పాలతో స్నానం చేస్తుందట!


Sun,June 2, 2019 12:26 AM

DIGANGANA
సీరియల్‌లో కనిపించినవాళ్లు.. సినిమాల్లో హిట్ కొట్టినట్టు ఎక్కడా లేదు.. కానీ హిందీ సీరియల్స్‌లో నటించి.. మెప్పించిన నటి.. బాలీవుడ్‌లో విజయకేతనాన్ని ఎగురవేసింది.. ఇప్పుడు తెలుగు పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించదలుచుకున్నది.. హిప్పీతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేస్తున్న నటి దిగాంగనా సూర్యవన్షి. మరి ఆ ముద్దుగుమ్మ గురించి కొన్ని సంగతులు..

-సౌమ్య పలుస

దిగాంగనా సూర్యవన్షి పుట్టినరోజున పాలతో స్నానం చేస్తుందట. ఆ రోజున తనొక రాకుమారిలా ఫీలవుతుందట. బంగారం, జెమ్‌స్టోన్స్‌తో ఒక క్రౌన్ చేయించుకుంది దిగాంగనా. ప్రతీ పుట్టినరోజుకు దాన్ని కచ్చితంగా
ధరిస్తుందట.

-ఈ అమ్మడు ఇండియా యువ అవార్డుల్లో యూత్ ఐకాన్ అవార్డును 2015లో అందుకుంది.

-అతిచిన్న వయసులో హిందీ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచి ఈ అమ్మడు పేరు తెచ్చుకుంది. కాకపోతే తొందరగా ఆ ఇంటిని వదిలి బయటకు వచ్చేసింది.
bigg-boss

-16 యేండ్ల వయసులో ఈ ముద్దుగుమ్మ వేవ్స్.. ద ఎండ్‌లెస్ ఎమోషన్స్, నిక్సీ.. ద మెర్‌మేడ్ అండ్ ద పవర్ ఆఫ్ లవ్ పేరుతో ఒక నవల రాసింది.

-దిగాంగనా ఇప్పటిదాకా 50 పాటల దాకా రాసింది. పది సంవత్సరాల వయసులో దేవీ ఖీర్ కాలో పేరుతో భక్తి ఆల్బమ్‌ను రిలీజ్ చేసింది.

-2009లో శకుంతల అనే సీరియల్‌లో సపోర్టింగ్ రోల్ చేసింది. 2012లో మొదలైన ఏక్ వీర్ కీ అర్‌దాస్.. వీర అనే సీరియల్‌తో మంచి పాపులారిటీ సంపాదించింది.
వీర సీరియల్‌కి స్టార్ పరివార్ అవార్డును కూడా గెలుచుకున్నది.

-ఐదు సంవత్సరాల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా టీవీలో కనిపించింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు టీవీకి కామా పెట్టేసింది.

-పెయింటింగ్, స్కేటింగ్, బ్యాడ్మింటన్ ఆడడం, ఎప్పుడూ ఏదో ఒకటి రాయడం చేస్తుంటుందట. హ్యారీపోటర్ పుస్తకాల సిరీస్ అంటే చాలా ఇష్టమట.

1076
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles