రాశి ఫలాలు


Sat,May 11, 2019 10:59 PM

12-5-2019 నుంచి 18-5-2019 వరకు

మేషం

భార్యాపిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. విందులు, వినోదాలకు, సమావేశాలకు హాజరవుతారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారికి కలిసివస్తుంది. రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగంలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.శ్రద్ధతో పనులు చేస్తే సత్ఫలితాలు పొందుతారు. ముఖ్య గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి దీర్ఘకాలిక నిర్ణయాలు, పెద్ద మొత్తంలో పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది. శుభకార్యాలు, ఉన్నతవిద్య కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు. పెద్దల సూచనలు తప్పక పాటించాలి.

వృషభం

శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు ఉన్నత విద్య అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం సరదాగా, హాయిగా గడుపుతారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. సాహిత్య, సినిమా రంగాలలోని వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. తోటి ఉద్యోగులతో మనస్పర్థలు ఉంటాయి. ఇష్టంలేని పనులు చేయాల్సి వస్తుంది. పనులలో ఆలస్యం జరుగుతుంది. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవచ్చు. ప్రయాణాలు కలిసి రాకపోవచ్చు. ఆలోచించి పనులు మొదలెట్టాలి.

మిథునం

కార్యాలయంలో అందరితో సత్సంబంధాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. నిత్యావసర వస్తు, వ్యాపారం, వడ్డీ, షేర్, హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ మొదలైన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. భార్యా పిల్లలతో సంతోషంగా గడుపుతారు. సినిమాలు, విందులకు హాజరవుతారు. కొత్త వస్త్ర, వస్తువులను కొనే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తికాకపోవచ్చు.

కర్కాటకం

విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. పోటీ పరీక్షలలో నెగ్గుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారు సంతృప్తిగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. పెద్దల సహాయ సహకారాలు అన్ని విధాలుగా తోడవుతాయి. తీర్థయాత్రలు, నదీస్నానాలను ఆచరిస్తారు. పనివారితో ఇబ్బందులు తొలగుతాయి.

సింహం

స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములతో సంబంధాలు వృద్ధి అవుతాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. రాబడి పెరుగుతుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మానసిక సంతృప్తి ఉంటుంది. ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తోటి ఉద్యోగులతో మనస్పర్థలు గోచరిస్తున్నాయి. పనివారితో ఇబ్బందులు ఎదురవొచ్చు. డబ్బు సకాలంలో చేతికి అందకపోవచ్చు.

కన్య

ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రోజువారీ వ్యాపారాలు లాభిస్తాయి. భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. విందులు, వినోదాలకు ప్రాధాన్యం ఇస్తారు. హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తికాకపోవచ్చు. శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలున్నాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

తుల

ముఖ్య గ్రహాలైన గురు, శని, కేతు అనుకూలంగా సంచరిస్తున్నారు. కాబట్టి శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. పనివారితో ఇబ్బందులు దూరమవుతాయి. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు, నదీస్నానాలు ఆచరిస్తారు. తోటి ఉద్యోగులతో మనస్పర్థలు ఉండొచ్చు.

వృశ్చికం

ముఖ్య గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఏల్నాటి శని, జన్మస్థాన గురు సంచార ప్రభావం ఉంటుంది. దీంతో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ వారం ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో కొంత అనుకూలత ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలుంటాయి. రోజువారీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రారంభించిన పనులు ముందుకు సాగకపోవచ్చు. శుభకార్యాల ప్రయత్నాలలో విఘ్నాలున్నాయి. పనివారితో సమస్యలు ఎదురుకావొచ్చు.

ధనుస్సు

ముఖ్య గ్రహాలన్నీ ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు పనివారితో ఇబ్బందులు ఎదురవొచ్చు. పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించాలి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తోటి ఉద్యోగులతో మనస్పర్థలు ఎదురుకావొచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక పోవచ్చు. దీంతో నిరాశ, నిస్పృహకు లోను కావొద్దు. సమస్యలతో పనులు వాయిదా పడతాయి. వృథా అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పెద్దల సూచనలు తప్పక పాటించాలి.

మకరం

వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఇంజినీరింగు, ఉపాధ్యాయ, పారిశ్రామిక రంగాలలోని వారు మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. శుభకార్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి పేరు సంపాదిస్తారు. మంచి వారితో స్నేహం కలిసివస్తుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులు మంచి దిగుబడులను పొందుతారు.

కుంభం

ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. రావాల్సిన డబ్బు అందుతుంది. పనివారితో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో తోటి వారితో సంబంధాలు బలపడతాయి. రాజకీయంలో ఉన్న వారికి అందరి సహాయ సహకారాలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు, నదీస్నానాలు ఆచరిస్తారు. కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి పనిభారం పెరుగుతుంది. అయినా లాభదాయకంగా ఉంటుంది.

మీనం

రోజువారీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నిత్యావసర వస్తు, షేర్, వడ్డీ, హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్యాలు మొదలైన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడతారు. న్యాయవాద, ఉపాధ్యాయ, వైద్య వృత్తులలో ఉన్న వారు సంతృప్తిగా ఉంటారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. కొత్త వస్త్ర, వస్తు, ఆభరణాలను కొంటారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in

909
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles