నీటిని తినొచ్చు!


Sun,May 12, 2019 01:34 AM

ఇక రానున్న రోజుల్లో తాగేనీరు ప్లాస్టిక్ బాటిళ్లలో, ప్యాకెట్లలో రాదేమో. చిన్న చిన్న ముద్దలుగా జెల్ రూపంలో దర్శనమిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల ప్రమాదాలను నివారించడానికి నీటి పంపిణీలో ప్లాస్టిక్‌ను వాడకుండా ముద్దలుగా తయారు చేయడం ప్రారంభమైంది. అయితే ఆ నీటిని తాగడానికి వీలుండదు. నేరుగా తినడమే...
Water_Ball

పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ఎంతటి సమస్యను తెస్తుందంటే.. ఏదో ఒక రోజు ఆక్సీజన్‌ను కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. గాలి సంగతి అటు ఉంచితే నీటి సంగతి ఏంటి? నీరు తాగడానికి ఉపయోగించే ప్లాస్టిక్ పాత్రల వల్ల ప్రమాదం ఉంటుంది కదా? అందుకే మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థి రిచార్డ్ తినే నీటి ముద్దలను తయారు చేశాడు. ఈ నీటి ముద్ద చిన్న సైజులో ఉంటుంది. వంద మిల్లీ లీటర్ల నీటి చుట్టూ కెమికల్ లిక్విడ్‌తో పొర ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి వంద మిల్లీలీటర్ల నీటిని -పది డిగ్రీల సెల్సియస్ వద్ద ఘనీభవింపజేస్తారు. ఈ మంచును ఒక బయోకెమికల్‌లో ముంచుతారు. ఈ కెమికల్స్ మానవ సురక్షితమే. ఈ రసాయనం పొరలాగా మంచు చుట్టూ అల్లుకుంటుంది. మంచుకరిగినప్పుడు నీరు బయటకు రాకుండా ఆపుతుంది. అప్పుడు ఆ నీరు ముద్దగా తయారువుతుంది. ఇలాంటి నీటి ముద్దలను ఇంతకుముందు లండన్ మారథాన్‌లో ఉపయోగించారు. అది చూసిన రిచార్డ్ ఇండియాలో కూడా దాన్ని పరిచయం చేయాలనుకున్నాడు. సాధారణ పద్ధతుల ద్వారా రోజుకు పది నుంచి 20 నీటి ముద్దలను తయారు చేస్తున్నట్టు రిచార్డ్ చెప్తున్నాడు. ప్రస్తుతం నీటి ముద్దలను తయారు చేసే మెషీన్‌ను తయారు చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. అది పూర్తయితే ఆ మెషీన్ నుంచి గంటకు పది నుంచి పదిహేను నీటి ముద్దలను ఉత్పత్తి చేయొచ్చు అని రిచార్డ్ చెప్తున్నారు. వంద మిల్లీ లీటర్ల నీటి ముద్ద రెండు రూపాయలు. అంతకన్నా తక్కువ సైజ్‌ఉంటే రూపాయికి విక్రయించవచ్చు అంటున్నాడు. బెంగళూర్‌కు చెందిన రిచార్డ్ మణిపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వర్మీకంపోస్టింగ్‌పై బయాలజీకల్ రీసెర్చ్ చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలోనే ఈ నీటి ముద్దల ఆలోచన వచ్చింది. వర్క్‌బెంచ్ ప్రాజెక్ట్ స్టార్టప్ సాయంతో ఈ నీటి ముద్దలను ఆయన తయారు చేశాడు.

637
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles