రాశి ఫలాలు


Sat,June 1, 2019 09:36 PM

2-6-2019 నుంచి 8-6-2019 వరకు

మేషం

ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. పనులలో జాగ్రత్త అవసరం. తాత్కాలిక ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. సంగీత, సాహిత్య, సభలలో పాల్గొంటారు. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ములు, బంధువులతో పనులు నెరవేరుతాయి. వాహనాల వల్ల అనుకూలత ఉంటుంది. ఆస్తుల విషయంలో తగాదాలు ఉంటాయి. ఉద్యోగస్తులు, అధికారులు, తోటి వారితో సమన్వయంగా ఉండాలి. శుభకార్యాలలో ఆటంకాలుంటాయి. పనివారితో ఇబ్బందులు ఎదురవుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందక పోవచ్చు.

వృషభం

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దేవతా గురుభక్తి పెరుగుతుంది. పిల్లల చదువు, శుభకార్యాలు అనుకూలిస్తాయి. భార్యా పిల్లలు పనుల విజయంలో బాగా తోడ్పడతారు. ఉపాధ్యాయ, న్యాయవాద, వైద్య వృత్తులలో ఉన్న వారికి ఈ వారం బాగా అనుకూలిస్తుంది. కొత్త పెట్టుబడులు కలిసివస్తాయి. రోజువారీ వ్యాపారాలలో లాభాలుంటాయి. నిత్యావసర, వడ్డీ, షేర్, వస్త్ర, ఫ్యాన్సీ, హోటలు, క్యాటరింగు మొదలైన వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. పనుల్లో కొంత ఆలస్యం ఉంటుంది. పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. భూమి, వాహనాలు కొనేముందు ఆలోచించాలి.

మిథునం

పనుల ఒత్తిడి వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. అయినా ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సాహిత్య, పత్రికారంగాలలో ఉన్న వారికి కలిసివస్తుంది. వ్యాపారంలో మాత్రం ఇబ్బందులుంటాయి. రావాల్సిన డబ్బు రాకపోవచ్చు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. నమ్మిన వారి వల్ల నష్టం జరుగుతుంది. ప్రయాణాల వల్ల ఖర్చులు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. వాహనాల వల్ల ఇబ్బందులుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించక పోవచ్చు.

కర్కాటకం

ప్రధాన గ్రహాల స్థితి అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక పనులు అనుకూలిస్తాయి. పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్య అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చాలా పనులలో వేగం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నయమవుతుంది. ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. పనివారితో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. పై అధికారులతో, తోటి వారితో సమన్వయం ఉంటుంది. మంచి పేరు సంపాదిస్తారు. తీర్థయాత్రలు, పుణ్యనదీస్నానాలు ఆచరిస్తారు.

సింహం

ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులు పై అధికారులు, తోటి వారి సమన్వయంతో ముందు కెళతారు. అన్నదమ్ములు, బంధువులతో సఖ్యత నెలకొంటుంది. పనులు నెరవేరుతాయి. భూములు, రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో ఉన్న వారికి ఊరట లభిస్తుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగాల వారికి కొత్త అవకాశాలు వస్తాయి. రోజువారీ వ్యాపారం అనుకూలిస్తుంది. పెద్దల సహాయ సహకారాలు సమయానికి అందకపోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం.

కన్య

వ్యాపారస్తులకు తాత్కాలికంగా లాభాలు ఉంటాయి. న్యాయవాద, వైద్య వృత్తిలో ఉన్న వారికి కలిసివస్తుంది. సంగీత, సాహిత్య, సినిమా, వస్త్ర, ఫ్యాన్సీ, హోటలు, క్యాటరింగు, సుగంధ ద్రవ్యాలు తదితర వ్యాపారాలలో తాత్కాలిక లాభాలుంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. ఉద్యోగంలో సమన్వయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. నష్టాన్ని తలపెట్టే వారితో స్నేహ ప్రయత్నాలు చేస్తారు. అనవసరమైన ఖర్చులుంటాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందక పోవచ్చు.

తుల

శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి వారితో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. మంచి పేరు సంపాదిస్తారు. ఉన్నతవిద్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పనివారితో సమస్యలు పరిష్కారం అవుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. తీర్థయాత్రలు, నదీస్నానాలు ఆచరిస్తారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాహనాల వల్ల ఇబ్బందులుంటాయి. అన్నదమ్ముల మధ్య సుహృద్భావ వాతావరణం కొరవడుతుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో ప్రతికూల ఫలితాలుంటాయి.

వృశ్చికం

రోజువారీ వ్యాపారం కొంత లాభసాటిగా ఉంటుంది. ఆలోచించి పనులు చేయడం ఈ వారంలో చాలా అవసరం. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలుం టాయి. పెద్దల సూచనలను పాటించక పోవడంతో కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాహనాల వల్ల ఊహించని ఖర్చులుంటాయి. ఆస్తుల విషయంలో గొడవలు కావొచ్చు. ఆఫీసులో సమన్వయం కొరవడుతుంది. నిర్మాణ రంగంలోనివారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించక పోవడం మంచిది.

ధనుస్సు

ఆఫీసులో అందరితో సమన్వయంగా ఉంటారు. అధికారుల అండ, తోటి ఉద్యోగుల సహకారంతో పనులు నెరవేరుతాయి. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. విందులు, విహార యాత్రలు చేస్తారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలోని వారికి తాత్కాలికంగా ఊరట లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోవచ్చు. చదువు, ఉద్యోగం విషయాలలో ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఆలోచనలతో సమయం వృథా చేసుకుంటారు. పనివారితో ఇబ్బందులు ఎదురవు తాయి. రావాల్సిన డబ్బు సకాలంలో రాకపోవచ్చు.

మకరం

భార్యా పిల్లలతో సంతోషంగా గడుపుతారు. సభలకు, సమావేశాలకు, విందులకు హాజరవుతారు. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. అన్నదమ్ముల మధ్య సహాయ సహకారాలు వృద్ధి అవుతాయి. వ్యవసాయదారులకు రాబడి పెరుగుతుంది. పనివారితో ఉన్న సమస్యలు తీరుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో ఉన్న వారు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పిల్లల చదువు, ఉద్యోగం విషయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. ప్రయాణాలు బాగా కలిసివస్తాయి.

కుంభం

పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. దీంతో ఆర్థిక సమస్యలు తీరుతాయి. పనివారు అనుకూలంగా ఉండడంతో పనులలో వేగం కనబడుతుంది. భార్యా పిల్లలతో సుఖంగా ఉంటారు. సాహిత్య, సంగీత, కళా రంగాలలో ఉన్న వారికి బాగా కలిసివస్తుంది. ఉద్యోగంలో తోటి వారితో కలహాలు ఉంటాయి. ఉద్యోగ, వివాహ, విద్యా ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు. అన్నదమ్ములు, బంధువులతో మనస్పర్థలు ఏర్పడవచ్చు. ఆస్తుల విషయంలో తగాదాలు జరగొచ్చు.

మీనం

రోజువారీ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. వడ్డీ, షేర్, నిత్యావసర వస్తు వ్యాపారం, హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్యాల వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. మంచి వాతావరణంలో చర్చించడం వల్ల చాలా విషయాలలో మంచి ఫలితాలను పొందుతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక సమస్య ఉన్నప్పటికీ శుభకార్యాలు చేస్తారు. మంచి వారితో స్నేహం ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరు పొందుతారు. ఉద్యోగంలో తోటి వారితో మనస్పర్థలు ఏర్పడవచ్చు. రాజకీయంగా కార్యకర్తలతో ఇబ్బందులు తలెత్తుతాయి.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in

1107
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles