వాస్తు


Sun,June 9, 2019 01:53 AM

VASTHU

ఇంటి చుట్టూ రేకులతో పందిరి వేయవచ్చా?

- రేవర్తి చంద్రమౌళి, గండిపేట

నాలుగు వైపులా వసారా అనేది మన పూర్వ నిర్మాణ గృహాలలో ఉన్నదే. ఇంటిని పిరమిడ్ ఆకారంలో కట్టి ఆ పిరమిడ్ కన్నా కింద నుండి గోడపై అంచునుండి కిందికి వాలుగా వరండా అందంగా పెంకులతో నాలుగు వైపులా దించుకొని నివాసం ఉండడం అనేది మనవాళ్లు విశ్రాంతి నివాసాలుగా నాడు వాడేవారు. అవే నేడు ఫామ్‌హౌజ్‌లుగా మారిపోయాయి. తప్పక అలాంటి నిర్మాణాలు దోషం కావు అయితే ఆ వాలు వరండాలు అన్ని వైపులా సమాన కొలతలతో ఉండాలి. అలాగే ఆ ఇంటిచుట్టూ తప్పక ప్రహరీలు ఉండాలి. ఆ ఇంటి చుట్టూ శాస్త్ర ప్రకారం ఖాళీ వదిలి వాడుకోవాలి. ఆ ఇంటి గర్భ గృహం ఒకే హాలుతో ఉంటుంది. అది చతురస్రంగా కానీ దీర్ఘచతురస్రంగా కాని ఉండవచ్చు. అయితే కిచెన్ మరోచోట కట్టుకోవాలి.

ఉత్తరం రోడ్డు ఆగిన ఇల్లు మాది. అందులో మేము ఉండవచ్చా?

- బి.నిరంజన్‌దాసు, మహబూబాబాద్

మనం ఉండే ఇండ్లు పూర్తిస్థాయి రోడ్లతో ఉండాలి. దారులు ఆగిపోవడం, మలుపులు తరగడం, పోట్లు రావడం చౌరస్తాలు ఇంటి దగ్గరలో ఉండడం మన గృహం మీద తెలియకుండా ఇబ్బందులు కలిగిస్తుంటాయి. మీ గృహానికి ఉత్తరంలో రోడ్డు ఉండి అది తూర్పు వైపు సాగకుండా మీ ఇంటివద్దనే ఆగిపోతే ఆ గృహం అభివృద్ధిలో తేడాలు ఉంటాయి. మీరు ఆ రోడ్డు ముందు, ముందు తూర్పు వైపు సాగుతుంది అని మీకు తెలిసి ఉంటే ఆ గృహంలో ఉండండి లేదా మీరు ఆ గృహాన్ని వెంటనే ఖాళీ చేయండి. అన్ని ఇండ్లు గృహాలు కావు. అన్ని స్థలాలు గృహ నిర్మాణ యోగ్యతను నోచుకోవు. కాబట్టి సరిగ్గా వాస్తు ప్రకారం చూసుకున్నాకే ఇంట్లోకి చేరడం మంచిది.

మాకు తూర్పు ఖాళీ లేదు, పడమర వరండా ఉంది. అలా ఇల్లు ఉండవచ్చా?

- వి.రామస్వామి, గుండాల

ఇంటికి తూర్పు ఖాళీ తప్పనిసరి, అవసరం. అప్పుడే ఆ ఇల్లు ప్రాణంతో ఉన్నట్టు లెక్క. మీ ఇల్లు తూర్పు హద్దులో కట్టి పడమర వైపు వరండా వేశారు అంటే ఇప్పటికే ఇంట్లో సమస్యలు వచ్చి ఉంటాయి. చాలా తొందరగా ఇలాంటి ఇండ్లలోని సభ్యులకు నేత్ర సంబంధ జబ్బులు వస్తుంటాయి. చిన్న వయసులోనే పిల్లలు ఆ ఇండ్లల్లో కళ్లజోళ్లు పెట్టుకొని తిరుగుతుంటారు. తూర్పు కప్పు ఉండడం వల్ల శరీరాలకు సరైన వెంటిలేషన్ అందక పెద్దవాళ్లు దీర్ఘరోగాలకు లోనైపోతుంటారు. సంతానం కావడం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆర్థిక నష్టాలు కూడా ఉంటాయి. మీరు తప్పనిసరిగా ఇంటికి తూర్పు హద్దునకు మూడు అడుగులు సందు వచ్చేలా చేయండి. పడమర వరండా తీసి పడమరలో కూడా కొంత ఖాళీ వదిలి ఇంటిని పెంచండి. ఇవన్నీ చేయడానికి వీలు కానప్పుడు ఆ ఇల్లు వదిలి మరో మంచి ఇంటికి చేరండి. కనీసం పిల్లల జీవితాలకైనా న్యాయం చేసినవాళ్లు అవుతారు.

పశువుల కొట్టాన్ని పెరట్లో ఏ చోట, ఎలా వేసుకోవాలి?

- వి.లక్ష్మణ్, చాడ

ఇంటి పెరడులో అంటే సాధారణంగా రైతు కుటుంబాల ఇండ్లు పెద్ద ఖాళీ స్థలంతో కూడుకొని ఓ మూల ఇల్లు ఉంటుంది. మీకు పెరడు ఎటువుందో మీరు చెప్పలేదు. ఇల్లు ఉన్న స్థలంలో చుట్టూ ఖాళీ ఉంటే ఆ ఇంటికి వాయవ్యం, లేదా ఆగ్నేయం పశువుల పాకకోసం స్థలం కేటాయించుకోవాలి. ఉత్తర భాగం ఖాళీ జాగ ఉంటే అందులో వాయవ్యం వేసుకోవచ్చు. తూర్పు వైపు ఆగ్నేయంలో పాక వేయవచ్చు. పాకను తూర్పు పడమర కొలతలో వేయాలి. దాని అడుగు రెండు వైపులా వాలుగా ఏర్పాటు చేయాలి మధ్యలో నీటి తొట్టి దానతొట్టి కట్టుకోవాలి.పాకకు ఉత్తరం వైపు కాలువతీసి ఉత్తరం మధ్యలో కానీ తూర్పు మధ్యలో కాని ఆవుల మూత్రం స్టోరుకోసం రింగుల గుంత తీసుకొని వాడుకోవచ్చు. పశువుల పేడకోసం ఆ పాకకు పడమర లేదా దక్షిణం పెంట ఏర్పాటు చేసుకోవచ్చు.

SUDHHALA
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

163
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles