పనులు - ఫలితాలుఒ


Sun,June 16, 2019 12:34 AM

కనగరానికి సమీపంలోని అడవి దగ్గర ఒక సన్యాసి ఆశ్రమం కట్టుకొని నివసించేవాడు. ఆయన మహిమ గలవాడు. భూత భవిష్యత్ వర్తమానముల గురించి చెప్పగలిగిన శక్తిశాలి. ఆ ప్రతిభ ఆయనకు సహజంగా వచ్చింది. ఆయన కీర్తి దశదిశలా విస్తరించింది. ఎవరికైనా వాళ్ళ భవిష్యత్తు తెలుసుకోవాలని ఉత్సాహంగానే ఉంటుంది. అందుకని ఆయన దగ్గరకు అసంఖ్యాకంగా జనం తండోపతండాలుగా వచ్చేవాళ్లు. జనాల భవిష్యత్తు చెప్పడం వల్ల ఆయనకు ఎన్నో సమస్యలు ఎదురుకావడం మొదలయ్యాయి. సన్యాసికి ధ్యానానికి వీలు చిక్కడం లేదు. జనాల నుంచి తప్పించుకోవడానికి ఆయన అడవిలో చాలా లోపలికి వెళ్ళి ఆశ్రమం కట్టుకున్నాడు. కొంతమంది శిష్యులు ఆయనతో పాటు ఉండేవాళ్లు. జనం ఆయనకోసం గాలించి ఆయన ఉనికిని కనుక్కోలేక ప్రయత్నం మానుకున్నారు. ఇట్లా కొన్నేళ్ళపాటు సన్యాసికి ఏకాంతం, ప్రశాంతం దొరికాయి.
Panullu-falithaalu
ఒకరోజు విశాలుడు, విజయుడు అనే మిత్రులు అడవి మార్గం గుండా వెళుతూ దారి తప్పిపోయారు. చీకటి పడింది. జంతుభయంతో వాళ్ళకు ప్రాణభీతి పట్టుకుంది. దేవుడి మీద భారం వేసి ఆ చీకటిలోనే అడవిలో తడుముకుంటూ ముందుకు సాగారు.
దూరంగా ఏదో దీపకాంతి కనిపించడంతో వాళ్ళకు ప్రాణం లేచి వచ్చింది. ఆ కాంతి కనిపించిన దిక్కుకేసి సాగారు. మంచి గంథం వాసన, తులసి వనం నుండి వీచిన గాలి వాళ్ళకు తగిలి ప్రాణం లేచి వచ్చింది. వాళ్ళు ఒక ఆశ్రమం సమీపించారు. ఆశ్రమంలో అడుగుపెట్టారు. ఒక దీపం వెలుగులో నిశ్చలంగా కూర్చొన్న సన్యాసి ధ్యానంలో లీనమై కనిపించాడు. ఆ సన్యాసిని ఆ మిత్రులు గుర్తుపట్టారు. భవిష్యత్తు చెప్పే ప్రసిద్ధులైన సన్యాసి అతనే అని తెలుసుకున్నారు. కాసేపటికి సన్యాసి కళ్ళు తెరచి వాళ్ళను చూశాడు. మిత్రులు నమస్కరించారు.సన్యాసి విషయమడిగాడు. మిత్రులు దారితప్పిన వైనం చెప్పారు. సన్యాసి స్నానం చేసి విశ్రాంతి తీసుకోండి. కాసేపటికి నా శిష్యులు వస్తారు. మీ భోజనాదికాలు చూస్తారు అన్నాడు. మిత్రులు స్నానం చేసి ప్రశాంతంగా భోంచేసి విశ్రాంతి తీసుకున్నారు. ఉదయాన్నే శిష్యులని తోడు పంపి దారి చూపమన్నాడు. మిత్రులు స్వామీ! దయచేసి మా భవిష్యత్తు చెప్పండి అన్నారు. సన్యాసి నేనా పని మానేశాను అన్నాడు. మిత్రులు బలవంతపెట్టారు. సన్యాసి సంవత్సరం తర్వాత విశాలుడు మహారాజవుతాడు, అతని చేతుల్లో విజయుడు మరణిస్తాడు అన్నాడు.

మిత్రులు బయల్దేరారు. విశాలుని ఉత్సాహం కట్టలు తెంచుకుంది. విజయుని ముఖం దైన్యంగా తయారైంది. గ్రామం చేరాకా విశాలుడు అహంకరించి సన్యాసి తన భవిష్యత్తు గురించి చెప్పిన విషయాన్ని అందరికీ చాటింపు వేశాడు. ఎవర్నీ లెక్క పెట్టడం మానేశాడు. నోటికి వచ్చినట్లు అందర్నీ దూషించేవాడు. ఏమైనా తిరిగి అందామనుకుంటే రేపు ఇతను రాజయితే తమకు ముప్పు వస్తుందని జనం భయపడ్డారు. అందుకు కిక్కురు మనకుండా అతని మాటలు పడేవాళ్ళు.
విశాలుడు అందరిముందూ విజయుణ్ణి కూడా తక్కువ చేసేవాడు. అతని జీవితం తన చేతుల్లో ఉన్నట్లు అధికారం చెలాయించేవాడు. విజయుడు దుఃఖంతో మౌనంగా భరించేవాడు.
క్రమంగా విజయుడిలో దైవభక్తి పెరిగింది. ఆత్మ సమర్పణ భావంతో దైవాన్ని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అందరికీ తన చేతనయినంత సాయం చేస్తూ జనాల తలలో నాలుకలా మెలిగేవాడు. అందరూ అతన్ని ఆత్మీయుడిగా భావించారు. క్రమంగా విజయుడిలో సన్యాసి చెప్పిన భవిష్యత్తు సంగతి మరుగున పడింది. ఎంతో ఉత్సాహంతో పనులు చేస్తూ కాలం గడిపాడు.
సన్యాసి చెప్పిన సంవత్సరంలో పదకొండు నెలలు గడిచిపోయాయి. ఇక కేవలం నెలరోజులుంది.

విజయుడు అతన్ని పట్టుకున్నాడు. కలియబడ్డారు. విజయుడి బలానికి దొంగ తాళలేక పోయాడు. కానీ విజయుడి చేతిని కత్తితో గాయపరిచి పారిపోయాడు. మిత్రుడి సాయానికి విశాలుడు కృతజ్ఞత చెప్పి సగం నాణేలు తీసుకోమన్నాడు. రేపో ఎల్లుండో పోయేవాడిని నాకెందుకు? అన్నాడు విజయుడు. తనకు దొరికిన బంగారు నాణేల్ని నెలరోజుల్లో ఖర్చు పెట్టి చేతులు ఖాళీ చేసుకున్నాడు విశాలుడు. నెల గడిచింది.

ఒకరోజు విశాలుడు విజయుడితో కలిసి ఊరి పొలిమేరలో వెళుతూ ఉంటే కాలికేదో తగిలి తొట్రుపడ్డాడు. చూస్తే అది భూమిలో పాతిపెట్టిన ఒక నిధి. బయటికి తీస్తే ఒక కుండ నిండుగా బంగారు నాణేలు! తన రాజ వైభోగం అప్పుడే మొదలయిందని విశాలుడు భావించాడు. గర్వంగా విజయున్ని చూసి నీకు మూడింది అని వికటంగా నవ్వాడు. అంతలో ఒక దొంగ ఎక్కడి నుంచి వచ్చాడో ఆ బంగారు నాణేల కుండ పట్టుకొని పరుగుతీశాడు. విజయుడు అతన్ని పట్టుకున్నాడు. కలియబడ్డారు. విజయుడి బలానికి దొంగ తాళలేక పోయాడు. కానీ విజయుడి చేతిని కత్తితో గాయపరిచి పారిపోయాడు. మిత్రుడి సాయానికి విశాలుడు కృతజ్ఞత చెప్పి సగం నాణేలు తీసుకోమన్నాడు. రేపో ఎల్లుండో పోయేవాడిని నాకెందుకు? అన్నాడు విజయుడు.
తనకు దొరికిన బంగారు నాణేల్ని నెలరోజుల్లో ఖర్చు పెట్టి చేతులు ఖాళీ చేసుకున్నాడు విశాలుడు. నెల గడిచింది. విశాలుడు రాజు కాలేదు. విజయుడు చనిపోలేదు.
ఇద్దరూ సన్యాసిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళారు. అప్పటికే సన్యాసి తన బస మరో చోటికి మార్చాడు. అయినా కనుక్కొని సన్యాసిని మీ వచనం తప్పయింది. ఎందుకని? అని విశాలుడు అడిగాడు.
సన్యాసి యద్భావం తద్భవతి అన్నారు. నీ అహంకారంతో అందివచ్చే రాజ్యాన్ని దూరం చేసుకున్నావు. అది కేవలం బంగారు నాణేల కుండగా నీకు దక్కింది. మృత్యువు రావాల్సిన వ్యక్తి తన మంచి తనంతో కేవలం గాయం తగిలి మాత్రమే బయటపడ్డాడు. భవిష్యత్తు తెలిసినంత మాత్రాన మన చర్యల ద్వారా, మన మంచితనం ద్వారా, చెడ్డతనం ద్వారా దాన్ని మార్చుకోవచ్చు అన్నాడు.
సన్యాసి ఔన్నత్యానికి మిత్రులు సాగిలబడ్డారు.

- సౌభాగ్య

278
Tags

More News

VIRAL NEWS