అండర్ వాటర్‌లో అదిరే రెస్టారెంట్లు!


Sun,May 12, 2019 01:56 AM

ఆకట్టుకునే సముద్రజీవులు కండ్లముందు నుంచి వెళ్తుంటే.. వింతైన చేపలు మన చుట్టూ తిరుగుతుంటే ఆ అనుభవం అద్భుతం. రంగురంగుల జలచరాలను చూస్తూ విందు ఆరగించే అనుభూతిని మరిచిపోగలమా? నీలిరంగు సముద్రాన్ని ఆస్వాదిస్తూ, సముద్రంలోపలే నిద్రపోతే.. అదుర్స్ కదూ! ఇలాంటి తిరుగులేని అందమైన ప్రదేశాలే అండర్ వాటర్ రెస్టారెంట్స్.

భోజనం ఎంత ఖరీదుగా ఉన్నప్పటికీ వెరైటీగా ఉండాలని కోరుకుంటారు చాలామంది. ఇలాంటి వెరైటీ ప్రేమికుల కోసమే అండర్‌వాటర్ రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. కొన్ని సంపన్న దేశాలు సముద్రం లోపల రెస్టారెంట్లను, హోటళ్లను నిర్మిస్తున్నాయి. విహారయాత్రలకు వచ్చే వారికి, వింతైన రీతిలో విందును కోరుకొనే వారిని దృష్టిలో ఉంచుకొని ఇవి పని చేస్తాయి. వైవిధ్యమైన అనుభూతిని కలిగించడానికి ఇవి ఆయా దేశాల్లో అందుబాటులోకి వస్తున్నాయి. సౌత్ ఆఫ్రికా, మాల్దీవ్స్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, ఫిజి దేశాల్లో అండర్ వాటర్ రెస్టారెంట్లకు డిమాండ్ ఉంది. తాజాగా యూరప్ కూడా అండర్ పేరుతో వాటర్ రెస్టారెంట్‌ను ప్రారంభించి ఆ లిస్ట్‌లో చేరింది.
hurawalhi-maldives

మన దేశంలో ఇదే మొదటిది

పలు దేశాల్లో అండర్‌వాటర్ రెస్టారెంట్ల కల్చర్ ఉంది. మొదటి రెస్టారెంట్ మాత్రం మాల్దీవ్స్‌లో ఏర్పాటైంది. కొన్‌రాడ్ మాల్దీవ్స్ రంగలిలో ఇథ పేరుతో ప్రపంచ మొదటి అండర్ వాటర్ రెస్టారెంట్ 2005లో ప్రారంభమైంది. సముద్ర నీటి ఉపరితలం నుంచి 5 మీటర్ల లోతులో ఈ రెస్టారెంట్ ఉంటుంది. 180 డిగ్రీల కోణంలో ఉన్న గ్లాస్ నుంచి సముద్ర దృశ్యాన్ని, జీవులను చూడొచ్చు.

అలల మీద...

కాలిఫోర్నియాలోని ద మెరైన్ రూం రెస్టారెంట్ భిన్నంగా ఉంటుంది. ఇది అలల మీద నిర్మించి ఉంటుంది. సముద్ర ఉపరితలంపై తేలినట్టు కనిపిస్తుంది. కానీ 8 అడుగుల లోతులో కూడా రూమ్‌లు ఉంటాయి. భోజనం చేస్తున్నప్పుడు పసిఫిక్ మహాసముద్రపు అలలు కిటికీలకు తాకుతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన సముద్రపు ఆహారాన్ని అందిస్తారు. ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే ఈ రెస్టారెంట్ తెరిచి ఉంటుంది.

తినాలంటే ఈదాలి..

ఫ్లోరీడాలోని కీలార్గో అండర్ వాటర్ హోటల్‌లో బస చేయాలన్నా, భోజనం చేయాలన్నా సముద్రం లోపలికి ఈదాల్సిందే. మరి ఈత రాకపోతే ఎలా అంటారా? ఈ హోటల్‌లో ఒక్కసారి బుకింగ్ చేసుకున్నాక సముద్ర ఉపరితలం నుంచి కస్టమర్లను స్క్యూబా డైవర్లు తీసుకెళ్తారు. స్క్యూబా షూట్ వేసుకొని వారితో పాటు ఈదుకుంటూ వెళ్లడమే. నీటిలోపల ఉన్న ఈ హోటల్‌లో పిజ్జా కూడా దొరుకుతుంది. విలాసవంతమైన హోటల్‌ను, వరల్డ్ క్లాస్ ఫుడ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

360 డ్రిగీలలో నీళ్లే..

ఫిజీ దేశంలోని అండర్ వాటర్ ఫైవ్‌స్టార్ రెస్టారెంట్, రిసార్ట్ ఇది. పోసిడాన్ దీని పేరు. కస్టమర్లకు మధురమైన అనుభూతిని కలిగించేందుకు యాజమాన్యం అవకాశం కల్పించింది. హోటల్ మొత్తం చెక్క, మెటల్ ఫ్లోరింగ్, రూఫ్‌టాప్ గ్లాస్‌తో ఉంటుంది. కానీ, డైనింగ్ హాల్ మాత్రం 360 డిగ్రీలూ గ్లాస్‌తో ఉంటుంది. అవసరమైతే స్క్యూబా డైవర్లతో కలిసి కాసేపు సముద్రంలో ఈద వచ్చు కూడా.

సముద్రంలోకి నడుచుకుంటూ...

పదిహేను రోజుల కిందటే యూరప్‌లో ఈ తరహా రెస్టారెంట్ ప్రారంభమైంది. యూరప్‌లోని నార్వేలో ఆ దేశ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మామూలుగా అండర్ వాటర్ రెస్టారెంట్ అనగానే స్కూబా డైవింగ్ చేస్తూ వెళ్లాలి కానీ ఇందులోకి మాత్రం నడుచుకుంటూనే వెళ్లొచ్చు. తీరం నుంచి కాంక్రీట్ ట్యూబ్‌ను సముద్రం లోపలికి నిర్మించారు. ఉపరితలానికి 16 అడుగుల లోతులో ఈ రెస్టారెంట్ ఉంది. 40 మంది ఒకేసారి భోజనం చేసేంత స్థలం ఉంటుంది. ఈ రెస్టారెంట్‌లో భోజనం చేయాలంటే ఒక్కసారి రూ. 30 వేలు ఖర్చు చేయాల్సిందే. ఓపెన్ అయిన వారం రోజుల్లోనే 3 వేల మంది కస్టమర్లు ఈ రెస్టారెంట్‌లో రిజర్వేషన్ చేసుకున్నారు. ఇంకా మెరైన్ బయాలజీ గురించి అధ్యయనం చేసే వారికి ఈ రెస్టారెంట్ ఉపయోగపడుతున్నది.

338
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles