సమ్‌థింగ్ పర్సనల్..


Sun,June 16, 2019 12:47 AM

ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత స్మార్ట్ ప్రపంచంలో ఉన్నా గడియారం అవసరం రాకుండా ఉండదు. దాని వాడకం తగ్గినా, దానికుండే ప్రాధాన్యం మాత్రం తగ్గదు. గడియారాల ఉత్పత్తిలో విస్తృత మార్పులను, పెరుగుదలను ప్రపంచానికి తెలియజేయడానికి జూన్ 19న వాచ్ డే జరుపుతాయి కంపెనీలు.
wathch
గడియారాలు వాడడం కేవలం సమయం తెలుసుకోవడం కోసమే కాదు. ఇది చేతికి లుక్ ఇచ్చే ఐకానిక్ బ్రాండ్. ఈ గడియారాలకు సుమారు 600 యేండ్ల చరిత్ర ఉంది. అప్పటి నుంచే వీటిని స్టేటస్ సింబల్‌గా, హుందాతనానికి గుర్తింపుగా వాడకంలో ఉన్నాయి. ఎవరి అభిరుచికి తగ్గట్టు వారు గడియారాలను వాడుతారు. తర్వాత అది ఒక కల్చర్‌గా మారి కొనసాగుతున్నది. ఇలా ఒక తరం నుంచి ఇంకో తరానికి గడియారాల వినియోగం పెరుగుతూనే వచ్చింది. ఎంత స్మార్ట్‌ఫోన్లు వచ్చినా వాటితో పాటే స్మార్ట్ వాచ్‌లూ వస్తున్నాయి. వాచ్‌ల ఉత్పత్తిలో అభివృద్ధిని, వీటిని తర్వాతి తరానికి అందించడానికి నాస్టర్‌డామ్ అనే గడియారాల పరిశ్రమ వాచ్‌ల పరిశ్రమ దీనికి నాంది పలికింది. గడియారాల చరిత్రను, వాటి తయారీని, డిజైనింగ్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి జూన్ 19న వాచ్ డే ను నిర్వహించింది. అది క్రమంగా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది.
ఆరు వందల యేండ్ల చరిత్ర కలిగిన గడియారాలు కాలానికి అనుగుణంగా మార్పులు చెందుతూ అందుబాటులోకి వచ్చాయి. మొదట సన్‌డయల్‌తో మొదలైన గడియారం జనరేషన్లను బట్టి మారాయి. మెకానికల్ వాచ్, స్విస్ వాచ్, ఎలక్ట్రానిక్ వాచ్, బెల్డ్ వాచ్, రిస్ట్ వాచ్, డిజిటల్ వాచ్, డిజిటల్ అనలాగ్ వాచ్, స్మార్ట్ వాచ్ ఇట్లా అప్‌డేట్ అవుతూ వచ్చాయి..

Watech
1275 మొదటి సారిగా మెకానికల్ గడియారం రూపొందింది. ఇంగ్లాండ్ దీన్ని మొదటిసారి ఉపయోగించింది.
1504-1508 పీటర్ హెన్‌లైన్ మొదటిసారి పాకెట్ వాచ్‌ను కనుగొన్నాడు.
1541 స్విస్ వాచ్ పరిశ్రమ స్థాపించారు. జాన్ కెల్విన్ అనే వ్యక్తి ప్రజలు ధరిస్తున్న జువెలరీని చూసి వాచ్ మేకింగ్‌లో మార్పులు తెచ్చారు. స్విట్జర్లాండ్‌లో ప్రముఖ వాచ్‌లు పేరు సంపాదించాయి.
1657 బ్రిటీష్ భౌతిక శాస్త్రవేత రాబర్ట్ హుక్, డచ్ శాస్త్రవేత్త క్రిస్టియన్ హైజెన్స్ ఇద్దరూ బ్యాలెన్స్ స్ప్రింగ్ వాచ్‌ను కనిపెట్టారు.
1812 బ్రెగట్ అనే వ్యక్తి ఆస్ట్రియా రాణి అయిన మారియా కరోలినా కోసం చేతికి ధరించే వాచీని తయారు చేశాడు. ఇదే మొదటి రిస్ట్ వాచ్.
1868 అప్పటి వరకూ ఉన్న రిస్ట్ వాచ్‌లో మార్పులు చేసి అందులో శాశ్వత కాలెండర్‌ను ఏర్పాటు చేసింది పాటెక్ పిలిప్ అండ్ కో అనే స్విట్జర్లాండ్ కంపెనీ.
1914-1918 ఈ కాలంలో రిస్ట్ వాచ్‌లను సైనికులు ధరించడం ప్రారంభించారు. వాటిని ట్రెంచ్ వాచ్‌లు అనేవారు.
1930 లో బ్రీటింగ్ అనే కంపెనీ మొదటిసారి స్టాప్ వాచ్‌ను సృష్టించింది.
1962 రాడో వాచ్ మొదటి సారిగా స్క్రాచ్ ఫ్రూవ్ (గీతలు పడని) గడియారంగా గుర్తింపు పొందింది. హార్డ్‌మెటల్‌తో దీన్ని తయారు చేశారు.
1969లో క్వార్ట్స్ వాచ్ వచ్చింది.
Watch!
1979 డెలెర్జియమ్ అనే వ్యక్తి మొదటిసారి ప్రపంచంలోనే అతి సన్నటి వాచ్‌ను తయారు చేశాడు. అది 1.98 మిల్లీమీటర్లు ఉంటుంది.
1983 స్వాచ్ కంపెనీ మొదటిసారి ప్లాస్టిక్‌తో తయారుచేసిన వాచ్‌లను మార్కెట్‌లోకి తెచ్చింది. అప్పటి నుంచే ఫ్యాషన్ రంగంలో ప్లాస్టిక్ వాచ్‌ల హవా ప్రారంభమైంది.
1999 వాచ్‌లో చాలా మార్పులొచ్చాయి. రకరకాల మెటీరియల్లో వాచ్‌లు తయారయ్యాయి. టైటానియమ్, కార్బన్ ఫైబర్ లోహంతో వాచ్‌ల ఉత్పత్తి ప్రారంభమైంది.
2000-10 ఉలిస్సే నార్డిన్, పేటెక్ పిలిప్ కంపెనీలు హై టెక్నాలజీ మెటీరియల్స్‌ను వాడడం ప్రారంభించాయి. సిలికాన్, సెరామిక్ వాడి వాచ్‌లను మార్కెట్‌లోకి విడుదల చేశాయి.
పూర్వం సమయాన్ని తెలుసుకోవడానికి సన్‌డయల్‌ను ఉపయోగించేవారు. సూర్యుని నీడ ఆధారంగా సమయం గుర్తించేవారు.

392
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles