ఒళ్లంతా రామనామమే!


Sat,May 4, 2019 10:50 PM

ఒక్కొక్కరిది ఒక్కో రకమైన అభిరుచి అని చాలామంది అంటుంటారు. ఈ కథనంలోని మనుషులు కూడా ఆ కోవకు చెందినవారే. రామ్‌నామీస్ అనే తెగకు చెందిన వీరు ఒళ్లంతా రామనామం పచ్చబొట్టుగా పొడిపించుకుంటారు. ఇంతకీ వీరెక్కడుంటారు? ఎందుకలా పొడిపించుకుంటారో తెలియాలంటే ఈ కథనం చదువండి.

చత్తీస్‌గడ్.. దేశంలోని 29 రాష్ర్టాల్లో ఇదొకటి. మిగతా రాష్ర్టాలతో పోలిస్తే.. ఇక్కడ సంప్రదాయాలు, లైఫ్‌ైస్టెల్ కాస్త వైవిధ్యంగా ఉంటుంది. మూఢనమ్మకాలు కూడా ఎక్కువే. ఇక్కడ రామ్‌నామీస్ అనే ఒక తెగ ఉంది. వీరు దళితులు. రామ్‌నామీ సమాజ్ మత ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నది. వీరిని హిందూ మతంలో తక్కువజాతి వారిగా భావిస్తారు. దీంతో వీరికి ఆలయాల్లోకి ప్రవేశం ఉండేది కాదు. వందల ఏండ్లుగా గుడికి, బడికి దూరంగా ఉంచబడ్డారు. గుడిలోకి ప్రవేశించి దేవుడిని చూసే అర్హత లేకపోవడం వల్ల.. దేవుడి పేరును ఒళ్లంతా పచ్చబొట్టు రూపంలో ముద్రించుకుంటారు. దేవుడు మాలోనే ఉన్నాడు. మా శరీరంలోనే కొలువై ఉన్నాడు. దేవుడు ఏ కులం, ఏ మతానికి చెందిన వాడు కాదు. ఈ సృష్టిలోని ప్రతీ అణువులో దేవుడున్నాడు. నీలో ఉన్నాడు.. నాలో ఉన్నాడు. నా శరీరంలోని ప్రతీ అణువులో దేవుడున్నాడు అని నమ్ముతూ ప్రచారం చేస్తారు. వందల ఏండ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్న రామ్‌నామీస్ చత్తీస్‌ఘడ్‌లోని జంగాహాన్ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తారు. వీరి శరీరంలో ఎక్కడ చూసినా పచ్చటి అక్షరాలతో కూడిన రామనామమే కనిపిస్తుంది. రామనామం పచ్చబొట్లు వేయించుకునే క్రమంలో చాలాసార్లు చాలామంది రక్తస్రావమై చనిపోయారు కూడా. అయినా పచ్చబొట్టు వేయించుకోవడం మాత్రం మానలేదు. పచ్చబొట్టు వేయించుకునే సమయంలో తీవ్ర రక్తస్రావమై చనిపోయే ప్రమాదాన్ని జయించి బతికారంటే.. రామ్‌నామీస్ దాన్ని పునర్జన్మగా భావిస్తారు.
Rama

కుల వ్యవస్థ బలంగా ఉన్న మన దేశంలో అత్యంత అణచివేయబడ్డ జాతుల్లో వీరొకరు. శరీరమంతా రామనామంతో పచ్చబొట్టు పొడిపించుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. నొప్పి బాధిస్తున్నా.. రక్తం కారుతున్నా భరిస్తూ.. తమ ఆచారాన్ని తప్పకుండా పాటిస్తుంటారు. ఒక్కోసారి ఆరునెలల కాలాన్ని సైతం పచ్చబొట్టు వేయించుకోవడానికే వెచ్చిస్తారు. గ్యాస్‌నూనె దీపం నుంచి వచ్చే మసికి, నీళ్లు కలిపి సూదులతో పచ్చబొట్టు వేసుకుంటారు వీరు. నాగరిక సమాజానికి ఇంత దూరంగా బతుకుతున్నప్పటికీ, అనాగరిక ఆచారాలు పాటిస్తున్నప్పటికీ వీరికి ఎలాంటి చెడు అలవాట్లు ఉండవు. ఒళ్లంతా రామనామం పచ్చబొట్టు వేయించుకోవడంతో తమలో దేవుడు నిండి ఉన్నాడన్న నమ్మకంతో మద్యం, మాంసం, వేశ్యల జోలికి వెళ్లరు. నిత్యం రామనామం జపిస్తూ ఉంటారు. వీరి పేర్లలో కూడా చివర్లోనో, మొదట్లోనో తప్పకుండా రామ్ అని ఉంటుంది.
Rama1

475
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles