విందు భోజనం


Sun,May 12, 2019 01:32 AM

సాయంత్రం ఐదున్నరకి నేను నా అపార్ట్‌మెంట్ పైనున్న రూబ్ అపార్ట్‌మెంట్ డోర్ బెల్ కొట్టాను. మూడుసార్లు బెల్ కొట్టాక అతను తలుపు తెరిచాడు.హలో రూబీ! నీకు లివర్ ఇష్టం కదా? బోనీ షాపింగ్‌కి వెళ్ళింది. నేను ఒంటరిగా తినాలి. నువ్వు కూడా మా ఇంటికి రాత్రికి భోజనానికి రానేను ఉత్సాహంగా ఆహ్వానించాను.రూట్ మొహంలో ఆశ్చర్యం తొంగిచూసింది. కొద్దిగా సందేహించి తర్వాత అడిగాడు. నిజంగా పిలుస్తున్నావా పాల్?. అవును. ఉల్లిపాయలతో కలిపి వండిన లివర్. ప్రత్యేక వంటకం చెప్పాను.ఎల్మ్ స్ట్రీట్ షాపింగ్ ప్లాజాలో నేను మాంసం కోసే వృత్తిలో ఉన్నానని రూబీకి తెలుసు. రెండేండ్ల క్రితం బోనీకి, నాకు పెళ్ళి కాక మునుపు అతన్ని తరచూ భోజనానికి ఆహ్వానించే వాడిని.ఇప్పుడు రమ్మంటావా? అడిగాడు.
అవును. మనం బీర్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూంటే నేను లివర్ని వండుతాను.నేను నా అపార్ట్‌మెంట్‌కి తిరిగి వెళ్ళి ఆ ఫ్రాన్‌ను ధరించి ఫ్రిజ్‌లోంచి రెండు బీర్ కేన్స్‌ని తీసాను. రూట్ తలుపుమీద తట్టడం వినిపించి వెళ్ళి తలుపు తెరిచాను. లోపలకి వచ్చిన రూబీని అడిగాను.నా పెళ్ళికి మునుపు నువ్వు తలుపు తట్టకుండా సరాసరి వచ్చేసే వాడివి కదా? కొత్తగా మర్యాద నేర్చుకున్నావా?రూబ్ అందగాడు. చాలామంది అమ్మాయిలు అతనికి దగ్గరవాలని ప్రయత్నిస్తూండటం నాకు తెలుసు. అతని మొహంతో పోలిస్తే బోనీ లాంటి అందగత్తె నన్ను చేసుకోవడం నా గొప్ప అదృష్టం.నేను అతనికి బీర్ అందించి కూర్చోమని చెప్పి, అతని ఉద్యోగం గురించి ప్రశ్నించాను. రూబ్ ఓ ఫేక్టరీలో రాత్రి షిఫ్ట్‌లో పని చేస్తున్నాడు. అందువల్ల అతను పగలు స్వేచ్ఛగా ఉంటాడు. నేను లివర్ని తీసి కడుగుతూ అడిగాను.నా పెళ్ళయ్యాక మనిద్దరం ఇక్కడ ఇలా కలిసి చాలా కాలమైంది కదా? అవును. మీ దంపతులని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేక నవ్వి చెప్పాడు. బోని అందగత్తె కదా? అడిగాను.
Crime-katha

అవును, కాసేపట్లో వస్తుందా? అడిగాడు.రాదు. షాపింగ్ అయ్యాక స్నేహితురాలితో కలిసి భోజనం చేసి బహుశా సినిమా చూసి వస్తుంది. రూబ్! ఇది చాలా పెద్ద లివర్ కదూ? అడిగాను.అతను దాని వంక మామూలుగా చూసి నా వంక జాగ్రత్తగా చూస్తూ చెప్పాడు. నాకు నీలా మాంసం గురించి పెద్దగా తెలీదు. తినేదాకా లివర్ మంచిదో, కాదో చెప్పలేను దీన్ని వండాక తింటే నీకే తెలుస్తుంది నేను వెనక్కి తిరిగి ఆ లివర్నీ చాలా జాగ్రత్తగా చిన్నచిన్న ముక్కలుగా కోయసాగాను. మాంసం కోసే నాకు కత్తి పదును గురించి తెలుసు. మా ఇంట్లో అనేక రకాల పదునైన కత్తులు సదా ఉంటాయి. నేను మళ్ళీ అతనివైపు తిరిగి చెప్పాను.ఫ్రిజ్‌లోంచి ఇంకో బీర్ తీసుకో అతను నా కత్తికి అంటిన రక్తం వంక చూసాడు. అతని మొహంలోని భయాన్ని చూసి కత్తిని పక్కన పెట్టి నవ్వుతూ చెప్పాను. నువ్వు నా ఫ్రెండ్‌వి. నిన్నెందుకు చంపుతాను? నేను ఉల్లిపాయల సంచీలోంచి మంచి ఉల్లిపాయలని తీసి ఎంపిక చేసి చెప్పాను. ఉల్లిపాయలు నేను ఏడ్చేలా చేస్తాయి నువ్వు ఏడ్చే రకానివే రూబ్ చెప్పాడు.
కాదు. ఉల్లిపాయలు నా కళ్ళ వెంట నీళ్ళు కారేలా చేస్తాయి. ఇంకేదైనా నేను ఏడ్చేలా చేస్తే మాత్రం నేను తగిన చర్య తీసుకుంటాను. అంటే, ఏదైనా చేయగలను. అంతేకాని కూర్చుని ఏడవను నేను రూబ్ కళ్ళల్లోకి చూసి నవ్వితే అతను కళ్ళు తిప్పుకుని నవ్వాడు. కానీ, అతనికి నా సంభాషణ నచ్చినట్లుగా నాకు తోచలేదు.

నేను పదునైన కత్తితో కళ్ళ వెంట నీళ్ళు కారుస్తూ ఉల్లిపాయల్ని కోసాను. తర్వాత బాణలి తీసి స్టవ్‌మీద ఉంచాను. సలాడ్ని ఇందాకే చేసాను. నీకు లివర్ గ్రేవీ అంటే ఇష్టం కదూ? బాగా. అది నీకు తెలుసు సరే. గ్రేవీ కూడా చేస్తాను. దానికి సీజనింగ్ చేస్తే చెడ్డ రుచిని అది మరుగుపరుస్తుంది రూట్ ఫ్రిజ్‌లోంచి మళ్ళీ బీర్ కేనన్‌ని బయటకి తీసాడు. బాణలి వేడెక్కాక దాంట్లో ఉల్లిపాయలు, లివర్, మార్గరైన్ ముక్కలని వేసాను. రూబ్. నువ్వు పగలంతా ఏం చేస్తావు? అంటే నేను పగలంతా పని చేసి రాత్రుళ్ళు నిద్రపోతాను. నువ్వు పగలంతా నిద్రపోవుగా? లేదు. నేను మధ్యాహ్నం ఒంటిగంట దాకా పడుకుని లేస్తాను రూబ్ చెప్పాడు. ఏదైనా చేయడానికి నీకు చాలా సమయం దొరుకుతుంది కదా? ఎవర్నయినా కలవచ్చు. బహుశ నిన్ను కలవడానికి ఓ ఆడది కూడా ఉండి ఉండాలి. బహుశ ఆఫీస్‌కి వెళ్ళే భర్త ఉన్న ఓ భార్య. అప్పుడు నీకు ఆమెతో గడపడానికి చాలా సమయం దొరుకుతుంది కదా? అతను నా వంక సీరియస్‌గా చూసి చెప్పాడు. లేదు. మొగుడున్న అమ్మాయిలతో పెట్టుకోను. అది భద్రం కాదు అవును. అది భద్రం కాదు ఒప్పుకున్నాను. వండుతూంటే ఉల్లిపాయలతో కలిసి ఉడికే లివర్ ఘుమఘుమ వాసన వేయసాగింది. రూబ్! సలాడ్ ఎక్కడుందో నీకు తెలుసు. తీసి బల్లమీద ఉంచు. ఆ సమయం ఆదా అవుతుంది సూచించాను. అలాగే రూబ్ తన నల్లటి కళ్ళతో నా వంక జాగ్రత్తగా చూసాడు. నేను లివర్, ఉల్లిపాయలని ఓ ప్లేట్లోకి వేసి దాన్ని బల్లమీద ఉంచాను. రూట్ సలాడ్, ప్లేట్, చెంచాలు, ఫోర్క్స్‌ని బల్ల మీద ఉంచాడు. ఇంకో రెండు బీర్లు తీయి కోరాను.తర్వాత నేను పిండి, పాలు, ఇతర సుగంధద్రవ్యాలతో రూబ్‌కి ఇష్టమైన గ్రేవీని చేసాను. తర్వాత మేషై పొటాటోలని స్టవ్ మీద ఉంచి వేడి చేసాను. ఇద్దరం కూర్చున్నాం. అతను లివర్, ఉల్లిపాయ ముక్కలని కలిపి కొరికి తినడం గమనించాను.
వావ్! ఇదీ వంటంటే. నువ్వు ఎన్నడూ ఇంత రుచికరమైన వంటని చేయలేదు ఆనందంగా చెప్పాడు.

నచ్చిందా? ఆనందం.. సంతోషంగా చెప్పాను. రూట్ బంగాళాదుంపలు, గ్రేవీలని కలిపి ప్లేట్లో పోసుకున్నాడు. మేము ఆ రుచిని అనుభవిస్తూ స్నేహపూర్వక నిశ్శబ్దంతో కొద్దిసేపు తింటూండి పోయాం. ఇద్దరం చెరో మూడు ముక్కలని తిన్నాక ప్లేట్‌లో ఇంకా ఒకటి మిగిలి ఉంది. రూబ్! నువ్వు తిను. నాకు కడుపు నిండిపోయింది చెప్పాను. అతను మొహమాట పడకుండా తీసుకుని తిన్నాడు. ఇంత రుచి ఎలా వచ్చింది? ఆసక్తిగా అడిగాడు. చెప్పనా? ఇది ప్రత్యేకమైన లివర్. చాలా అరుదైంది కూడా. ఇంతకు ముందు ఇలాంటి లివర్‌ను నేను ఎన్నడూ కోయలేదు అంటే? ఇది దేని లివర్? అడిగాడు. నువ్వు చెప్పుకోగలవేమో చూడు తెలీదు. నువ్వే చెప్పు కొద్దిసేపు ఆలోచించి చెప్పాడు. నేను ఎవరికీ చెప్పకూడదు. నీకు చెప్తే నువ్వు ఇంకెవరికైనా చెప్పొచ్చు. అప్పుడు ఇద్దరం పెద్ద కష్టంలో పడతాం నెమ్మదిగా గుసగుసగా చెప్పాను. ఎవరికీ చెప్పను. దేని లివర్? మేకది కాదు. ఏనుగు లాంటి మనం ఎన్నడూ తినని జంతువుదా? నేను తల అడ్డంగా ఊపి నిట్టూర్చాను.
నేను చెప్పడం ఇద్దరికీ మంచిది కాదు. అది న్యాయం కూడా కాదు సరే. చెప్పొద్దు. దేని లివరైనా సరే నువ్వు గొప్ప రుచికరమైన కొత్త లివర్‌ను వండావని అందరితో చెప్తాను నవ్వి చెప్పాడు. రూబ్! నాకు చాలా సమస్యలు ఉన్నాయి ప్లేట్లని సింకులో ఉంచుతూ చెప్పాను.ఏం సమస్యలు?ఆడవాళ్ళతో. నీకు అబద్ధం చెప్పాను. బోని షాపింగ్‌కి వెళ్ళలేదు మరి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికీ వెళ్ళలేదు మరి? ఇంట్లో ఎక్కడ ఉంది? ఇంట్లో ఎక్కడా లేదు బయటా, ఇంట్లో కూడా లేకపోవడం ఏమిటి?
ఇక ఎక్కడా ఉండదు. నేను బోనీని నా ప్రాణం కన్నా అధికంగా ప్రేమించాను. నేను మార్కెట్‌లో మాంసాల మధ్య పని చేస్తూంటే, ఎవరో కాముకుడు నా అపార్ట్‌మెంట్ కి వచ్చి వెళ్తున్నాడు. ఆమె అతన్ని మా ఇంట్లోకి రానిస్తోంది
నేను అది నమ్మను. బోనీ అలాంటిది కాదు. అతను ఎవరో తెలుసా? రూబ్ ఓ గుటక వేసి చెప్పాడు.ఇంకా లేదు. కాని తప్పక కనుక్కుంటాను. అందుకు నేనో డిటెక్టివ్‌ని నియమించాను. కనుక్కున్నానని, రేపు రిపోర్ట్ ఇస్తున్నానని చెప్పాడు
నిజంగా? నీకు తెలిసిన ఎవరైనానా?అతను ఎవరో ఇంకా తెలీనప్పుడు నీ ప్రశ్నకి జవాబు ఎలా చెప్పగలను? తెలుసుకున్నాక బోనీని ఏం చేసానో వాడినీ అదే చేస్తాను బోనీకి చేసిందా? బోనీని ఏం చేసావు పాల్? అతను పాలిపోయిన మొహంతో అడిగాడు.

రూబ్! ఈ లివర్ చాలా రుచిగా ఉంది కదా? రూబ్ నా వంక చూస్తూంటే అతని కళ్ళు విశాలం అవసాగాయి. నేను విశదంగా చెప్పను కానీ, అది అంత మృదువుగా, రుచిగా ఉంటుందని ఎన్నడూ అనుకోలేదు వెంటనే రూబ్ లేచి సింక్ దగ్గరకి పరిగెత్తి వాంతి చేసుకున్నాడు. తర్వాత మొహం కడుక్కుని నావైపు చూసి చెప్పాడు. నీకు పిచ్చెక్కింది పాల్ కావచ్చు. నువ్వు కూడా నాలా మాంసాల మధ్య రోజుకి ఎనిమిది గంటలు పని చేస్తే నువ్వూ నాలానే ప్రవర్తించే వాడివి. బోనీ ఇక్కడికి రానిచ్చిన వాడి పేరు రేపు తెలీగానే మరోసారి నిన్ను భోజనానికి పిలిచి నీకు చక్కటి లివర్ పార్టీని ఇస్తాను. ఆ తర్వాత నువ్వు ఎన్నడూ మళ్ళీ అంత రుచికరమైన లివర్‌ను తినలేవు నువ్వు పరమ కిరాతక పిచ్చివాడివి చెబుతూ రూబ్ భయంగా నా అపార్ట్‌మెంట్లోంచి వేగంగా బయటకి పరిగెత్తాడు. నేను నిశ్శబ్దంగా సిగార్‌ను వెలిగించాను. భోజనం తర్వాత, ముఖ్యంగా ఇలాంటి భోజనం తర్వాత సిగార్ తాగితే బావుంటుంది. ఆ లివర్ చాలా రుచిగా, చాలా మృదువుగా ఉడికింది.
సిగారైన కాసేపటికి, నేను ఊహించినట్లుగానే రూబ్ తన సామానుతో కారులోకి ఎక్కడం కిటికీలోంచి చూసాను. అరగంట తర్వాత నా అపార్ట్‌మెంట్ తలుపు తెరచుకున్న చప్పుడు వినిపించింది. బోనీ చేతుల నిండా షాపింగ్ బ్యేగ్స్‌తో నా దగ్గరకి వచ్చింది. ఆమె సింక్‌లోని గిన్నెలని, వాంతిని చూసి అడిగింది.ఏమిటిది? ఏం జరిగింది? నేను రూబీని భోజనానికి పిలిచాను. లివర్ తిన్నాక వాడికి అది ఆవుదూడ లివర్ అని చెప్పగానే ఎందుకో వాంతైంది రూబ్? ఆమె నా వంక అయోమయంగా చూస్తూ అడిగింది. అవును. వీడ్కోలు డిన్నర్ ఇచ్చాను. అతను ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడు చెప్పాను. ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడా? ఆశ్చర్యంగా అడిగింది.అవును. నీకు చెప్పలేదా? మంచి మిత్రుడు దూరం అవడం నాకు బాధగా ఉంది... అతను మంచి మిత్రుడు. అవునా? అడిగాను. అవును తటపటాయిస్తూ చెప్పింది. ఏం కొన్నావో చూపించు కోరాను. ఓ భర్త తన భార్య కొన్నవి చూడాలనుకుంటాడు. ముఖ్యంగా ఆ భర్త ఆ భార్యని తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తూంటే.
(ఇంక్రాండల్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి

558
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles