బావి నీటికి, కవలలకు లింకేంటి?

Sun,June 16, 2019 12:37 AM

తూర్పుగోదావరి జిల్లాలో అదెక్కడో మారుమూల పల్లె. ఆ ఊరి చివర్లో పచ్చని పంట పొలాల మధ్య ఒక బావి. ఆ బావి నీరు.. హైదరాబాద్, గుంటూరు, విశాఖ పట్టణాలకు రాత్రికి రాత్రే తరలిపోతున్నది. ఈ తంతు ఎవ్వరికీ తెలియని వ్యాపారంగానూ మారింది. అంతేకాదండోయ్.. కొత్తగా పెండ్లయిన జంటలు, పిల్లలు లేని దంపతులు, కవల పిల్లలే కావాలనుకునే మొగుడూ పెళ్లాలు ఆ ఊరిలోనే ఆర్నెల్లపాటు తిష్టవేస్తున్నారు. ఆ బావి నీటినే రోజూ తాగుతున్నారు. ఏమిటీ ఆ నీళ్ల ప్రత్యేకత? ఏంటా వాటర్ మిస్టరీ?

Twins-Baavi
ఎహే.. ఇదంతా అబద్ధం అని మాత్రం కొట్టిపారేయకండి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా పుట్టని పిల్లలు.. బావిలో నీళ్లు తాగితే పుడతారా? అని తీసిపారేయకండి. గ్రహాల మీద ఇండ్లు ఎలా కడితే బాగుంటుందోనని ఆలోచించే ఈ రోజుల్లో కూడా.. ఈ మూఢనమ్మకాలు ఏంటి బాస్ అని చిన్నచూపు చూడకండి. ఎందుకంటే అక్కడేదో మిస్టరీ ఉంది. ఆ బావి తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట పంచాయతీలో ఉన్నది. మండల కేంద్రమైన రంగంపేట నుంచి దొడ్డిగుంటకు 6 కిలోమీటర్లు. సమీప పట్టణమైన పెద్దాపురం నుంచి 21 కిలోమీటర్లు. ప్రస్తుతం ఈ గ్రామంలో దాదాపు 4 వేలకుపైగా జనాభా ఉన్నారు. ఈ ఊరంతా పచ్చని పొలాలతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. వ్యవసాయ సీజన్ వస్తే చాలు ఊరంతా పచ్చని అందాలే. అయితే ఈ గ్రామంలో ఉన్న ఓ బావి ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కారణం.. ఆ బావిలో నీళ్లు తాగితే కవలలు జన్మిస్తారని విశ్వాసం.

Twins-BaaviF

110 మందికిపైగా కవలలు!

దొడ్డిగుంట గ్రామంలో ఇప్పటి వరకూ 110 మందికి పైగా కవలలు పుట్టారు. పుడుతూనే ఉన్నారు. ఇక్కడికి కొత్తగా ఎవరొచ్చినా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఈ ఊర్లో దాదాపు ప్రతి వీధిలో నలుగురైదుగురు కవలలున్న ఇండ్లు కనిపిస్తాయి. ఒకే ముఖంతో ఉండే ఇద్దరు కనిపిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలకెళ్తే ఆశ్చర్యపోవాల్సిందే. అక్కడ ప్రతి తరగతిలో కనీసం రెండు, మూడు జంటలు కవల పిల్లలే ఉంటారు. తరగతుల్లో ఒకేలా ఉండే ఇద్దరేసి వీరికి తారసపడడం, వీరిలో ఎవరెవరో పోల్చడం ఉపాధ్యాయులకూ పెద్ద పరీక్షే. కవలలు జన్మిస్తే ఎవరైనా గొప్పగా, విచిత్రంగా చెప్పుకొంటారు. దొడ్డిగుంటలో మాత్రం ఇది సాధారణమైన అంశం. కొన్నేళ్ల క్రితం ఈ గ్రామానికి బండి శ్రీనివాసమూర్తి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు బదిలీపై రాగా తరగతిలో కవలలు ఉండటాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఓ ప్రభుత్వ సర్వే కోసం ఇంటింటికీ తిరిగినపుడు అత్యధికంగా కవలలు కనిపించడంతో మరింత ఆశ్చర్యం కలిగింది. విచిత్రమేమిటంటే ఏడాదిన్నర తర్వాత ఆ ఉపాధ్యాయుడు బండి శ్రీనివాసమూర్తికి కూడా కవలలు జన్మించారు.

బావి నీరే కారణమా?

దొడ్డిగుంట పంచాయతీ పరిధిలో చినదొడ్డిగుంట, పెద్దదొడ్డిగుంట గ్రామాలు ఉండగా వాటి మధ్యలో చెరువు, దాని గట్టుపైన బావి ఉన్నాయి. ఈ రెండు గ్రామాల ప్రజలు ఈ బావి నీటినే తాగుతారు. ఈ బావి నీరు తాగిన వారికి కవలలు జన్మిస్తున్నారని ఇక్కడి ప్రజలు నమ్ముతున్నారు. అయితే గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతున్నది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతున్నది. అయినా గ్రామస్తులు ఎక్కువగా ఈ బావి నీటినే తాగేందుకు మక్కువ చూపుతున్నారు. ఇక కొత్తగా పెండ్లి అయిన జంటలకు ఈ నీరు ప్రత్యేకంగా తాగిపిస్తారు. ఏడాది పాటు ఆ బావి నీటినే వాడుతుంటారు. సంతానం లేని దంపతులు దొడ్డిగుంట పయనమవుతున్నారు. ఆర్నెల్లపాటు ఈ ఊరిలోనే ఉంటూ ఈ బావి నీటినే తాగుతూ, పిల్లలు కలుగగానే వెళ్లిపోతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.

బావి నీటిలో ఏదో మిస్టరీ!

ఈ బావి నీటిని తాగి, కవలలను కన్న దంపతులు.. ఇది మూఢ నమ్మకం కాదు. ఇందులో ఏదో అతీత శక్తి ఉన్నది అంటున్నారు. ఈ విషయం చాలా సందర్భాల్లో నిరూపితమైంది కూడా. దీంతో ఈ బావి నీటిపై పరిశోధన చెయ్యాలని భూగర్భ జలవనరుల శాఖ ముందుకొచ్చింది. ఈ బావిలోని నీటి శాంపిల్స్ వైజాగ్, హైదరాబాద్‌లోని ప్రయోగశాలలకు పంపించింది. దీనిపై ఇంకా కచ్చితమైన ఫలితాలు రాలేదు. పైపై పరిశోధనలు కాకుండా.. లోతుగా అధ్యయనం చేస్తే ఏవైనా కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని స్థానికులంటున్నారు.
Twins1

బావి నీటితో వ్యాపారం

దొడ్డిగుంట బావిలోని నీరు తాగితే.. కవలలు పుడుతున్నారని ప్రచారం జరుగుతుండడంతో, నీటి వ్యాపారం జోరందుకున్నది. ఈ బావిలో నీటిని వాటర్ క్యాన్‌లు, డ్రమ్ముల్లో తోడుకొని పలు నగరాలకు పంపుతున్నారు. హైదరాబాద్, గుంటూరు, వైజాగ్ వంటి ప్రాంతాలకు ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా నీటిని తరలిస్తున్నారు. ఈ నీటిని అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. సంతానంలేని దంపతులు ఈ నీటిని వినియోగించడం మొదలుపెట్టారు. మొత్తానికి ఈ బావి నీటిపై విస్తృత పరిశోధనలు జరిగితేనే మిస్టరీ వీడుతుందని అంటున్నారు దొడ్డిగుంట గ్రామస్తులు.
-డప్పు రవి, సెల్: 9951243487

348
Tags

More News

VIRAL NEWS