రాశి ఫలాలు


Sat,June 15, 2019 11:57 PM

16-6-2019 నుంచి 22-6-2019 వరకు
rasi-phalalu

మేషం

ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో మంచి పేరు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. భూములు, నిర్మాణ రంగంలో ఉన్న సమస్యలు యథావిధిగా ఉన్నా కొంత పురోగతి ఉంటుంది. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. నిత్యం వ్యాపారంలో ఇబ్బందులుంటాయి. చేతిలో డబ్బు లేకపోవడం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

వృషభం

ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. కొత్త వస్తువులు, ఆభరణాలు కొంటారు. విందులు, వినోదాలకు ప్రాధాన్యమిస్తారు. పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఉన్నతవిద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచిపేరు పొందుతారు. చాలా పనులలో అనుకూలత ఉంటుంది. వ్యాపారం అనుకూలిస్తుంది. ఉద్యోగులకు ఆఫీసులో మనస్పర్థలు ఏర్పడవచ్చు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అన్నదమ్ములు, స్నేహితులతో మనస్పర్థలుంటాయి. వాహనాల వల్ల ఖర్చులుంటాయి. పెద్దవారి సహాయ సహకారాలు తప్పకుండా తీసుకోవాలి.

మిథునం

ప్రధాన గ్రహాలస్థితి ప్రతికూలంగా ఉంది. కాబట్టి నిర్ణయాలలో జాగ్రత్త, విజ్ఞత అవసరం. తోటి ఉద్యోగులతో అనవసర వాగ్వివాదాలు, పై అధికారులతో మనస్పర్థలు గోచరిస్తున్నాయి. పనులు సకాలంలో పూర్తికాకపోవచ్చు. కిందిస్థాయి వారితో కలహాలుండొచ్చు. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవచ్చు. అనవసరమైన విషయాలను పదే పదే ఆలోచించకూడదు. పెద్దల సలహాలు, సూచనలు పాటించాలి. వాహనాల వల్ల వృథా ఖర్చులుంటాయి. నిత్య వ్యాపారంలో అవకతవకలు గోచరిస్తున్నాయి.

కర్కాటకం

పనులు సకాలంలో పూర్తవుతాయి. మంచివారితో స్నేహ సంబంధాలు పెంచుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దేవతా గురుభక్తి, ఆదాయం పెరుగుతుంది. సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. పనివారితో అనుకూలత ఉంటుంది. డబ్బు సకాలంలో అందుతుంది. తల్లిదండ్రులు, పెద్దల సూచనలు పాటించడంతో అనేక విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు. తీర్థయాత్రలు, నదీస్నానాలు ఆచరిస్తారు. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వస్త్ర, వస్తువులను, ఆభరణాలను కొంటారు. అన్నదమ్ములు, బంధువులతో మనస్పర్థలు యథాతథంగా ఉంటాయి. వాహనాల వల్ల ఇబ్బందులు.

సింహం

రాజకీయ, కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆఫీసులో అందరి సహాయ సహకారాలు పొందుతారు. ముఖ్యంగా అధికారుల ఆదరణతో పనులు ముందుకు సాగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములతో మంచి మాట ఉంటుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. న్యాయపరమైన సమస్యల నుంచి విముక్తులవుతారు. వృత్తి పనులు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆలోచన అవసరం.

కన్య

గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఓపికతో నిర్ణయాలు తీసుకోవడం అవసరం. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. పనివారితో ఇబ్బందులు ఉంటాయి. న్యాయవాద, ఇంజినీరింగ్, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. పనులు పూర్తికాక ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. పెద్దల సహాయ సహకారాలను పాటించకపోవడంతో సమస్యలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. డబ్బు సమయానికి అందకపోవచ్చు. వాహనాల వల్ల ఖర్చులుంటాయి.

తుల

గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. సమయస్ఫూర్తితో పనులు చేయడం వల్ల కలిసివస్తుంది. ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. ఉద్యోగ ప్రయత్నాలు కొంతమేర ఫలిస్తాయి. ఆఫీసులో మంచి పేరును సంపాదిస్తారు. రాజకీయంలో ఉన్నవారు నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి వారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనులలో వేగం ఉంటుంది. తల్లిదండ్రుల సహాయ సహకారాలు అందుతాయి.

వృశ్చికం

గ్రహస్థితిప్రతికూలంగా ఉంది. జాగ్రత్త గా ఉండాలి. నిర్ణయాలలో తొందర పడకూడదు. అనవసరమైన గొడవలు, వాదోపవాదాలు ఉంటాయి. హోటల్, క్యాటరింగ్, వస్త్ర, ఫ్యాన్సీ, సినిమా, సాహిత్య, పత్రికా రంగాలలో ఉన్న వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. పనివారితో కలహాలుంటాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాహనాల వల్ల ఖర్చులుంటాయి. అన్నదమ్ములు, బంధువులతో కలహాలు ఏర్పడవచ్చు. ఆస్తుల విషయంలో తగాదాలు ఏర్పడతాయి. నిర్మాణ రంగంలోని వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.

ధనుస్సు

గ్రహాలన్నీ ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఓపిక, విజ్ఞత చాలా అవసరం. భక్తి భావనలు పెంచుకోవడం మంచిది. ఖర్చులను నియంత్రించు కోవాలి. అనుభవజ్ఞులు, పెద్దల సూచనలను పాటించాలి. క్రయవిక్రయాలలో నష్టాలు ఉండొచ్చు. న్యాయవాద, ఇంజినీరింగ్ వృత్తులలో ఉన్న వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అధికారులతో మనస్పర్థలు ఏర్పడతాయి. కింది స్థాయి ఉద్యోగులతో కలహా సూచనలునాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నదమ్ములు, బంధువులతో అనవసర వాగ్వివాదాలు తలెత్తవచ్చు.

మకరం

భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. వస్త్ర, వస్తువులను కొంటారు. హోటల్, క్యాటరింగ్, నిత్యావసర వస్తు, షేర్, వడ్డీ వ్యాపారాలలోని వారు లాభాలను గడిస్తారు. న్యాయవాద, ఉపాధ్యాయ, ఇంజినీరింగ్ వృత్తులలో ఉన్న వారు సంతృప్తిగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్నవారు కొంత ఆర్థిక పరమైన సమస్యలు ఎదురైనా పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు.

కుంభం

ఆదాయం పెరుగడంతో ఆర్థిక సమస్యలు తీరుతాయి. అనారోగ్యం నయమవుతుంది. పెద్దల సహాయ సహకారాలు సమయానికి అందుతాయి. తీర్థయాత్రలు, నదీస్నానాలను ఆచరిస్తారు. భార్యా పిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. వస్త్ర, వస్తువులను కొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలోని వారికి కొత్త అవకాశాలు వస్తాయి. నిత్యం వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ముందుకు సాగవు.

మీనం

ఈ వారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. న్యాయవాద, వైద్య, ఉపాధ్యాయ వృత్తులలో ఉన్నవారు సంతృప్తిగా ఉంటారు. నిత్యావసర వస్తు వ్యాపారం, షేర్, వడ్డీ, హోటల్, క్యాటరింగ్, వస్త్ర, సుగంధ ద్రవ్యాల వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు. మంచి వారి సహచర్యం వల్ల చాలా పనులు నెరవేరుతాయి.ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
rasi-phalalu1
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : [email protected]

1148
Tags

More News

VIRAL NEWS