ఎంతపెద్ద ముత్యమో!


Sun,May 19, 2019 01:47 AM

Peral
ముత్యం ఎన్ని కేజీల బరువుండొచ్చు.. మహా అయితే ఓ కేజీ, రెండు కేజీలు బరువుండొచ్చు. అవే ప్రంపంచలోని పెద్ద పెద్ద ముత్యాలుగా చెలామణి అవుతుంటాయి. మరి.. ఒక ముత్యం 27 కేజీల బరువుంటే..? చిన్నసైజు పిల్లాడంత పరిమాణంలో ఉంటే..? వామ్మో.. అంతపెద్ద ముత్యమా? అనక మానరు. ఇదిగో.. అదే అతిపెద్ద, ఖరీదైన ముత్యం.

బంగారు ఆక్టోపస్ బొమ్మలో ఉన్న ఈ ముత్యంకేసి ఓసారి లుక్కేయండి. చూడటానికి నార్మల్ వైట్ స్టోన్‌లా కనిపిస్తున్నా కొన్ని కోట్లు విలువ చేస్తుంది. ఈ ముత్యం విలువ 90 మిలియన్లు (రూ.630 కోట్లు) వరకు ఉంటుందని అంచనా. అంతేకాదు 27.65 కిలోల వరకు బరువు ఉన్నది. ఈ ముత్యం ఫొటోలో చూడటానికి చిన్నగానే ఉన్నప్పటికీ.. ఓ చిన్న సైజు పిల్లాడంత పరిమాణంలో ఉన్నది. సుమారు వెయ్యేండ్ల పురాతనమైన ముత్యమని రేయెస్ అనే ముత్యాల నిపుణుడు చెబుతున్నాడు. ఫిలిప్పీన్స్‌లోని ఓ జాలరి నుంచి రేయెస్ ఈ ముత్యాన్ని కొనుగోలు చేశాడు. ఆ ముత్యం అంత ఖరీదు ఉంటుందని తమ కుటుంబ సభ్యులకు కూడా తెలియదని అంటున్నాడు రేయెస్. ఈ ముత్యాన్ని ఇటీవల పరిశీలించిన జియోలాజికల్ స్పెషలిస్టులు.. దీని విలువ 60 నుంచి 90 మిలియన్ డాలర్లు వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ ముత్యాన్ని పట్టుకొని ఉన్న ఆక్టోపస్‌ను 22 క్యారెట్ల బంగారంతో తయారు చేయడం విశేషం. ఈ ముత్యాన్ని త్వరలోనే ప్రపంచంలోని అన్ని మ్యూజియంలలో ప్రదర్శిస్తానని రేయెస్ చెబుతున్నాడు.
Peral1

358
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles