కలం చిరకాలం..


Sun,June 9, 2019 01:48 AM

pen
అందమైన చేతి రాత వ్యక్తిత్వ గౌరవాన్ని పెంచుతుంది. పది మందిలో ప్రత్యేకతనూ తెచ్చిపెడుతుంది. ప్రశంసలనూ కురిపిస్తుంది. ఇట్లాంటి ముత్యాల్లాంటి చేతిరాతను ఇచ్చే పెన్నులు ఎన్నో ఉన్నాయి. కానీ బాల్‌పాయింట్ పెన్ను ప్రత్యేకతే వేరు. జూన్10న బాల్‌పాయింట్ పెన్ డే సందర్భంగా దాని విశేషాలు చదవండి.

ప్రపంచంలో అతి చౌకైన పెన్ను ఏదీ అంటే బాల్‌పాయింట్ పెన్ను. మరి ఖరీదైంది ఏంటీ అంటే అదీ బాల్‌పాయింట్ పెన్నే. అవును ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉన్న పెన్ను ఇది. ఇది చాలామందికి తెలిసే ఉన్నా దాని తయారీ వెనుక కృషి మాత్రం ఎక్కువ మందికి తెలియదు. అయితే దశాబ్దాల కిందట కాగితాల మీద రాయడానికి రకరకాల పద్ధతులను అనుసరించేవారు. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. సిరా రెండువైపులా కనబడడం, రాసిన కొద్దిసేపటి వరకూ ఆరకపోవడం, అక్షరాలు తుడిచి పెట్టుకొనిపోవడం జరిగేది. ఇలాంటి సమయంలోనే బాల్‌పాయింట్ పెన్ను రూపుదిద్దుకుంది. దాని తయారి ఒక సంచలనమైంది.

ఎలా పుట్టింది..

రాత పరికరాలు సమారు ఆరువేల ఏండ్ల కిందటి నుంచే వాడకంలో ఉన్నాయి. రోజులు గడిచే కొద్ది వాటిలో చాలా మార్పులు వచ్చాయి. కానీ, రాసేటప్పుడు అనుకోని పరిస్థితులు ఎదురయ్యేవి. 1940 కాలంలో పెన్నులు మెకానికల్ డిజైనింగ్‌లో విఫలం అయ్యాయి. దీన్ని గమనించిన లాజ్‌లో బీరో అనే వ్యక్తి ఈ కొత్తరకమైన పెన్నుకు రూపకల్పన చేశాడు. రసాయన శాస్త్ర నిపుణుడైన అతని సోదరుడు గైర్గీతో కలిసి సిరాలో మార్పులు చేశాడు. అనూహ్య మార్పుల తర్వాత సిరా పద్ధతి ప్రకారం బాల్ చుట్టూ తిరిగి కాగితంపైకి వచ్చేది. ఇలా సున్నితంగా రాయడానికి ఈ పెన్ను ఉపయోగపడింది. పెన్ను మొనలో బాల్ అమర్చి ఉండడం వల్ల దానికి బాల్‌పాయింట్ పెన్ను అన్నారు. ఈ పెన్నుపై 1943 జూన్ 10న ఈ ఇద్దరూ పేటెంట్ హక్కులు సంపాదించారు. అప్పటి నుంచి ఈ పెన్నుల ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. తర్వాత దీనిపై పేటెంట్ హక్కుల కోసం ఎంతో మంది ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఎన్నో వివాదాలు వచ్చాయి. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో ఈ పెన్నులను వాడతారు. తొలిసారిగా వారి కోసమే 30 వేలకు పైగా పెన్నులను ఉత్పత్తి చేశారు.
pen1
గగన తలంలో విహరించేటప్పుడు ఆకాశంలోని వాతావరణానికి సిరాలో మార్పులు రాకుండా ఉంటుంది. అందుకే పైలెట్లు బాల్‌పాయింట్ పెన్నులను వాడడం ప్రారంభించారు. కాలక్రమేనా సిరా పెన్నుల స్థానంలో బాల్‌పాయింట్ పెన్నుల వాడకం మొదలైంది. ఈ పెన్నును వాడడం చాలా తేలిక. సిరాలాగా ముద్దగా పడకుండా, వాతావరణంలోని మార్పులలాంటివి కూడా రీఫిల్‌పై పడకుండా ఉంటాయి. కిందపడ్డా విరిగిపోవడం లాంటివి ఉండవు. పల్చని కాగితాలపై రెండువైపులా రాసుకో వచ్చు. రాసిన వెంటనే ఆరిపోతుంది. ఈ కారణాలతో బాల్ పాయింట్ పెన్నుల వాడకం ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. ఇట్లా పాపులర్ అవుతున్న కొద్దీ పెన్నులో ఎన్నో మార్పులు చేసుకుంటూ వచ్చారు. రకరకాల మోడళ్లు, సైజుల్లో విస్తరించారు. కేవలం ధనికులే కాకుండా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే బాల్‌పాయింట్ పెన్నులను కంపెనీ ఉత్పత్తి చేసింది.

బాల్‌పాయింట్ పెన్ డే

జూన్ 10న బాల్ పాయింట్ పెన్‌కు పేటెంట్ హక్కులు లభించినందుకు ఏటా ఈ రోజును బాల్‌పాయింట్ పెన్ డేగా నిర్వహిస్తున్నది ఆ కంపెనీ. ప్రత్యేకమైన ఆఫర్లు, కొత్త మోడళ్లను ఈ రోజు పరిచయం చేస్తుంది. పెద్ద పెద్ద పెన్నుల స్టోర్లలో బాల్‌పాయింట్ పెన్నులపై ఆఫర్లు ప్రకటిస్తారు. ఇష్టమైన వారికి ఈ బాల్‌పాయింట్ పెన్నులను బహుమతిగా ఇచ్చేందుకు ఈ రోజు ఉపయోగపడాలని ఆ కంపెనీ చెప్తున్నది. ఈ బాల్‌పాయింట్ పెన్ కొని స్నేహితులకు, బంధువులకు ఉత్తరాలు రాయొచ్చనీ, ఈ పెన్నులను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చని కంపెనీ కాంపెయిన్ చేస్తున్నది. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సెకనుకు 125 బాల్‌పాయింట్ పెన్నులు అమ్ముడుపోతున్నాయి. ద మౌంట్ బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ 840 వజ్రాలను కలిగి ఉంటుంది. ఈ పెన్నుపై 20 కారట్ల జెమ్స్ స్టోన్స్ కనిపిస్తాయి. దాని ధర రూ. 5 కోట్లా 80 వేలు. ప్రపంచంలోని అత్యంత ఖరిదైన పెన్ను ఇదే.

పెన్ను మొనలో బాల్ అమర్చి ఉండడం వల్ల దానిని బాల్‌పాయింట్ పెన్ను అన్నారు. ఈ పెన్నుపై 1943 జూన్ 10న ఈ ఇద్దరూ పేటెంట్ హక్కులు సంపాదించారు. అప్పటి నుంచి ఈ పెన్నుల ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

153
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles