పెటా మెచ్చిన బుడ్డోడి కథ


Sat,May 4, 2019 10:19 PM

కొన్నిసార్లు పిల్లలు ఏం చేసినా నవ్వొస్తుంది. మనం సరిగ్గా గమనించం కానీ.. వారి ఆలోచనలు కొన్నిసార్లు మన కంటే అడ్వాన్స్‌గా ఉంటాయి. మొన్న చచ్చిపోయిన కోడిపిల్లను కాపాడమంటూ పదిరూపాయలు పట్టుకొని హాస్పిటల్‌కి వచ్చిన కుర్రాడు గుర్తున్నాడా? ఇది.. ఆ కుర్రాడికి సంబంధించిన మరో అప్‌డేట్..

మొన్న మరో కుర్రాడు చనిపోయిన కోడిపిల్ల ఒక చేత్తో, పదిరూపాయల నోటు ఇంకో చేత్తో పట్టుకొచ్చి ఈ కోడిపిల్లను కాపాడండి సార్ అన్నాడు గుర్తుందా? ఆ కుర్రాడి పసి మనసులో ఉన్న పెద్ద ఆలోచనను చూసి ప్రపంచమంతా నివ్వెరపోయింది. మిజోరంకు చెందిన డెరెక్ సీ లాల్ చన్‌హిమా అనే కుర్రాడు రోడ్డుపై సైకిల్ తొక్కుతూ ఆడుకుంటున్నాడు. అలా సైకిల్ తొక్కుతున్న సమయంలో ఓ కోడిపిల్ల డెరెక్ సైకిల్ కింద పడింది. తను చూస్తుండగానే.. ఆ కోడిపిల్ల కొనప్రాణంతో విలవిలలాడుతుంది. ఆ కోడిపిల్ల కొట్టుకోవడం చూసి డెరెక్ మనసు తల్లడిల్లింది. వెంటనే ఆ కోడిపిల్ల ప్రాణాలు కాపాడాలనుకున్నాడు. దాన్ని తీసుకెళ్లి తండ్రి దగ్గరికి పరుగెత్తాడు. డెరెక్ తండ్రి ధీరజ్ చెత్రి సైనికుడు. కొడుకు చేతిలోని కోడిపిల్లను చూసి ఏమైందని అడిగాడు. దానికి డెరెక్ ఈ కోడిపిల్ల నా సైకిల్ టైర్ కింద పడింది. కొట్టుకుంటుంది. చచ్చిపోతుందేమో.. దీన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్దాం రా అని తండ్రిని పదే పదే అడిగాడు.
Boy

లాభం లేదనుకున్న తండ్రి జేబులోంచి పదిరూపాయల నోటు తీసి డెరెక్‌కి ఇచ్చి నువ్వే తీసుకెళ్లు అన్నాడు. ఓ చేత్తో కోడిపిల్ల, మరో చేత్తో పదిరూపాయల నోటు పట్టుకొని పక్కనే ఉన్న హాస్పిటల్‌కి వెళ్లాడు డెరెక్. అక్కడున్న నర్సు దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లి.. ఈ కోడిపిల్ల నా సైకిల్ కింద పడి గాయపడింది. ఈ పది రూపాయలు తీసుకొని దీన్ని బతికించండి అని అడిగాడు. పాలబుగ్గలు, మొఖంలో అమాయకత్వంతో అడుగుతున్న డెరెక్‌ని చూసి ఆ నర్సు మనసు కరిగిపోయింది. ఆ కోడిపిల్లను చేతిలోకి తీసుకొని చచ్చిపోయిందని గ్రహించింది. ఆ కుర్రాడికి ఏం చెప్పాలో తెలియక కోడిపిల్ల బాగానే ఉంది. కొద్దిసేపట్లో లేచి నడుస్తుందని చెప్పి పంపింది. కోడిపిల్ల బతికిందని నమ్మిన ఆ కుర్రాడు గంతులేసుకుంటూ ఇంటికెళ్లాడు.కోడిపిల్లను బతికించమని అడిగిన ఆ కుర్రాడిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఆ నర్సు. అది కాస్త వైరల్ అయి.. ఆ పసి మనసును అందరూ కొనియాడారు. ఇదంతా మనకు తెలిసిందే. పెటా ఈ సంఘటన గురించి తెలుసుకొని డెరెక్‌ని వెతుక్కుంటూ వచ్చింది. మూగజీవుల సంరక్షణకై పనిచేసే పెటా మూగజీవి పట్ల డెరెక్ ప్రదర్శించిన వాత్సల్యానికి మెచ్చి పెటా ఇండియన్ కంపాసనైట్ కిడ్ అవార్డు ప్రకటించింది. అంతేకాదు.. నేరుగా ఆ కుర్రాడు చదువుకునే స్కూల్‌కే వెళ్లి.. ప్రశంసా పత్రం అందించింది.

292
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles