నెట్టిల్లు


Sun,May 12, 2019 01:20 AM

ప్రేమను నిర్వచించడానికి అక్షరాలు చాలవు. పాతతరం అంతా కవిత్వం, పద్యం, కథల ద్వారా ప్రేమను నిర్వచించారు. ఈ తరం మాత్రం దృశ్యమాధ్యమాన్ని ఎంచుకున్నారు. కాల్పనికాలైనా, నిజజీవిత కథలైనా ఇప్పుడు వస్తున్న వాటిలో ప్రేమ కథలు ఎక్కువగా ఉంటున్నాయి.. ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్‌లో వస్తున్న వంద షార్ట్ ఫిలిమ్స్‌లో తొంభైకి పైగా ప్రేమ కథలే ఉండడం ఇందుకు ఉదాహరణ. ఈవారం యూట్యూలో విడుదలై హిట్టు కొట్టిన కొన్ని షార్ట్‌ఫిలిమ్స్ రివ్యూ..

ద మిస్టేక్ ఐ డూ

దర్శకత్వం: రాజా అరుణ్
నటీనటులు : సంతోష్, పవిత్ర
తన ఫ్రెండ్ ముందు ధూమపానం చేసిందని గర్ల్ ఫ్రెండ్‌కి కాల్ చేసి గొడవపడతాడు. అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు కారణం వాళ్ల అలవాట్లేనని నిర్ణయించేశాడు. స్నేహితుడు కదా అని ఇంటికి రూమ్‌కి పిలిస్తే తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు. దాన్ని తార తిప్పి కొడుతుంది. ఈతరం అమ్మాయిలు ఎలా ఉండాలో ఆ అమ్మాయిని చూస్తే అర్థ్ధం అవుతుంది. సాన్నిహిత్యం ఉన్నంత మాత్రాన శారీరకంగా బలపరుచుకోవడం అంటే పొరపాటని చెప్పే అతని చేష్టలను తిప్పి కొడుతుంది. కార్తీక్ మాత్రం అమాయకుడిగా ప్రవర్తిస్తాడు. అమ్మాయి ఎంత అందంగా ఉన్నా.. అమ్మాయిని చూస్తరు. అందాన్ని చూడరు అని చెప్పే అమ్మాయి ఒకానొక రోజు అతడి చేతిలో లొంగాల్సి వస్తుంది. కారణం ఇద్దరూ ఇంట్లో పార్టీ చేసుకొని మత్తులో ఊగుతున్నప్పుడు అదే అదును చూసి అమ్మాయిని లొంగదీసుకుంటాడు. ఆడతనం అంటే ఏంటో తెలుసుకోవడానికి అదే ఆడతనాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఆమె తెలుసుకున్నది. మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. తార యాక్టింగ్ బాగుంది.
the-mistake

Total views 441,002+(మే 4 నాటికి) Published on Apr 30, 2019

ఎలా చెప్పను

దర్శకత్వం: ప్రవీణ్ చందోలు
నటీనటులు : విజయ్,
మహి రాజ్‌పుత్
విక్రమ్ తెల్లారితే లండన్ వెళ్లిపోవాలి. మూడు నెలల నుంచి ఇష్టపడ్డ అమ్మాయితో తన ప్రేమ విషయం చెప్పకుండా ఉన్నాడు. కారణం ఆమె ఎక్కడ నో అంటుందో అన్న భయం. ఎలాగైనా ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయి కాఫీ షాప్‌కు వెళ్లి కూర్చుంటాడు. ప్రపోజ్ చేయాలని అనిపిస్తుంది. కానీ ధైర్యం చాలదు. ఐదు అవకాశాలివ్వమని ఆ దేవుడిని కోరుకుంటాడు విక్రమ్. అనుకున్నట్టుగానే ఐదుసార్లు దగ్గరికి వెళ్లి ప్రేమ విషయం చెప్పాలని అనుకుంటాడు. ఎలా చెప్తే వర్కవుట్ అవుతుందో అని చాలా ఆలోచిస్తాడు. కాఫీషాప్‌లోనే అమ్మాయి దగ్గరికి వెళ్లి పదినిమిషాలు మాట్లాడాలని అడుగుతాడు. మాటల్లో పెట్టి ప్రపోజ్ చేస్తాడు. భూమి పుట్టుక నుంచి స్త్రీ మనుగడ గురించి వారి మీద ఉన్న తన అభిప్రాయాన్ని అమ్మాయి ముందు వ్యక్తపరుస్తాడు. అయితే తన ప్రేమ గురించి అమ్మాయి రియాక్ట్ అయ్యేటప్పుడు అతని గురించి ఆమె చెప్పే విషయాలకు షాక్ అవుతాడు. ఇక్కడే ట్విస్టులుంటాయి.
elacheppanu

Total views 27,249+(మే 4 నాటికి) Published on May 3, 2019

మిస్టర్ అండ్ మిస్సెస్

నటీనటులు : కార్తీక్ కిట్టు, శివరంజని, సత్యరాజ్, సూర్య
దర్శకత్వం: వివేక్ అండ్ కార్తీక్
కొత్తగా అపార్ట్‌మెంట్‌లో రెంటుకు దిగిన ఫ్యామిలీ పక్క ఫ్లాట్ వాళ్లను పాలు పొంగియ్యడానికి ఆహ్వానిస్తారు. అయితే అక్కడ ఇద్దరి భార్యల పేర్లు సేమ్ ఉంటాయి. మనం ఎదుటివారికి ఏం చేయాలనుకుంటామో మనకు అదే లభిస్తుంది. దాన్ని కర్మ అంటారు. అదే కర్మను అనుభవిస్తాడు. పక్కింటి ఆవిడ వల్ల తన భార్య లైఫ్‌స్టయిల్‌లో మార్పు వస్తుందన్న విషయాన్ని గమనించలేకపోతాడు. రోజురోజుకూ ఖర్చులు పెరగడం వల్ల గాభరా పడతాడు. కానీ నిజాన్ని తెలుసుకోలేకపోతాడు. ఒకరికి నష్టం చేయాలనుకున్న తనకు నష్టం జరుగుతుందన్న విషయంలో కళ్లు తెరువలేకపోతాడు.ఇక్కడ అపార్ట్‌మెంట్‌లో ఒకే చోట ఇండ్లు కొన్న జంటలు ఇంతకు ముందు కూడా వేరేచోట ఒకేదగ్గర ఉండేవారని ఆలస్యంగా తెలుసుకుంటారు. అయితే కథలో, కథనంలో కొత్తదనం ఏం లేదు. ఒక్కసారి చూడొచ్చు. మేకింగ్‌లో క్వాలిటీ మెయింటేన్ చేస్తే బాగుండేది.
mr-and-mrs

Total views 62,367+(మే 4 నాటికి) Published on Apr 29, 2019

రాధా గోపాళం

దర్శకత్వం: సంతోష్ మీసాల
నటీనటులు : ఆర్యవర్దన్ రాజ్,
రాజేశ్వరి పమిడిఘంటం
భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్యత, చిగురించే ప్రేమను చక్కటి మాటల ద్వారా తెలియజేశాడు దర్శకుడు. ఈ సృష్టిలో వినిపించని సవ్వడులు ఎన్నో ఉన్నాయని చెప్తుంది భార్య. ఒక గదిలో భార్యభర్తలిద్దరూ కూర్చొని మాట్లాడుకునే మాటల్ని ఈ షార్ట్‌ఫిలింగా రూపొందించారు. ఈ షార్ట్‌ఫిలిం చూస్తుంటే ఆ బంధంలో గాఢత కనిపిస్తుంది. మాట వరసకు పండగకి తెచ్చిన చీర అనడంతో ఇరుకున పడతాడు భర్త. అసలు ఏ పండుగకు తనకు చీర తెచ్చావని మొదలైన సంభాషణ ప్రేమతో చిన్ననాటి మిత్రుల దగ్గరికి వెళ్తుంది. బాల్యంలో చిగురించిన ప్రేమ నుంచి తను ప్రేమించిన అమ్మాయిలు, వెంటపడ్డ క్లాస్‌మేట్స్ ఇలా ఎన్నో విశేషాలు మాట్లాడుకుంటారు. అంతలోనే భార్య ఇంటిలోకి వెళ్లి కొత్త చీర కట్టుకొని వస్తుంది. ఇద్దరి సంభాషణ తర్వాత ఆ చీర భర్త తెచ్చిందే అని తేలుతుంది. ఆ చీరతో పాటు తను కూడా తనదవ్వాలని కోరుకునే పురుషులు అందరూ ఇలాగే ఆలోచిస్తారు. మంచి భావం ఉన్న చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. చాలా సూటిగా విషయాన్ని చెప్పాడు.
radha-goplam

Total views 7,821+(మే 4 నాటికి) Published on May 3, 2019

-అజహర్ షేక్, సెల్: 9963422160

174
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles