ఆకృతి


Sat,May 4, 2019 10:14 PM

పాప పేరుకు నీ చాయిస్ ఏంటి... సిద్ధార్థ్ అడిగింది ఉష.ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నదే.. ఉష కాఫీ కప్పు కింద పెడుతూ.. ఆకృతి.. బాగుంది కదా! అన్నాడు సంబుర పడుతూ..సిద్దార్థ్, ఉష భార్యాభర్తలు. ఒకే కంపెనీలో వేర్వేరు ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారు. ఒకరోజు టీ బ్రేక్‌లో మాట్లాడుకుంటూ ఉండగా పాప కోసం వన్ ఇయర్ కెరియర్ బ్రేక్ తీసుకుందామనుకుంటున్నా.. ఏమంటావ్? అన్నాడు సిద్దార్థ్ ఏంటి సడన్‌గా.. పొద్దున కార్లో వస్తున్నప్పుడు కూడా చెప్పలేదు కొంత షాక్‌తో అడిగింది ఉష. ఇందాకే ఈ కంపెనీలో త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిందనీ.. కంగ్రాట్యూలేషన్స్ అని ఈ-మెయిల్ వచ్చింది. అని చెప్తూనే మనసులోపల అనుకుంటున్నాడు..ఆకృతి తన ప్రపంచమంతా నిండిపోయింది. ఇది వరకు ఇలా ముఖ్యమైన డేట్స్ మర్చిపోవడం జరిగినట్టు తనకు గుర్తు లేదు..అవును కదా.. ఇంకో ఆరు నెలలు గడిస్తే నేను కూడా త్రీ ఇయర్స్ క్లబ్‌లో చేరిపోతాను అన్నది ఉష.. సిద్ధార్థ్ తన ఆలోచనల్లోంచి పూర్తిగా తేరుకోకముందే.. అంతలోనే నాకెందుకు ఈ ఐడియా రాలేదు.. మనసులో ఆలోచిస్తూనే బయటకు అనేసింది.హా.. ముందు నేను తీసుకుంటాను.. తర్వాత నువ్వు కూడా బ్రేక్ తీసుకుందామంటే తీసుకోవచ్చు చాయిస్ ఉషకు ఇచ్చా.

బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత కూడా చాలాసేపు అదే ధ్యాసలో ఉంది ఉష. ఆలోచిస్తూనే పని హడావుడిలో పడిపోయింది. తను చేయాల్సిన పని ఓ గంటలో చేయాలనేది ఉష ఫిలాసఫీ..ఇంతలో వీకెండ్ రానే వచ్చింది. డెడ్‌లైన్‌తో వారమంతా ఉరుకులు పెట్టి, కాస్త ప్రశాంతంగా అనిపించింది వీకెండ్.. బాగా ఆలోచించింది. తను కూడా వన్ ఇయర్ లీవ్ వితౌట్ పే కోసం ఆప్లయ్ చేయాలని అనుకుంది. సిద్దార్థ్ బయటనుంచి రాగానే చెప్పాలని ఎక్సయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తూ ఉంది.ఈవినింగ్ తను ఈ విషయం చెప్పగానే, పట్టరాని సంతోషంతో అయామ్ వెరీ హాప్పీ ఉష అన్నాడు. ఉషకు తెలుసు సిద్దార్థ్ చాలా హాప్పీగా ఉన్నాడని. పాపంటే సిద్దార్థ్‌కి ప్రాణమని. ఇంతకూ గిటార్ క్లాస్ ఎలా అయింది అడిగింది సిద్దార్థ్‌ని..
Akruthi

మా మేనేజర్ రాంచందర్‌తో మాట్లాడాను చెప్పాడు సిద్దార్థ్.ఏమన్నాడు? ఎక్సయింట్ మెంట్, టెన్షన్ కలిసిన గొంతుతో అంది ఉష. ఈ ఆప్షన్ ఉందన్నమాటే గానీ.. వన్ ఇయర్ పాటు సాలరీ పదులుకొని వెళ్లేవాళ్లని చూల్లేదు. అందులోనూ పాపకోసం నువ్విదంతా చేయడం చూస్తుంటే.. ఐ షుడ్ అప్రిషియేట్ యూ మేనేజర్ మాటల్ని యాజిటీజ్‌గా చెప్పాడు సిద్దార్థ్..రెండు నెలల్లో ఇప్పుడున్న ప్రాజెక్ట్ అవగానే లీవ్ ఇస్తానన్నాడుఉష మనసులో ఏవో లెక్కలు వేసుకొని సరిగ్గా ప్లాన్ చేస్కుంటే.. నువ్వు.. నేను అయిదారు నెలలు ఒకే టైంలో లీవ్‌లో ఉండొచ్చు. నీ లీవ్ స్టార్టయిన మూడు నాలుగు నెలల తర్వాత నా లీవ్ గురించి ఆఫీస్‌లో చెప్తాను.. తన ఆలోచన చెప్పింది ఉష..పర్ఫెక్ట్.. అన్నాడు సిద్దార్థ్..కాసేపు నిశ్శబ్దం..ఈ లీవ్ వెనక ఉన్న మరో కారణం కూడా నాకు అర్థమయింది అంది ఉష నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ..నువ్వు అర్థం చేసుకోగలవని నాకు తెలుసు చివరి నిమిషంలో ఎలాంటి టెన్షన్స్ లేకుండా అనుకున్న టైం ప్రకారం లీవ్ అప్రూవ్ అవ్వాలి అనుకున్నారిద్దరూ.. ఒకరి కళ్లలోకి ఒకరు తీక్షణంగా చూసుకుంటున్నారు. ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు... ఆ చూపుల్లో కేర్ మన్న శబ్దంతో ఇద్దరూ తేరుకున్నారు.

పాప లేచినట్టుంది
నిద్రలేచిన ఆకృతిని ఆడించారు ఇద్దరూ. కష్టపడి అటూ, ఇటూ పరుగెత్తి పాపకు తినిపించి, వాళ్లూ తిన్నారు. ఆకృతితో ఆటలో వాళ్లకు కష్టాలు, టైం రెండూ గుర్తుకురావు.అప్పుడే నాలుగున్నరయిందే. హే సిద్ధార్థ్... వాతావరణం చల్లగా ఉంది. డ్రైవ్‌కెళ్దామా? డౌట్‌గానే అడిగింది. ఉష ఎక్సయిట్‌మెంట్ చూసి తనకూ వెళ్లాలనిపించింది. కార్‌లో అలా హైవేపై ఓ గంటసేపు వెళ్లారు ముగ్గురూ.. టీ తాగడం కోసం ఆగారు. ఆకృతి వాళ్లిద్దరి ప్రపంచం. వీకెండ్ రెండ్రోజులూ.. ఇంట్లో ఉన్నా.. ఇలా ఏదో ఒక చోటుకి వెళ్లినా.. ఆకృతి కోసమే.. ఆకృతి ఆలోచనే..

చాలా రోజుల తర్వాత..
ఉషా.. లంచ్ బాక్స్ మర్చిపోయావ్..కాల్ చేశాడు సిద్దార్థ్..దిగిన లిఫ్ట్‌లోనే మళ్లీ పైకి వచ్చింది. బాక్స్ మరిచిపోయినందుకు తిట్టుకుంటూనే, మళ్లీ పాపని చూడొచ్చని హాపీగా ఫీలయింది. పాపని వదల్లేక వెళ్లలేక ఆఫీసుకు వెళ్లింది. బాక్స్ తీసుకొని.సాయంత్రం ఇంటికి వచ్చేసరికి. తండ్రీ, కూతుళ్లు నిద్రపోతున్నారు. టేబుల్ మీద గిటార్ గురించిన లెసన్స్ పేపర్లు... చిందర వందరగా పడి ఉన్నాయి. యూట్యూబ్‌లో గిటార్ పాఠాల వీటియోలు చూస్తున్న పేజీలతో లాప్‌టాప్.. అన్నీ అలాగే వదిలేసి పడుకున్న సిద్దార్‌థ మీద కోపం వచ్చింది ఒక సెకన్ పాటు. కానీ కూతుర్ని ఆడిస్తూ ఆలాగే పడుకొని ఉంటాడు అనుకుంది.అవన్నీ సర్దేసి, టీ ప్రిపేర్ చేసి సిద్దార్థ్‌ని లేపుతూ ఎంత క్యూట్‌గా పడుకుందో..నా చిట్టితల్లి అనుకుంది.
టీ తాగుతూ ఉండగా.. పాపకి ప్రీ స్కూల్ వెదకాలి.. కనీసం ఆరు నెలల ముందు నుంచే ప్లానింగ్ ఉండాలి అంది.అప్పుడే ప్రీ స్కూలా.. అని షాకయినా... ఉష చెప్పింది అర్థమయింది ఉషకు ఏదయినా ముందుగా ప్లాన్ చేయడం అలవాటుసరే వెతుకుదాం అన్నాడు.. యు ఆర్ గుడ్ ఇన్ ప్లానింగ్ థింగ్స్ ఇన్ అడ్వాన్స్.. నాకా ఆలోచనే రాలేదు. అని ఒక కాంప్లిమెంట్ కూడా యాడ్ చేశాడు.ఇంతలో కొన్ని రోజులకు, ఉష లీవ్ అప్రూవ్ అయింది. ఆకృతి, సిద్దార్థ్, తనూ.. ముగ్గురూ కలిసి ఉన్న మొదటి కొన్ని రోజులు తన జీవితంలో బెస్ట్ ఫేజ్ అనుకుంది ఉష.. కొంత కాలంగా తను అనుభవిస్తున్న మనోవ్యథ అంతాపోయి కొత్త ఉత్సాహం వచ్చింది ఉషకు. సిద్దార్థ్ ఆఫీస్‌లో జాయిన్ అయ్యే రోజు వచ్చింది. తన లీవ్ పీరియడ్ లో ఏదయితే చేయాలనుకున్నాడో అది చేశాడు. ముఖ్యంగా సంవత్సరం పాటు పాపతో ఆనందంగా గడిచింది.

సిద్దార్థ్ ఆఫీసులో కూడా ఉత్సాహంగా ఉంటున్నాడు. ఓ వారం పదిరోజులు అయ్యాక ఆఫీస్ నుంచి వచ్చుటప్పుడు కొన్ని బుక్స్ తెచ్చాడు ఉషకోసం. చెప్పకుండానే తనకేం కావాలో తెచ్నిందుకు మనసులో సంతోషపడింది. తను తీసుకున్న ఒక డెసిషన్‌కు తానే గర్వపడింది.

తర్వాత కొన్నేళ్లు....
ఆకృతి ప్రీ స్కూల్, తర్వాత స్కూల్, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లు, ఆకృతి ఆటలు. సైకిల్ నేర్చుకోడం, ఎక్స్‌కర్షన్, ఎక్స్‌పెరిమెంట్స్, ఎగ్జామ్స్.. తను తగిలించుకున్న దెబ్బలు, ఏడుపులు, అమాయకపు నవ్వులు.. సిద్దార్థ్, ఉష జీవితాన్ని నింపేశాయి..

తల్లిదండ్రులు బిడ్డకీ, ప్రపంచానికి మధ్య మొదటి వారధి. అన్నిటికన్నా ముఖ్యమయిన వారధి చెప్పుకుంటూ పోతున్నాడు సిద్ధార్థ్. పిల్లలు తమకు కొంత జ్ఞానం వచ్చేవరకూ, స్నేహితుల వల్ల ప్రభావితం అవడం మొదలయ్యే వరకూ.. తల్లిదండ్రులు పరిచయం చేసిన ప్రపంచాన్ని ఊహించుకుంటున్నారు. అది తర్వాత వాళ్లకు బతకాడానికీ, బతకడం నేర్చుకోడానికి కావాల్సిన ప్రైమరీ నాలెడ్జీ ఇస్తుంది...అలా పేరెంట్స్ వాళ్ల రెస్పాన్సిబిటిలీనీ గురించి సిద్దార్థ్ చెప్తుంటే, ఉష అతన్ని మనసు లోపలే అప్రిషియేట్ చేసుకుంది..

ఆకృతి అప్పుడు ఎనిమిదో తరగతిలో ఉంది. ఉష, సిద్దార్థ్ ఒక ముఖ్యమైన డిస్కషన్‌లో ఉన్నారు. ఇప్పుడే ఈ నిజం తనకు తెలియాలా.. ఆకృతి ఎలా రిసీవ్ చేసుకుంటుందో.. మనసులో మాటలు బయటకి అనేస్తూ.. మల్లీ తనను తనే సరి చేసుకుంది.. సిద్దార్థ్.. నువ్వు చెప్పింది కరక్టే.. ఇదే రైట్ టైం ఆ సమ్మర్ హాలీడేస్‌లో ఒక రోజు చాలా నెమ్మదిగా ఆకృతికి విషయం చెప్పారు. తర్వాత మౌనమే కొతం కాలం ఆకృతి భాష అయింది. తన కష్టాన్ని వాళ్లు కేవలం ఊహించగలరు. కానీ నమ్మలేని నిజాలు జీవితంలో భాగమని ఉష, సిద్దార్థ్‌కి జీవితం నేర్పిన అనుభవం.సమ్మర్ హాలీడేస్ అయ్యేసరికి ఆకృతి కాస్త కుదుటపడింది. కానీ ఎన్నో ప్రశ్నలు తన మదిలో, ఏదో అసంపూర్తిగా అనిపించింది. ఆకృతికి కానీ తనకి ఏదీ ఎప్పుడు చెప్పాలో పేరెంట్స్‌కు తెలుసు. పేరెంట్స్‌లాగే తనకు కూడా వయసుకు మించిన పరిణితి వచ్చింది. గొప్పగా ఆలోచిస్తుంది.కాలం పెద్ద పెద్ద గాయాల్ని సైతం నయం చేస్తుంది. అలాగే ఈ నిజాన్ని కూడా కాలమే వాళ్ల జీవితంలో ఒక భాగం చేసింది. మునుపటికీ ఇప్పటికీ అదొక్కటే మారింది. వాళ్ల ప్రేమల్లో కించిత్ మార్పు కూడా లేదు.

ఆకృతి గ్రాడ్యుయేషన్ అయింది. తనకు సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్‌ఏ ఎకనామిక్స్ సీట్ వచ్చింది. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆకృతి తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ చెబుతుంది అమ్మా, నాన్నకు..
ఉషకి చాలా గర్వంగా ఉంది. ఐ థింక్ వుయ్ ఆర్ గెట్టింగ్ ఓల్డర్.. అంది సిద్దార్థ్‌తో.. అవును నా చిట్టితల్లి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే అనిపిస్తోంది.. బదులిచ్చాడు.. సిద్దార్థ్ ఆకృతి వైపు చూస్తూ వుయ్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్‌యూ రా ఆకృతి అన్నాడు లేదు నాన్న.. అయామ్ సో మచ్ ప్రౌడ్ ఆఫ్‌యూ బోత్.. థాంక్యూ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ లైఫ్.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఒక్కసారిగా అందరి కళ్లలోనూ నీళ్లు...అందరూ తేరుకున్నాక.. ఆకృతి మాట్లాడటం మొదలు పెట్టింది. నాన్న .. అమ్మా.. కొన్నేళ్ల కిందట నేను మీ సొంత బిడ్డని కాదని చెప్పినప్పుడు .. మొదట్లో నా పరిస్థితి నాకే అర్థం కాలేదు. ఆ తర్వాత నాలో ఎన్నో ప్రశ్నలు.. కొన్నిటికి ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు. మొత్తంమీద.. మీరు నాకు పూర్తి నిజం చెప్పలేదని అనిపిస్తోంది.. నాకు తెలియాలి. ఐ థింక్ అయామ్ రెడీ ఫర్ దట్ చాలా ఉద్వేగంగా చెప్పింది..ఉష, సిద్ధార్థ్ ఆశ్చర్యపడలేదు. ఎప్పటికయినా తనకు తెలియాల్సిన నిజమే కదా.. కళ్ల ముందు జీవితం కదలాడింది. ఎన్నో ఏళ్లుగా మనసులో ఏదో మూలకు వెళ్లిన బాధ ఇప్పుడు గుర్తుకొస్తోంది. ఉద్వేగంతో నోట మాటలు రావట్లేదు. ఇద్దరికీ...ఉష ముందుగా తేరుకుని.. జీవితాల్లో బాధ తప్ప మరేదీ లేని పరిస్థితుల్లోంచి, మా జీవితాల్లో ఆనందం నింపుకునే రెండో అవకాశం.. నీ రాక మాకిచ్చింది. మేమే నీకు థాంక్స్ చెప్పాల్రా.. అంది.సిద్దార్థ్ అందుకున్నాడు..నాకు పళ్లైన రెండేళ్లకి. నా భార్య హైదరాబాద్ వెళ్లి వస్తుండగా బస్ యాక్సిడెంట్‌లో చనిపోయింది. నేను బాగా డిప్రెస్ అయ్యాను సిద్దార్థ్ కళ్లలో నీళ్లు.. అంజలి, నేను అప్పుడప్పుడూ అనాథాశ్రమానికి వెళ్లేవాళ్లం. తనకీ పిల్లలంటే ఇష్టం.. పిల్లల గురించిప్లాన్ చేసుకునే టైంలోనే తను.. అపేశాడు.. ఒక చెప్పలేక మళ్లీ గొంతు సవరించుకొని.. తను లేకపోయినా. తన జీవితంలో కూడా నేనే బతకాలి అనుకున్నాను. ఎప్పుడు అంజలి, నేను అశ్రమానికి వచ్చినా, నువ్వు అంజలితో బాగా ఆడుకునే దానివి. అందుకే.. మళ్లీ ఆగిపోయాడు.. ఇక తన వల్ల కాలేదు. కానీ మనసులోని భారం దిగిన ఫీలింగ్.ఆకృతి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇంకా ఎలాంటి నిజాలు తెలుసుకోవాలో అని. ఎన్నో ఆలోచనలు మెదులుతున్నాయి. ఇంతలో ఉష చెప్పడం మొదలు పెట్టింది. నా పెళ్లి నాకు చేదు అనుభవం మిగిల్చింది. శారీరక, మానసిక హింస చెప్పుకోలేని దారుణాలు, భరించలేకపోయాను. విడాకులు తీసుకున్నాను చెప్పుకుంటూ వెళ్లోంది.. సిద్దార్థ్, నేను అప్పుడు ఒకే కంపెనీలో పని చేస్తున్నాం.ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం..మళ్లీ సిద్దార్థ్ చెప్పడం మొదలు పెట్టాడు.. మాటల్లో ఒకరి కష్టాలు ఒకరం తెలుసుకున్నాం.. అప్పుడప్పుడూ.. కాఫీ బ్రేక్‌లో కలిసే వాళ్లం..అప్పటికే నవ్వు నాతో ఉన్నప్పుడు ఒకసారి చూసింది.. నేను నా ప్లాన్ తనతో చెప్పాను.. ఐ వాంట్ టు మూవ్ ఆన్ అని.. నా కూతురివని.... కాసేపు మౌనం.. మళ్లీ చెప్తున్నాడు..తర్వాత చాలా రోజులకు.. ఉష నా దగ్గరికొచ్చి చెప్పింది... నేను కూడా నా కష్టాలు మర్చిపోవాలి. ఆనందంగా బతకాలి.. ఈవెన్ ఐ వాంట్‌టు మూవ్ ఆన్.. అని మొదట్లో సందేహించాను. ఆలోచించాను.

చివరికి ఈ ప్రయాణంలో కలిసే సాగుదాం అనుకున్నాం.. తను నిన్ను చాలా ఇష్టపడిందిరా ఆకృతి.. ఆదే అసలు కారణం. అందులోనూ ఇద్దరి పరిస్థితి ఒక్కటేనా జీవితాన్ని మార్చుకోవడానికి.. నువ్వొక అవకాశంగా నేను అనుకున్నాను.. తను కూడా అదే అనుకున్నాను అన్నప్పుడు వద్దు అని అనలేకపోయాను చెప్పడం ముగించాడు సిద్దార్థ్.. ఇంకా ఏవో ప్రశ్నలు.. ఆకృతి మనసులో..మూవ్ ఆన్ అంటే.. మేం పెళ్లి చేసుకోవడం అని అనిపించలేదు.. మాకా ఉద్దేశం లేదు కూడా.. కానీ లీగల్‌గా, సోషల్‌గా నీకెలాంటి ఇబ్బందులు రాకూడదనీ, ఇబ్బంది పడుతూనే పెండ్లి చేసుకున్నాం. అలా నీకూ అమ్మా, న్నా అయ్యాం.. కానీ వుయ్ రిమైన్డ్ ఫ్రెండ్స్‌అన్నది ఉష చాలా గంభీరంగా...తను ఈ విషయం అంత ఈజీగా చెప్పగలిగేవాడు కాదనీ సిద్దార్థ్ మనసులో అనుకున్నాడు. తన మనసులో ఏం జరుగుతుందో తనకే తెలియని పరిస్థితుల్లో ఉంది ఆకృతి..తల్లిదండ్రులు తనపై చూపించిన ప్రేమని తట్టుకోలేకపోతోందనుకుంటా...ఉషా చెప్తూనే ఉంది....... అంతటితో ఎందుకు ఆగాలి. ఆ దేవుడి రాత అనేది ఉంటే దాన్ని ఎదిరించి మా జీవితాన్ని ఇంకింత అర్థవంతంగా చేసుకోవాలనుకున్నాం.. మనసు మూలల్లో మిగిలిపోయిన మా అభిరుచుల్ని నిజం చేసుకునే ప్రయత్నం చేశాం.. ఆగింది ఉష... సిద్దార్థ్‌ని మాట్లాడమని సైగ చేస్తూ... ఎప్పటికైనా గిటార్ నేర్చుకొని .. స్టేజ్ పెర్ఫామెన్స్ ఇవ్వాలనేది.. నా కోరిక.. నీ చిన్నప్పుడు వన్ ఇయర్ లీవ్ తీస్కొని ఇంట్లో దానికి శ్రీకారం చుట్టాను. చాలా ఏళ్లు కష్టపడి నేర్చుకున్నాను.

నీకు తెలుసు కదా.. మైలైఫ్ అనే చిన్న మ్యూజిక్ బ్యాండ్ స్టార్ట్ చేశాను.. ఐ ఫీల్ వెరీ హాప్పీ.. ఉత్సాహంగా చెప్పాడు సిద్దార్థ్..ఉష చెప్తూనే ఉంది..... అంతటితో ఎందుకుఆగాలి.. ఆకృతి రైటర్ కావాలన్న నా కోరిక నీ వల్లే తీరింది.. నీ కోసం కాకపోయి ఉంటే సిద్దార్థ్ ఆలోచన వల్ల కాకపోతే.. కెరీర్ బ్రేక్ తీసుకొని మరీ.. నన్ను నేను మోటివేట్ చేసుకొని ఈ ప్రయత్నం చేసేదాన్ని కాదేమో నా కథలు పేపర్లో వచ్చినప్పుడు సంతోషపడేదాన్ని కదా.. ఇప్పుడవన్నీ ఒక సంకలనంగా తీసుకొస్తున్నాం...ఆకృతి ఏం మాట్లాడే స్థితిలో లేదు. తన వల్లే అమ్మా.. నాన్న.. కాదు తనకో అమ్మా, నాన్నగా మారిన తన అమ్మానాన్నలు.. వాళ్ల కోరికల్ని నిజం చేసుకున్నారు అంటే తనేం చేసిందో తనకే అర్థం కావట్లేదు..తను కొలవలేనంత ప్రేమని పొందే అవకాశాన్ని, అదృష్టాన్ని ఆస్వాదిస్తూ.. తను ఎప్పుడూ ఊహించనంత ఆనందంలో ఉంది. ఒక తన్మయత్వంలో ఉంది. తన తల్లిదండ్రుల్ని చూసి గర్వపడుతోంది. అమ్మా.. నాన్న అంటూ వాళ్లని గట్టిగా వాటేసుకుంది. ఆ ముగ్గురి కళ్లలోంచి ఉబికి వస్తున్న ఆనంద భాష్పాలు.. ఆ ఉద్వేగం. ఏమిటిది? అది ఆనందం.. అది ప్రేమ. అది అనుబంధం. అది జీవితం..వాళ్లు పంచిన అమితమైన ప్రేమ, ఒక అనాథ జీవితాన్ని మార్చేసిందా? లేక అగాథంలో ఉన్న వాళ్లకి , ఆ ఆకృతి రూపంలో వాళ్ల జీవితాలను మళ్ల్లీ వెదుక్కునే అవకాశం దొరికిందా? ఇంతకీ ఆకృతి వాళ్ల జీవితాలను ఏం చేసింది? ప్రత్యేకంగా ఏమీ చేయనక్కర్లేదు. కేవలం తన ఉనికి, ఒక ఉత్ప్రేరకంలా, వాళ్ల జీవితాల్లో ఏదో చైతన్యం తీసుకొచ్చింది. ఏదయితేనేం.. వాళ్ల మనసుల్లో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ, ఆ ముగ్గరి జీవితాలను అందగా, అర్థవంతంగా తీర్చిదిద్దింది..

-ప్రమోద్ కుమార్. కె

253
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles