నెట్టిల్లు


Sat,June 1, 2019 11:53 PM

నిడివి మ్యాటర్ కాకపోవచ్చు. లొకేషన్ మ్యాటర్ కాకపోవచ్చు. సబ్జెక్ట్ మాత్రం పక్కా మ్యాటర్ అవ్వాలి. ఎంచుకున్న అంశం మీద, దాని వల్ల ప్రభావాల మీద అంచనా వేయగలిగి కథగా మలిచి లఘచిత్రంగా రూపొందించినప్పుడు అది విజయవంతం అవుతుంది. చూసిన ప్రేక్షకులకూ నచ్చుతుంది. యూట్యూబ్‌లో విడుదలయి ప్రేక్షకులు మెచ్చిన లఘచిత్రాల్లో కొన్ని..

మధుకావ్యం


దర్శకత్వం: దుర్గాప్రసాద్
నటీనటులు : రషీద్, దివ్య
ప్రేమకథతో తీసిన ఒక సందేశాత్మక లఘుచిత్రం మధుక్యావం. కథ విషయానికొస్తే.. మధు, కార్తిక్ ఇద్దరూ ప్రేమించుకుంటారు. పెద్దలను కాదని పెళ్లి చేసుకొని అమెరికా వస్తారు. మొదటి ఏడాది గడిచేలోపు తల్లిదండ్రులను కలుసుకోవాలని మధు కోరుకుంటుంది. అట్లాగే కార్తిక్ తాగటం మానేస్తే సంతోషంగా ఉంటామని ఆశిస్తుంది. ఇదే విషయం కార్తిక్‌తో చెప్తుంది. మధు కోరుకున్నట్టుగా మొదటి ఆనివర్సరీ తర్వాత తల్లిదండ్రులను కలుసుకోవడానికి, మద్యం మానేయడానికి రెడీ అవుతాడు. అదే విషయం ఆనివర్సరీ రోజు రాత్రి చెప్పి సర్‌ప్రైజ్ చేద్దాం అనుకుంటాడు. ఇక్కడే కథ ఓ మలుపు తిరుగుతుంది. తర్వాత ఇద్దరూ హోటల్‌కు వెళ్తారు. ఏం జరిగిందో మధు అంతా కార్తిక్‌కు వివరిస్తుంది. కార్తిక్ షాక్ అవుతాడు. మళ్లీ సెకండ్ ఆనివర్సరీ వస్తుంది. కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు కార్తిక్. ఓవరాల్‌గా డీఓపీ, మేకింగ్, ఫారిన్ బ్యాక్‌డ్రాప్ వేటేజ్‌ను ఇచ్చాయి. కథకు తగ్గ టెన్షన్ వాతావరణాన్ని సృష్టించారు. మరి కథలో మలుపు ఏంటి? సందేశం ఏంటి? మధుకు ఏమైంది? కార్తిక్ తీసుకున్న నిర్ణయం ఏంటి? యూట్యూబ్‌లో చూడండి.
madhu

Total views 30,850+ (మే 25 నాటికి) Published on May 23, 2019

ఇమాజినరీ లవ్ స్టోరీ..


దర్శకత్వం: సందీప్ కరిణి
నటీనటులు : రాజూబాయ్, సాయి ప్రవళ్లిక
హీరో ప్రశాంత్ కథల రచయిత. క్రైమ్ కథలు, ఫన్నీ స్క్రిప్ట్‌లు రాసుకునే ప్రశాంత్‌కు ఒకసారి ప్రేమకథ రాయాల్సిన అవకాశం వస్తుంది. వ్యక్తిగతంగా ప్రేమగురించి ఎలాంటి అనుభవమూ లేని ప్రశాంత్ ఈ కథరాయడానికి తిరస్కరిస్తాడు. కానీ అవతలి వారు డిమాండ్ చేయడంతో ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు కథ రాయడానికి ముందు ఓ మిత్రుడికి ఫోన్ చేసి అతన్ని లవ్‌స్టోరీ చెప్పాలని కోరతాడు. వాళ్ల నాన్న లవ్‌స్టోరీ ఏంటో కూడా తెలుసుకుంటాడు. ఇద్దరూ చెప్తున్న స్టోరీనే సన్నివేశాలుగా దర్శకుడు మలిచాడు. చివరికి ప్రశాంత్ రాయాల్సిన లవ్‌స్టోరీ మొదలు పెడతాడు. అమ్మాయి పేరు సంతోషిగా ఊహించి స్టోరీ రాస్తాడు. ఈ స్టోరీనే మళ్లీ సీన్లలో దర్శనమిస్తుంది. ఇట్లా రెండు మూడు రకాల స్టోరీలు మిక్స్ చేసి స్క్రీన్‌ప్లే చేశారు. కానీ మూడు స్టోరీల్లో అమ్మాయి, అబ్బాయి పాత్రల్లో ఆ వారే కనిపిస్తారు. ఓవరాల్‌గా అనుకున్నది అనుకున్నట్టుగా చూపించలేక ఏదో చూపించారేమో అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌మ్యూజిక్, డీఓపీ బాగున్నాయి. డైలాగులు కూడా కొంత ఆకర్షించేలా ఉన్నాయి.
imaginary-love-story

Total views 22,220+ (మే 25 నాటికి) Published on May 21, 2019

వై?


దర్శకత్వం: మిస్టర్ ఎక్స్
నటీనటులు : రాఘుల్, సారా
మనిషి అవసరం అనుకున్నప్పుడు ప్రేమను నటించే వారుంటారు. అట్లాగే కొందరి స్నేహంలో రానురానూ అప్యాయత తగ్గిపోయి, మనస్పర్ధలు ఏర్పడతాయి. కానీ అవసరాల కోసం కాంప్రమైజ్ అయి స్నేహాన్ని కొనసాగించక తప్పదు. కృత్రిమైన బంధుత్వాన్ని కొనసాగిస్తూ, అబద్ధపు అప్యాయతల బదులు నిజాయితీ ఉండాలి. ఒక బంధుత్వంలోని ఈ ద్వంద్వ ధోరణిని వై లఘు చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. కథ విషయానికి వస్తే అమ్మాయి, అబ్బాయి రిలేషన్‌షిప్‌లో ఉంటారు. అప్పుడప్పుడూ మనస్పర్ధలు వస్తాయి. గొడవపడి కాసేపయ్యాక మళ్లీ మామూలుగా నవ్వుతూ కాంప్రమైజ్ అవుతారు. కానీ అది ప్రేమతోనో, బాధ్యతతోనో వచ్చింది కాదు. ఇద్దరి మధ్య ఉండే అవసరాలు కాంప్రమైజ్ అయ్యేలా చేస్తాయని దర్శకుల అభిప్రాయం. ఈ విషయాన్నే వివిధ సన్నివేశాలతో చూపించే ప్రయత్నం చేశారు. తక్కువ మాటలు ఉంటాయి. మొదటి నుంచి చివరి వరకూ ఒక సౌండ్‌ట్రాక్‌తో నడుస్తుంది. కథకు తగ్గ సన్నివేశాల నిర్మాణం, పాత్రల నటనలో సహజత్వం ఉన్నప్పటికీ దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నాడో అది స్పష్టంగా కనిపించలేకపోయింది.
Why

Total views 12,094+ (మే 25 నాటికి) Published on : May 24, 2019

చిత్ర


దర్శకత్వం: సత్యక్రిష్ణ
నటీనటులు : యూవీ సుష్మ
అర్థరాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి బయల్దేరుతుంది చిత్ర. మధ్యలో బైక్‌లో పెట్రోల్ అయిపోతుంది. వాళ్ల అన్నకు ఫోన్ చేస్తే రావడానికి టైం పడుతుందని చెప్తాడు. సీన్ కట్ చేస్తే ఇద్దరు పోకిరీలు చిత్ర దగ్గరకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. కానీ చిత్ర ధైర్యంగా ఎదుర్కొంటుంది. వారిని మాటల్లో పడేసి, వాళ్ల అన్న వచ్చేంతవరకూ చూస్తుంది. ఉన్నట్టుండి ఆమె అంతధైర్యంగా పోకిరీలతో ఎలా మాట్లాడగలిగింది అనేది పాయింట్. ఈలోపు చిత్ర వాళ్ల అన్న వస్తాడు. కానీ పోకిరీలు ఆతనిపై దాడి చేస్తారు. చిత్రను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా వాళ్ల అన్న కోరతాడు. చిత్రను పోకిరీలు వెంబడిస్తారు. చివరకు ఒక ప్రాంతంలో పట్టుకుంటారు. కానీ చిత్ర తీవ్రంగా తిరగబడుతుంది. వారిపై ఎదురుదాడి చేసి చితకబాదుతుంది. అర్ధరాత్రి ఆడపిల్లల పట్ల సాయంగా ఉండాలి తన్న అసభ్యంగా ప్రవర్తించొద్దని క్లాస్ పీకుతుంది. ఇదీ కథ. రిచ్‌లుక్‌తో, మంచి డీఓపీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో తీశారు. చిత్ర నటన సహజంగా, కథకు తగ్గ ఎనర్జీతో కనిపిస్తుంది. కథ మొదటి నుంచీ ఆసక్తికరంగా సాగుతుంది. చూడొచ్చు.
chitra

Total views 9,088+ (మే 25 నాటికి) Published on May 24, 2019

-వినోద్ మామిడాల, సెల్: 7660066469

346
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles