్ అర్థించాడు.


లేదు. కనపడలేదు

నువ్వు బ్యాంక్ నుంచి చాలా డబ్బుతో వస్తున్నావని మన గ్రామస్థులు చెప్పారు. అది నిజమేనా? శామ్ మళ్ళీ అడిగాడు. అవును
ఒంటరిగా ఈ దారిలో రావడానికి నీకు భయంగా లేదా? శామ్ ఆసక్తిగా అడిగాడు.
నికి భయం? నా దగ్గర ఈ రివాల్వర్ ఉంది. దాన్లో గుళ్ళున్నాయి. ఎవరినైనా తేలిగ్గా ఎదుర్కోగలను
కానీ, ఆ దొంగ దాక్కుని నిన్ను ఏ రాతి చాటునుంచో నీ కొడుకు హేరీని చంపినట్లుగా కాల్చి చంపచ్చుగా?
తన కొడుకుని గుర్తు చేయగానే మోరిస్ మొహం కోపంతో ఎర్రబడింది. మొదటిసారి ఆయన తన భావోద్వేగాలని అణచుకోలేదు.
వాళ్ళు తమ రివాల్వర్‌ని ఎన్నడూ ఉపయోగించలేదు. పైగా నన్ను చంపితే వాళ్ళకి ఎలాంటి లాభం ఉండదు. డబ్బుని ఎక్కడ దాచానో తెలీదు. నన్ను ఎంత వెదికినా ప్రయోజనం ఉండదు
అంటే, దారిలో ఎక్కడైనా దాచావా? శామ్ ఆసక్తిగా అడిగాడు. మోరిస్ తల అడ్డంగా ఊపాడు.
అంటే నీ దగ్గరే ఉందా? ఆయన అవునన్నట్లుగా తల ఊపాడు.
నువ్వు వారం రోజులు వెదికినా అది నీకు కనపడదు. కానీ, హేరీని చాటు నుంచి కాల్చి చంపలేదు. వాడిని, మిగిలిన అందరినీ హంతకుడు దగ్గర్నుంచే కాల్చి చంపాడు. వాళ్ళందరి మొహాల మీద తుపాకీ మందు గుర్తులున్నాయని మర్చిపోయావా? అంటే..వరో తెలిసిన వాళ్ళే హేరీని, మిగిలిన ఇద్దర్నీ చంపారు. దగ్గర అంత డబ్బున్న హేరీ కొత్త వాళ్ళని దగ్గరకి రానివ్వడు. అంటే.. ఆ హంతకుల్ని అనుమానించలేదు. బై మోరిస్ గుర్రపు బండిని ముందుకి పోనిచ్చాడు.
అది కొద్దిదూరం వెళ్ళేదాకా ఆలోచనగా ఆగిన శామ్ అతని బండి పక్కన తన గుర్రాన్ని పోనిస్తూ అతని ఉద్దేశం ఏమిటో గ్రహించే లోగానే తన పాయింట్ 45 రివాల్వర్‌ని బయటకి తీసి మోరిస్‌కు గురి పెట్టి అరిచాడు.
ఆపు. నువ్వు ఊహించింది కరెక్ట్ మోరిస్. హేరీని నేను దగ్గర్నించే కాల్చాను శామ్ కంఠంలో అకస్మాత్తుగా ఇదివరకటి మర్యాద మాయమై కఠినంగా మారింది.
అతను ముందుకి వంగి మోరిస్ రివాల్వర్‌ను అందుకున్నాడు. తర్వాత గుర్రం పగ్గాలని అందుకుని దాన్ని ఆపి అడిగాడు డబ్బు బయటి తీయి.
మోరిస్ ఆ ప్రయత్నం చేయకుండా శామ్ వంకే దీర్ఘంగా చూసి చెప్పాడు.
అంటే నువ్వే ఆ దొంగన్న మాట! నాకు ఖచ్చితంగా తెలీలేదు. నేను జో కాని, నువ్వు కాని మీ ఇద్దర్లో ఒకరని అనుకున్నాను ఎలా ఊహించావు?
హేరి తెలిసిన వాళ్ళనే దగ్గరకి రానిస్తాడు. అదీ తను అనుమానించని వాళ్ళని. మీ ఇద్దరూ అనుమానించ తగ్గవాళ్ళు కారు. షెరీఫ్ ముసలివాడు కాబట్టి, అంత దూరం ప్రయాణించలేడు
మాటలాపి డబ్బు బయటకి తీయి శామ్ ఆజ్ఞాపించాడు.
చేతనైతే నువ్వే తీసుకో చెప్పి పక్కన రాతి మీద ఉమ్మాడు.
శామ్ తిట్టుకుంటూ తన గుర్రం దిగాడు. తన రివాల్వర్‌ను మోరిస్‌కు గురి పెట్టి బండంతా వెదికాడు. ముప్పావు గంట తర్వాత అలసటతో వెతకడం ఆపాడు. బండిలోని పిండి సంచీలను చింపి అందులో డబ్బుకోసం వెదికాడు. బండిలోని వస్తువులు అన్నిటినీ బయట రాళ్ళమీద చెల్లాచెదురుగా పడేసాడు. కాఫీ గింజల సంచీని చింపి అవన్నీ కింద కుమ్మరించి వెదికాడు. బండిలోని ప్రతీ అంగుళాన్ని వెదికాక నిస్పృహగా గుర్రం ఎక్కి అడిగాడు.
చెప్పు. ఆ డబ్బు ఎక్కడ దాచావు? మోరిస్ అతని చర్యలని ప్రశాంతంగా నవ్వుతూ గమనించాడు తప్ప, పెదవి విప్పలేదు.
కాల్చు. కానీ, నీకా డబ్బు ఛస్తే కనపడదు. చెప్పాగా, వారం వెదికినా నీకు కనపడదని శామ్ పళ్ళు పటపట కొరికాడు.

చెప్పవా? నిన్ను నీ రివాల్వర్‌తోనే చంపేస్తాను
నాకు తెలుసు నీది ఉపయోగిస్తే అది అందరికీ తెలుస్తుందని
శామ్.. మోరిస్ తుపాకీని అతని ఛాతీకి ఆనించాడు. ఐనా, ఆయన నోరు మెదపక పోవడంతో చెప్పాడు-
నిన్ను రెండు రివాల్వర్స్‌తో కాలిస్తే కానీ నా కోపం చల్లారదు
శామ్ చేతిలోని ఆ రివాల్వర్ పేలగానే అక్కడ దట్టంగా పొగ అలుముకుంది. తక్షణం శామ్ పెద్దగా కేక పెట్టాడు. గుండు రివాల్వర్ గొట్టం లోంచి బయటికి వచ్చే బదులు వెనక భాగాన్ని పేల్చేసింది. అతని కుడి అరచేతి వేళ్ళు తెగి కిందపడి, రక్తం ధారగా కారసాగింది. ఆ శబ్దానికి అతని గుర్రం కదిలి దానిమీంచి కింద పడ్డాడు.
వెంటనే మోరిస్ రక్తం కారే చేతిలోంచి కాక శామ్ రెండో చేతిలోంచి జారి కిందపడ్డ రివాల్వర్‌ను అందుకున్నాడు. ఆయనలో ఎలాంటి భావోద్వేగాలు కలగలేదు.
కావాలంటే నా బండిలో వేసి తీసుకెళ్ళి నేను నీ ప్రాణాల్ని కాపాడగలను. కానీ, రక్తం కారి నువ్వు మరణించడానికి నిన్ను ఇక్కడే వదిలి వెళ్తున్నాను
నన్ను తీసుకెళ్ళు శామ్ కోరాడు.
ఊహు. నా పగ చల్లారడానికే నా పాత రివాల్వర్లో గుండు రివాల్వర్ గొట్టంలోంచి కాకుండా, కేవలం వెనకవైపు పేలేలా ఏర్పాటు చేశాను. డబ్బివ్వకపోతే నీకు కోపం వస్తుందని నాకు తెలుసు
నీకు డబ్బిస్తాను. చాలా డబ్బిస్తాను. నన్ను కాపాడు శామ్ అర్థించాడు.
సారీ. అది తప్ప ఇంకేమైనా చేయగలను
అతని చుట్టూ నేలమీద రక్తం మడుగు కట్టసాగింది. శామ్‌తోసహా కౌంటీలోని అందరికీ మోరిస్ కఠినమైన మనిషని తెలుసు.
మోరిస్ తన పాత రివాల్వర్ గొట్టంలో దాచిన డబ్బు చుట్టని తీసుకుని, గుర్రబ్బండి ఎక్కి గుర్రాన్ని అదిలించాడు. అది తూర్పువైపు సాగింది.
(రాబర్ట్ ఆర్ధర్ కథకి స్వేచ్ఛానువాదం)

- మల్లాది వెంకట కృష్ణమూర్తి

621
Tags

More News

VIRAL NEWS