మంత్రం నేర్చుకునే మార్గం


Sun,May 12, 2019 01:23 AM

ఒక రాజు దగ్గర వివేకవంతుడైన మంత్రి ఉండేవాడు. ఒకరోజు మంత్రి రాజు దగ్గరికి వచ్చి నమస్కరించి మహారాజా! నేను ఒక పనిమీద దూరం వెళుతున్నాను. దయచేసి నాకు ఆరు నెలలు సెలవు మంజూరు చెయ్యండి అన్నాడు. రాజు ఆశ్చర్యపడి మంత్రీ! మీరు ఆరు నెలలు సెలవు అడుగుతున్నారంటే ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది. మీ కుటుంబాన్ని దూర ప్రాంతానికేమైనా తరలిస్తున్నారా? అన్నాడు.మంత్రి కాదు రాజా! అని బదులిచ్చాడు.రాజు మరయితే ఏదైనా తీర్థయాత్ర చెయ్యడానికి సకుటుంబంగా వెళుతున్నారా? అన్నాడు.మంత్రి లేదు రాజా! నేనొక్కన్నే వెళుతున్నాను అన్నాడు.రాజు అట్లా అయితే అది తప్పక అతి ముఖ్యమైన పనే అయి ఉంటుంది. అది నాతో చెప్పకూడని రహస్యమా? అన్నాడు.మంత్రి ఇందులో రహస్యమేమీ లేదు. నేను గాయత్రీ మంత్రం నేర్చుకోవడానికి వెళుతున్నాను. అందుకని సెలవు కోరాను అన్నాడు.రాజు విస్తుపోయి గాయత్రీ మంత్రం చాలా చిన్నది కదా! దాన్ని నేర్చుకోవడానికి ఆరునెలలు పడుతుంది అంటున్నావు. నాకిది వింతగా ఉంది అన్నాడు.మంత్రి మౌనంగా ఉన్నాడు.రాజు గాయత్రీ మంత్రం నేను చెబుతాను.ఓం భూర్బువస్సువః తత్సత్వితుర్వరేణ్యంభర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్..ఇదే కదా దీన్ని నేను పట్టుమని పది నిమిషాల్లో నేర్చుకున్నాను. నీకయినా అంతే సమయం పడుతుంది కదా! అన్నాడు.మంత్రి నేర్చుకోవడానికి.. గ్రహించడానికి చాలా తేడా ఉంది రాజా. మీరు కంఠంతో పట్టారు.
katha--mantram

తప్పు లేకుండా చదివారు. కానీ అంతఃస్సారం ఆత్మగతం కావడానికి నేర్చుకోవడానికి చాలా తేడా ఉంది అన్నాడు.రాజుకు మంత్రిమాటలు అర్థం కాలేదు.మంత్రీ! నీ మాటలు బోధపడలేదు. నువ్వు సోదాహరణంగా వివరించడానికి ప్రయత్నించు అన్నాడు.మంత్రి ఎవరక్కడ! అని పిలిచాడు. వెంటనే ఇరువురు సైనికులు అక్కడికి వచ్చారు.మంత్రి మీరు వెంటనే రాజుగారిని బంధించి అక్కడున్న చెట్టుకు కట్టేయ్యండి అన్నాడు.భటులు తటపటాయించారు. మంత్రి మాటలతో రాజు కళ్ళు ఎర్రబడ్డాయి. కోపం కట్టలు తెంచుకుంది.వెంటనే మంత్రిని బంధించి అక్కడున్న చెట్టుకు కట్టేయ్యండి అని ఆజ్ఞాపించాడు. రాజుగారి మాటలతో వెంటనే సైనికులు మంత్రిని చెట్టుకు కట్టేశారు.అప్పుడు మంత్రి నవ్వాడు.ఎందుకు నవ్వుతున్నావు? అని అడిగాడు.మంత్రి రాజా! నేను చెప్పిన మాటలు, మీరు చెప్పిన మాటలు ఒక్కటే! కానీ మీ మాటలకు విలువయిచ్చి భటులు వెంటనే నన్ను బంధించారు. నా మాటల్ని లక్ష్యపెట్టలేదు. మీ మాటలు సాధికారికమైనవి. అట్లాగే మీరు గాయత్రి మంత్రాన్ని కేవలం వల్లె వేశారు. వల్లె వెయ్యడానికి ఒంట బట్టించుకోవడానికి చాలా తారతమ్యముంది. కంఠతా పట్టడానికి నిమిషాలు పట్టవచ్చు. ఆత్మగతం చేసుకోవడానికి, గ్రహించడానికీ ఉన్న తేడా అది. మంత్రాన్ని పెదాలు ఉచ్ఛరిస్తున్నాయా? అవి మనసు లోతుల నించి వస్తున్నాయా? అన్నది ముఖ్యం. అందుకనే మీరు మంత్రం మీద సాధికారికత పొందలేదని అన్నాను. సోదాహరణగా ఉదహరించమంటే ఇలా చెయ్యాల్సి వచ్చింది మన్నించండి అన్నాడు.రాజు మంత్రి కట్లు విప్పి కౌగిలించుకుని మంత్రి కోరినన్ని రోజులు సెలవు మంజూరు చేశాడు.

-సౌభాగ్య

263
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles