నెట్టిల్లు


Sat,May 4, 2019 09:59 PM

ఓ సినిమాలో అన్నదమ్ముల అనుబంధాన్ని చూస్తున్నప్పుడు మన అన్నో, తమ్ముడో గుర్తొస్తే.. ఆ దర్శకుడు సక్సెస్ అయినట్టే. అలా సక్సెస్ అవడానికి ప్రయత్నిస్తున్న వారంతా షార్ట్‌ఫిలిం రూపంలో తమ టాలెంట్‌ని ప్రదర్శిస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ షార్ట్‌ఫిలింస్ నుంచి కొన్ని ఈ వారం నెట్టిల్లులో..

అండస్టార్డింగ్ బాయ్‌ఫ్రెండ్

దర్శకత్వం: జోన్స్ కట్రు
నటీనటులు : జోన్స్ కట్రు, గోల్డీ నిస్సి, సునీల్ జె
గర్ల్‌ఫ్రెండ్‌ని బాగా అర్థం చేసుకునే బాయ్‌ఫ్రెండ్ ఎలా ఉంటాడనే ప్రశ్నకి సమాధానమే ఈ షార్ట్‌ఫిలిం. ఇద్దరూ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఒకరి ఇష్టాయిష్టాలు ఇంకొకరికి బాగా తెలుసు. ఆ అమ్మాయి మనసు అబ్బాయి బాగా అర్థం చేసుకుంటాడు. ఇక కథలోకి వస్తే.. బోర్ కొడుతుందని ఫోన్ చేసిన గర్ల్‌ఫ్రెండ్‌ని బయటకు తీసుకెళ్తాడు ఆ అబ్బాయి. ఇద్దరూ చార్మినార్ వెళ్తారు. అక్కడి నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్తారు. కానీ.. ఆ అమ్మాయి యాక్టింగ్ చేయడం ఆ అబ్బాయి వాళ్ల ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అని ఆమె బాధపడుతుంటుంది. నిత్యం వాళ్లిద్దరి పెండ్లి జరుగుతుందో లేదో అని ఆలోచిస్తుంటుంది. ఆమె సందేహాలకు, అనుమానాలకు ఓపికగా సమాధానమిస్తుంటాడు ఆ అబ్బాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఒక జంట ఎంత ఆనందంగా ఉంటుందో ఈ కథలో చూడొచ్చు. మనస్పర్థలు, భేదాభిప్రాయాలు లేకుండా సాగిపోయే బంధం అందాన్ని చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథ ైక్లెమాక్స్‌లో చెప్పిన పాయింట్ మనసును తాకుతుంది. చూడండి.. మీకు నచ్చుతుంది.
understanding-boyfriend

Total views385,581+(ఏప్రిల్ 27 నాటికి) Published on Apr 20, 2019

ప్రణయ్ అమృత

నటీనటులు : చక్రి టామ్, డియోబాయ్ చోటు, శ్రీకాంత్, ప్రణయ్
దర్శకత్వం: శ్రవణ్ డైమండ్
ప్రణయ్, అమృతల ప్రేమకథలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన షార్ట్‌ఫిలిం ఇది. తక్కువ కులం అబ్బాయిని పెండ్లి చేసుకున్నందుకు అమృత మీద కోపం పెంచుకుంటాడు ఆమె తండ్రి. ఆ కోపం బిడ్డ మీద కాకుండా.. తన బిడ్డను వలలో వేసుకున్న ప్రణయ్ మీద చూపించాలనుకుంటాడు. తక్కువ కులం వాడికి తన కూతురునిచ్చి పెండ్లి చేసినా, తన కూతురు కులం కాని వాడితో తిరిగినా తన పరువు పోతుందని భావించిన అమృత తండ్రి ప్రణయ్‌ని చంపించాలనుకుంటాడు. అందుకోసం కిరాయి గుండాలకు సుపారీ ఇచ్చి ప్రణయ్‌ని చంపేందుకు పథకం వేస్తారు. ఆసుపత్రికి వెళ్లి వస్తున్న ప్రణయ్, అమృతలను మాటు వేసి కాపుగాస్తారు. వెనుక నుంచి వచ్చి ప్రణయ్ మెడ మీద బలంగా గొడ్డలితో నరకడంతో ప్రణయ్ చనిపోతాడు. ఇది అందరికీ తెలిసిన కథే. ప్రణయ్‌ని చంపిన సమయంలో ఈ వార్త దేశమంతా చర్చనీయాంశమయింది. అయితే.. ఆ కథను దృశ్య రూపంలోకి తెద్దామనుకున్న దర్శకుడు విఫలమయ్యాడు. టెక్నికల్ పనితనం లేకుండా పేలవంగా కథను కెమెరాలో బంధించడం మీదనే దృష్టి పెట్టడంతో.. ఎక్కువమంది చూసినా.. ఆశించినంత బాగా లేదు. కాకపోతే.. చివర్లో ప్రేమను బతుకనిద్దాం.. మహా అయితే.. పది మంచి పనులు చేస్తే పోయిన పరువు మళ్లీ వస్తుంది అని ఇచ్చిన మెసేజ్ ఆలోచింపజేసేలా ఉంది.
pranay-amrutha

Total views52,823+(ఏప్రిల్ 27 నాటికి) Published on Apr 23, 2019

నీవెవరే

దర్శకత్వం: అశోక్ కుమార్ రెడ్డి
నటీనటులు : గంగాధర్ అక్కిశెట్టి, అర్చన ఉన్నికృష్ణన్
ఓ కుర్రాడు.. తన ఈడు కుర్రాళ్లందరికీ, తన ఫ్రెండ్సందరికీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నా.. తనకు ఎవరూ లేరని ఆలోచిస్తుంటాడు. ఓ రోజు ఒక్కడే నిల్చొని ఆలోచిస్తుంటే.. ఓ ఆటో వచ్చి తన ముందే ఆగుతుంది. ఆ ఆటోడ్రైవర్ ఆ కుర్రాడిని హెల్ప్ అడుగుతాడు. ఆటో తోస్తూ.. అందులో కూర్చుని నిద్రపోతున్న అమ్మాయిని చూస్తాడు. నచ్చుతుంది. మరుసటి రోజు మళ్లీ ఆ అమ్మాయి కనిపిస్తుంది. ఈసారి వాళ్ల అన్నయ్య బైక్ మీద నిద్రపోతూ కనిపిస్తుంది. ఆమెను ఫిక్స్ అయిపోతాడు. తను సలహాలిచ్చిన వాళ్లందరి దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయిని పడేయడానికి సలహాలడుగుతుంటాడు. ముందు ఆ అమ్మాయిని పరిచయం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఫ్రెండ్స్ చెప్పిన సలహాలు పాటిస్తూ.. ఆమెను ఇంప్రెస్ చేయాలని చూస్తుంటాడు. రోజూ ఆమెను ఫాలో అవుతుంటాడు. ఒకరోజు రోడ్డు మీద ఇప్పటి వరకు నా మనసులో ఎవరికీ చోటివ్వలేదు. ఇప్పట్నుంచి నా మనసు నీకే అని చెప్తాడు. ఆ అమ్మాయి మాత్రం ఎలాంటి రిైప్లె ఇవ్వకుండా వెళ్లిపోతుంది. ఇలా రోజూ ఫాలో అవుతూ ఉంటాడు. ఆమె మాత్రం పట్టించుకోదు. మరి ఈ కథ ఎక్కడికి చేరింది. ఇద్దరూ కలిసారా అనేది మిగిలిన కథ.
NEEVEVARO

Total views17,551+(ఏప్రిల్ 27 నాటికి) Published on Apr 21, 2019


కలం

దర్శకత్వం: విజయ్ ఎం నోవా
నటీనటులు : ఉదయ్, పార్వతి సౌందర్య, దేవ ప్రసాద్, డయానా
కసనోవా ప్రీతి కలం పేరు. ప్రీతి రచయిత్రి. కవితలు, నవలలు రాయడం ఆమె అభిరుచి. జైకి పుస్తకాలు చదువడమంటే ఆసక్తి. ఒకరోజు జై ఓ కాఫీషాప్‌లో కూర్చొని ప్రీతి రాసిన పుస్తకం చదువుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఓ అమ్మాయి వస్తుంది. ఏదో రాయడానికి పెన్ను, పుస్తకం బ్యాగులోంచి తీసి రాయడం మొదలుపెడుతుంది. కానీ.. తన చేతిలో ఉన్న పెన్‌రాయదు. దీంతో ఎదురుగా కూర్చున్న జై ని అడిగి పెన్ తీసుకుంటుంది. పుస్తకంలో మునిగిపోయిన జై ఆమె ఎవరో చూడకుండానే ఆమెకు పెన్ ఇస్తాడు. పుస్తకం చదువడం అయిపోయిన తర్వాత.. వాహ్.. ఏం పుస్తకమండీ.. చాలా బాగా రాశాడు రచయిత. మనిషికి కలిగే అన్ని భావాలూ పలికిస్తాడు అని ఎదురుగా కూర్చున్న అమ్మాయితో చెప్తాడు. దానికి ఆ అమ్మాయి.. ఆ పుస్తకం రాసింది రచయిత కాదు.. రచయిత్రి. అది నేనే అని చెప్తుంది. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రీతి, జైల పరిచయం స్నేహంగా మారిందా? ప్రేమగా చిగురించిందా? అనేది కథలో మలుపు.
kalam

Total views6,411+(ఏప్రిల్ 27 నాటికి) Published on Apr 24, 2019

-ప్రవీణ్‌కుమార్ సుంకరి, సెల్: 9701557412

234
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles