నిజం..నిప్పు.. ఓ పెయింటింగ్!


Sat,May 4, 2019 10:47 PM

ఈ ప్రపంచంలో జరిగే ఎన్నో సంఘటనలు.. మొదటిగా అశాస్త్రీయ కోణంలోనే సమాజానికి పరిచయమవుతాయి. వాటికి ఎక్కడ లేని ప్రాముఖ్యం వచ్చిపడుతుంది. జనమూ వాటిని నమ్ముతారు. అలాంటి సంఘటనలు దావానంలా వ్యాపిస్తాయి. నిజాలు మరుగున పడతాయి. అబద్దాలు రాజ్యాన్ని చుట్టివస్తాయి. అందుకే నిజం నిప్పులాంటిది! ఆలస్యంగానైనా తెలుస్తుంది. అలాంటిదే ది క్రయింగ్ బాయ్ మిస్టరీ.

అది 1985వ సంవత్సరం..

ది సన్ అనే బ్రిటన్ పత్రిక వార్తలు లేక.. సర్క్యులేషన్ పడిపోయి.. యాడ్స్ రాక మూసివేసే స్థితికి వచ్చింది. అదే ఏడాది సెప్టెంబర్ 5న.. 50 అగ్ని ప్రమాదాలకు కారణం ఒకే పెయింటింగ్ అనే వార్తను పబ్లిష్ చేసింది. ఆ వార్త దావానంలా వ్యాపించింది. ఆ తర్వాత వరుస కథనాలు పబ్లిష్ అయ్యాయి. ఆ ఫొటో ఎక్కడ ఉంటే.. ఆ ఇంట్లో అగ్నిప్రమాదాలే..! ఆ ఫొటో ఎవరి ఇంట్లో పెట్టుకుంటే అక్కడ వినాశనమే! వారి జీవితాల్లో చీకటే!.. ఆ పెయింటర్ ఎవరు? ఆ పెయింటింగ్ నేపథ్యం ఏంటి? అంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. పెయింటింగ్.. పెయింటర్ మధ్యనే కథంతా తిరిగింది. ఆ రహస్యం దాదాపు యాభై యేండ్ల పాటు ఎవరూ ఛేదించలేనిదిగా మిగిలిపోయింది. అసలేం జరిగింది? ఈ అగ్నిప్రమాదాలకు, ఆ పెయిటింగ్‌కు ఏంటి లింక్? ఇది నిజంగానే మానవాతీత శక్తి పనా? లేక సైన్స్‌కు అర్థం కాని మర్మమా? అంటూ ఈ నిజాన్ని లోకానికి చెప్పడానికి కదిలాడో వ్యక్తి. అతనే మైకేల్.

అసలేం జరిగిందంటే..?

అది 1985.. ఫ్లోరిడాలోని ఒక ఇంట్లో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లోవాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఇంట్లో నిప్పు అంటుకోవడానికి కారణాలేంటో దొరకలేదు. కట్‌చేస్తే.. క్షణాల్లో ఇల్లు మొత్తం బూడిదైపోయింది. అది మామూలు ప్రమాదం కాదు. ఏదో జరిగింది అని లోపలికి వెళ్లి చూసిన ఫైర్‌ఫైటర్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. కారణం.. ఇంట్లో వస్తువులన్నీ కాలిపోయినా ఒక పెయింటింగ్ మాత్రం చెక్కుచెదరలేదు. ఇదెలా సాధ్యమైంది? ఆ తర్వాత కొన్నిరోజులు వరుసగా ఇలాంటి సంఘటనలే. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 50 సంఘటనలు. ఏ ఇంట్లో ఈ పెయింటింగ్ ఉందో.. ఆ ఇంట్లో అగ్నిప్రమాదాలు జరగడం.. ఒక్క పెయింటింగ్ తప్ప మిగతా అంతా కాలి బూడిదైపోవడం. ఈ మర్మమేమిటో ఎవరికీ అర్థం కాలేదు. అంతా మానవాతీతశక్తుల పని అనుకుంటున్నారు.
Painting

ఈ పెయిటింగ్ ఎక్కడిదంటే?

1969 కాలంలో అగ్ని ప్రమాదం జరిగి ఓ కుటుంబం కాలి బూడిదైపోయింది. ఆ కుటుంబంలో ఒక పిల్లాడు మాత్రం మిగిలాడు. అతను ఏడుస్తున్న దృశ్యాన్ని ఫేమస్ స్పానిష్ ఆర్టిస్ట్ బ్రగోలిన్ పెయింటింగ్ వేశారు. దీనికి ది క్రయింగ్ బాయ్ అని పేరు పెట్టాడు. కొన్నాళ్లకు ఈ పిల్లాడు కూడా కారు ప్రమాదంలో చనిపోయాడు అనే కథనం.. మరింత మిస్టరీని పెంచింది. ఆ పిల్లాడే దెయ్యమై ఇండ్లను కాల్చివేస్తున్నాడని నమ్మారు. మరికొంతమంది ఆ పిల్లాడి శాపమనే ప్రమాదాలకు కారణమని అనుకున్నారు. ఈ ప్రమాదాలు జరగకముందు బ్రగోలిన్ గీసిన ఈ పెయిటింగ్ విపరీతంగా అమ్ముడుపోయింది. ఎవరి చేతిలో చూసినా ఇదే కనిపించింది. 1985 సెప్టెంబర్ 5న ఈ అగ్నిప్రమాదాలకు, పెయింటింగ్‌కు లింక్ చేస్తూ వార్తలు రావడంతో.. రెండింటికీ ఏదో సంబంధం ఉందని జనాలు నమ్మారు.

పెయిటింగ్‌లన్నీ తగులబెట్టారు..

పెయింటింగ్ గురించి ఎన్నో సమాధానాల్లేని ప్రశ్నలు. సంఘటనలు కళ్లముందే జరిగాయి. ఇది నిజంగా పిల్లాడి శాపమేనని వాదించారు చాలామంది. ఈజిప్ట్‌లో మమ్మీల విషయంలోనూ ఇదే జరిగిందని మిస్టరీని మరింత పెంచేశారు. దీనిని ఛేదించేందుకు మెకంజీ అనే అధికారికి పని పడింది. అన్ని పేపర్లలో వచ్చిన వార్తలను పరిశీలించిన అతను.. ఏదో జరిగిందని ఊహించాడు. పరిశీలించాడు. పరిశోధించాడు. అయినా ఏమీ తేలలేదు. దీంతో.. లక్షలాదిగా ప్రింట్ అయిన ఈ పెయింటింగ్‌లు అన్నింటినీ తగులపెట్టాలని ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. మాకు పెయింటింగ్ పంపించండి. వాటిని మేమే కాల్చివేస్తాం అని పిలుపునకు అనూహ్య స్పందన వచ్చింది. వేలాదిగా వచ్చిన పెయింటింగ్‌లను కుప్పలుగా పోసి తగులపెట్టారు అధికారులు. అయినా సమస్య పరిష్కారం కాలేదు.

మైకేల్ నిరూపించాడు

పెయింటింగ్ మిస్టరీని ఎలాగైనా తేల్చాలనే పట్టుదల కొందరిలో బాగా పెరిగిపోయింది. అలాంటి వాళ్లలో ఒకడు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఫైర్ మీద రీసెర్చ్ చేస్తున్న మైకేల్. ఈ మిస్టరీని ఛేదించేందుకు తనదైన శైలిలో ఒక టెస్ట్ చేశాడు. పెయింటింగ్ కిందపడి, ఇంట్లో మంటలు అంటుకుంటే.. పెయింటింగ్ కాలిపోవడానికి ఆస్కారమే లేదనేది మైకేల్ వాదన. ఇది సైన్స్ సూత్రం కూడా. ఎందుకంటే.. అంత పెద్దస్థాయిలో మంటలు వస్తే.. విపరీతమైన వేడి అంతా పైకి ఎగజిమ్ముతూ.. ఫ్లోర్ మీద చల్లగాలి మాత్రమే ఉంటుంది. దీన్ని అతను ప్రయోగాత్మకంగా నిరూపించాడు. ఒక గదిలో అదే పెయింటింగ్‌ను తగిలించి.. దానికి నిప్పుపెట్టాడు. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. 1100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వేడి పుట్టి పెయింటింగ్ కిందపడింది. కానీ కాలిపోలేదు. దీంతో ఎన్నో కథలు.. మరెన్నో అనుమానాలకు స్వస్తి పలికాడు మైకేల్. శాస్త్రీయంగా చేసిన నిరూపణతో జనం ఆశ్చర్యపోయారు. అదే సమయంలో వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై కూడా దృష్టిపెట్టారు ఇన్వెస్టిగేటర్స్. ఇదంతా ద సన్ పత్రిక వండి వార్చిందని తేలింది.

401
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles