నెట్టిల్లు


Sun,May 19, 2019 01:31 AM

చిత్రాన్ని రూపొందించాలంటే కథలే కావాల్సిన అవసరం లేదు. ఆలోచనకు దృశ్యరూపమిచ్చి పదిమందికి పనికొచ్చేది అయి ఉంటే చాలు. ఈ మధ్య కాలంలో వస్తున్న షార్ట్‌ఫిలిమ్స్ దాదాపు అలాంటివే. సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకొని షార్ట్‌ఫిలిమ్స్ రూపొందించి ఆలోచింపజేస్తున్నారు ఈతరం దర్శకులు. వాటిలో కొన్ని ఇవి..రేపల్లె

Total views 45,830+ (మే 11 నాటికి) Published on May 4, 2019

దర్శకత్వం: హరినాథ్ పులి
నటీనటులు : యెయ్ షా అధర, విఘ్నేశ్, చాందిని, అఖిల్

పల్లె అంటేనే ప్రకృతి, చల్లని గాలి, పరిశుభ్రమైన వాతావరణం అలాంటి పల్లెలో ఓ పెద్ద చెరువు. అందులో చేపలు పట్టే యువకుడు. రోజుకు దొరికినన్ని చేపలు పట్టి అమ్మేయడం అతని వృత్తి. రోజూ రొటీన్‌గా సాగుతున్న జీవితంలో ఒక అమ్మాయి ఎదురుపడింది. ఊర్లో ఉంటున్న ఆ యువకుడు విదేశాల్లో స్థిరపడాలనుకుంటాడు. విదేశాల్లో ఉన్న తన మిత్రుడు ఎంతో కొంత సంపాదిస్తూ ఊర్లోనే బతకాలనుకుంటాడు. ఈ ఇద్దరి జీవితాల మధ్య వ్యత్యాసాలను ఇంకా చూపిస్తే బాగుండేది. రంగస్థలం సినిమా చూసి ఇలాంటి కథను ఎంపిక చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఒక గ్రామంలో ఉన్న నేపథ్యాన్ని తెరకెక్కించాలన్న ఆలోచన బాగుంది. చివరకు విదేశాలకు ఆ యువకుడు వెళ్లాడా? లేదా? ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్న విషయం తెలియాలంటే రేపల్లె షార్ట్ ఫిలిం చూడాలి. కథకన్నా విజువల్ మీద ఎక్కువ ఆసక్తి పెట్టినట్టు అనిపిస్తుంది.ఒకరి కల..ఒకరి కోరిక

Total views 21,151+ (మే 11 నాటికి) Published on May 10, 2019

దర్శకత్వం: విశ్వరామ్ నర్తు
నటీనటులు : వి వీరభద్రం, శ్రీనివాసులు, ఆశ, బేబీ నిఖిత

నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ వృద్ధుడు.. అప్పు తీర్చాలి. డబ్బులు వచ్చే మార్గం లేదు. అప్పు ఇచ్చిన వాళ్లు ఇంట్లో ఉన్న సామాగ్రి తీసుకెళ్తానని బెదిరింపులు. ఏం చేయాలో తెలియని అయోమయం. ఇదొక నిరుపేద జీవితం. అన్నీ బాగుండి బయటికి బాగా కనిపిస్తున్న వాళ్లు ఆనందంగా ఉన్నారా అంటే అతనికన్నా డబ్బున్న వ్యక్తిని చూసి ఆయనలా ఉండాలని కోరుకుంటాడు. ఇదొక మధ్యతరగతి జీవితం. ఇల్లు, కారు, బంగారం ఇలా అన్నీ ఉన్న వ్యక్తి సంతోషంగా ఉన్నాడా అంటే అదీ లేదు. ఆయనకు ఏదో కష్టం. అంతా బాగుంది అనుకోవడం పొరపాటే అన్న విషయాన్ని గుర్తు చేస్తుందీ చిత్రం. ఎవరి స్థాయిలో వాళ్లకు కష్టాలుంటాయని నిర్వచిస్తుంది. డబ్బు ఎంతుంటే ఏం లాభం ఆనందంగా బతకాలి అని చెప్పే చిత్రం. దర్శకుడు మంచి సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా తీసుకున్నాడు. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పగలిగాడు.లవ్ యువర్ లవ్

Total views 27,375+ (మే 11 నాటికి) Published on May 5, 2019

నటీనటులు : సుబ్బలక్ష్మీ, వినాయక్
దర్శకత్వం: వినాయక్ వైద్యనాథన్

ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటే సరదాలు, సతాయింపులు, బాధలు, ఆనందాలు అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటేనే కదా ప్రేమ. అయితే అబ్బాయి అతనికి తెలియకుండా అమ్మాయిలతో క్లోజ్ అవుతుంటాడు. ఆ విషయాన్ని తట్టుకోలేని లీనా(అతని గర్ల్‌ఫ్రెండ్) గొడవకు దిగుతుంది. చిన్న చిన్న ఈగోల వల్ల ప్రతి విషయానికి వాగ్వివాదానికి దిగుతుంటారు. ప్రతిచిన్న విషయానికి గొడవ పడడం కోపం తగ్గాక ఒకరినొకరు అర్థం చేసుకొని కలుసుకుంటారు. గొడవలు అనేవి మేఘాల్లాంటివి వెళ్లిపోతుంటాయి. ప్రేమమాత్రం నిండు చంద్రునిలాంటి మేఘలు అడ్డొచ్చి చంద్రున్ని వెన్నెలను ఆపలేదు అన్న అంశాన్ని ఈ షార్ట్ ఫిలిం ద్వారా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. మేకింగ్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు, మెళకువలు పాటిస్తే బాగుండేది. ఎన్ని గొడవలు జరిగినా తిట్టుకున్నా, కొట్టుకున్నా నిజమైన ప్రేమికులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఎందుకంటే వాళ్లు వాళ్ల లవ్‌ని లవ్ చేస్తారు కాబట్టి.శ్వాస


Total views 5,886+ (మే 11 నాటికి) Published on May 10, 2019

దర్శకత్వం: ప్రదీప్ చరణ్
నటీనటులు : ప్రాన్శీ, లోహిల్, స్వప్న, రఘు, నరేష్

నిత్యం ధూమపానం చేసే తండ్రిని ఆ అలవాటు మానాలని కోరుతుంది కూతురు. ఒక ఫేస్‌బుక్ ఫొటో చూపించి దానికి వందల లైక్‌లువస్తే పొగత్రాగడం మానేస్తానని చెప్తాడు ఆ తండ్రి. అప్పటి నుంచి ఎలాగోలా తండ్రిని సిగరెట్ మాన్పించాలని ఆలోచిస్తుంది. ఎవరికీ చెప్పకుండా స్కూల్ నుంచి పారిపోతుంది ఆ చిన్నారి. హుటాహుటిన తండ్రి స్కూల్‌కి వచ్చి అందరితో అడుగుతాడు. అమ్మాయి ఎటో దూరం పారిపోయిందని అనుకుంటారు అందరూ. కానీ ఆమె ఎటూ వెళ్లదు. ఊరంతా తిరుగుతూ పేపర్ పాంప్లెంట్లు పంచుతుంటుంది. ఆ విషయం తెలిసి పరుగెడుతూ ఉంటాడు తండ్రి. ఒకనొక సమయంలో బాగా అలిసిపోయి కిందపడితాడు. అప్పుడు తన మనసులో ఇంకెప్పుడూ సిగరెట్ తాగను.. తిరిగి వచ్చెయ్ అని కోరుకుంటాడు. ఆ మాట మనసులో అనుకున్న మరుక్షణమే అమ్మాయి తన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. సిగరెట్ మాన్పించాలని చేసిన ప్రయత్నంలో శ్వాస సఫలమవుతుంది. ఇలాంటి చిత్రాన్ని రూపొంచాలనే ఆలోచన రావడం గొప్ప విషయం.

- అజహర్ షేక్, సెల్: 9963422160

302
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles