రాశి ఫలాలు


Sun,June 9, 2019 01:48 AM

9-6-2019 నుంచి 15-6-2019 వరకు

మేషం

భార్యాపిల్లలతో సుఖంగా ఉంటారు. విందులు, వినోదాలకు ప్రాధాన్యం ఇస్తారు. వస్త్ర, వస్తువుల కొనుగోలుపై మనసు పెడతారు. సాహిత్య, సంగీత, సినిమా రంగాలలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు పనివారితో మంచి సంబంధాలు ఉంటాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో తోటి వారితో, అధికారులతో మనస్పర్థలు ఉంటాయి. ఉన్నత విద్యలో ఆటంకాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తికాకపోవచ్చు. ఆర్థిక సమస్యలతో పనుల్లో ఆలస్యం జరుగుతుంది.

వృషభం

వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆలోచించి పెట్టుబడి పెడితే బాగా కలిసివస్తుంది. వస్త్ర, వస్తువులను, ఆభరణాలను కొనే అవకాశాలున్నాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల శుభకార్యాలు విజయవంతం అవుతాయి. నలుగురిలో మంచిపేరు పొందుతారు. రావాల్సిన డబ్బు విషయంలో కొంత జాప్యం జరగవచ్చు. పనివారితో ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగంలో తోటివారితో, కిందిస్థాయి వారితో సమస్యలుంటాయి. రాజకీయంలో కార్యకర్తలు, దగ్గరివారితో అనుకూలత ఉన్నా కొన్ని సమస్యలు తలెత్తుతాయి.

మిథునం

భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కళారంగంలో ఉన్న వారు తాత్కాలిక ప్రయోజనాలను పొందుతారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ప్రధానగ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి అన్ని పనులలోనూ జాప్యం, పదేపదే ఆలోచించడం, వృథా ఖర్చులుంటాయి. ఉద్యోగంలో తోటివారితో మనస్పర్థలు ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తికాకపోవచ్చు. ఉన్నతవిద్య కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలుంటాయి. శుభకార్యాల విషయంలో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.

కర్కాటకం

రాజకీయంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూల ప్రాంతాలకు బదిలీలుంటాయి. ఆఫీసులో వాతావరణం బావుంటుంది. కొత్త వస్తువులను, ఆభరణాలను కొంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. మంచి వాతావరణంలో చర్చలు సాగుతాయి. పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. సమయానికి పెద్దల సహాయసహకారాలు అందుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. పనివారితో అనుకూలత ఉంటుంది. పిల్లల శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతవిద్య అనుకూలిస్తుంది.

సింహం

ప్రధాన గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆలోచన అవసరం. చిన్న చిన్న పెట్టుబడులు అనుకూలిస్తాయి. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. నిర్మాణరంగం, రియల్ ఎస్టేట్, ఇండస్ట్రీలో ఉన్న వారు తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలుంటాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. అలసట, అశ్రద్ధలను దూరం చేసుకుంటే మంచిది. అన్నదమ్ములు, స్నేహితులతో పనులు నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవచ్చు.

కన్య

రోజువారీ కొంత అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు దూరంగా ఉండాలి. సంగీత, సాహిత్య రంగాలలోని వారికి బావుంటుంది. నిత్యావసర వస్తు వ్యాపారం, షేర్, వడ్డీ, హోటలు, క్యాటరింగు, వస్త్ర, సుగంధ ద్రవ్యాల వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆఫీసులో పై అధికారులతో, తోటి వారితో మనస్పర్థలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారు కొత్త పెట్టుబడులకు వెళ్లకూడదు. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. అన్నదమ్ములు, స్నేహితులతో కలహాలు ఏర్పడవచ్చు.

తుల

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పిల్లల శుభకార్యాల ప్రయత్నాలు కలిసివస్తాయి. గృహప్రవేశం, వివాహాది శుభకార్యాలు ఆచరిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. పనివారితో సమస్యలు పరిష్కారం అవుతాయి. పనులు వేగంగా ముందుకు సాగుతాయి. పెద్దల సహాయసహకారాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు. ఉద్యోగంలో తోటివారితో అనవసర చీకాకులుంటాయి.

వృశ్చికం

ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి ఓపిక, పట్టుదల అవసరం. రోజువారీ వ్యాపారాలు కొంత అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులలో ఇబ్బందులు ఉంటాయి. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తికాకపోవచ్చు. శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలుంటాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవచ్చు. పనివారితో సమస్యలు ఎదురవుతాయి. ఉన్నతవిద్య ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు. ప్రయాణాల వల్ల ఖర్చులుంటాయి. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. పెద్దల సహాయ సహకారాలు విస్మరించకూడదు.

ధనుస్సు

ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. రాజకీయంలో ఉన్న వారికి కార్యకర్తలతో సమన్వయం కుదురుతుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలోని వారు ఆశించిన ఫలితాలు పొందకపోవచ్చు. అనవసరమైన ఖర్చులు, ప్రయాణాలు ఉంటాయి. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందకపోవచ్చు. పనివారితో మనస్పర్థలు ఏర్పడతాయి. ప్రతి పనిని మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుంది. పెద్దల సహాయ సహకారాలు తీసుకోకుండా ముందుకు పోవడంతో కొత్త సమస్యలు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్, గృహనిర్మాణ రంగంలోని వారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు.

మకరం

వ్యాపారం కలిసివస్తుంది. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. న్యాయవాద, ఉపాధ్యాయ, వైద్య వృతులలో ఉన్న వారు సంతృప్తిగా ఉంటారు. అనుకున్న సమయంలో పనులు నెరవేరుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రద్ధతో, ప్రణాళికతో పనులు చేస్తారు. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల ఉన్నతవిద్య కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అన్నదమ్ములు, బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పైవారితో మనస్పర్థలు ఏర్పడతాయి.

కుంభం

పనుల్లో పురోగతి ఉంటుంది. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. పనివారు అనుకూలంగా ఉంటారు. అనుభవజ్ఞులు, తల్లిదండ్రులు, పెద్దల సహాయం అందుతుంది. ఉద్యోగులు అధికారుల నిరాదరణకు గురవుతారు. అనవసర విమర్శలు ఎదుర్కొంటారు. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో ప్రతికూల ఫలితాలుంటాయి. ఓపికతో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. అన్నదమ్ములు, స్నేహితులు, ఆత్మీయులతో మనస్పర్థలు ఏర్పడవచ్చు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మీనం

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మంచివారితో స్నేహసంబంధాలు పెరుగుతాయి. దేవతా గురుభక్తి పెరుగుతుంది. వ్యాపారం అనుకూలిస్తుంది. నిత్యావసర వస్తు వ్యాపారం, షేర్, వడ్డీ, హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, పండ్లు మొదలైన వ్యాపారాలలో లాభాలుంటాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవచ్చు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనివారితో ఇబ్బందులు ఉంటాయి. పెద్దల సహాయ సహకారాలు తప్పక వినియోగించుకోవాలి.

rasi-phalalu
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in

1017
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles