నెట్టిల్లు


Sun,April 14, 2019 01:46 AM

ఎప్పట్లాగే ఈ వారం కూడా చాలా షార్ట్‌ఫిలింస్ యూట్యూబ్‌లో విడుదల అయ్యాయి. అందులోంచి నాలుగు షార్ట్‌ఫిలింస్ ఎంపిక చేసి ఈ వారం నెట్టిల్లులో ఇస్తున్నాం. అందులో రెండు సామాజిక కోణంలో, భవిష్యత్తు గురించి ఆలోచించి తీసిన షార్ట్‌ఫిలింస్. మిగతావి డెస్టినేషన్ గురించి చెప్పే షార్ట్‌ఫిలింస్. వాటిపై ఓ లుక్కేయండి.

వైట్


దర్శకత్వం: మను నాగ్
నటీనటులు : ప్రియమణి, అమితాబ్ బచ్చన్
ఉదయాన్నే ఓ అమ్మాయి జాగింగ్ కోసం బయల్దేరుతుంది. ఆమె బయల్దేరడం చూసి తను పెంచుకునే కుక్క కూడా ఆమెతో బయల్దేరుతుంది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆ అమ్మాయి తను పెంచుకునే రాకీని కట్టేసిన గొలుసు వదిలేస్తుంది. ఆ కుక్క ఆ అమ్మాయికి దూరంగా అడవిలోకి ఎటో వెళ్లిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్లిపోదామని రాకీని పిలుస్తుంది. అదేమో ఎటో వెళ్లిపోయింది. ఎంత పిలిచినా రాదు. తన చేతిలో ఉన్న ైబ్లెండ్ స్టిక్ ఓపెన్ చేస్తుంది. అంతసేపు ఆ అమ్మాయి అంధురాలు అని మనం గుర్తు పట్టలేం. ఆ స్టిక్ ఓపెన్ చేసి రాకీని పిలుస్తూ, హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఇంటికి వెళ్లిపోదామని బయల్దేరుతుంది. కాలికి ఏదో తగిలి చేతిలో ఉన్న ైబ్లెండ్ స్టిక్ కింద పడిపోతుంది. ఎంత వెతికినా దొరకదు. కండ్లు కనిపించకపోవడంతో ఎలా వెళ్లాలో తెలియక ఏడుస్తూ కూర్చుంటుంది. ఇంతలో.. రాకీ కిందపడిపోయిన ఆ అమ్మాయి ైబ్లెండ్ స్టిక్ తెచ్చిస్తుంది. రాకీ, ఆ అమ్మాయి ఇద్దరూ కలిసి ఇంటికెళ్లిపోతారు. చూపు కోల్పోయిన వారికి చూపును ప్రసాదిద్దాం అనే సందేశమిస్తూ తీసిన ఈ షార్ట్‌ఫిలింలో అంధురాలిగా ప్రియమణి నటించింది. బ్యాంక్‌గ్రౌండ్ వాయిస్ అమితాబ్ ఇచ్చారు. ఇలాంటి షార్ట్‌ఫిలింలు వస్తే.. అనేక అంశాల మీద కనీస అవగాహన పెరుగుతుంది.

Total views 287,900+(ఏప్రిల్ 5 నాటికి) Premiered Mar 30, 2019
Priyamani


చైత్రం


దర్శకత్వం: దినేష్ పైరపు
నటీనటులు : శ్రవణ్, దుర్గా శివప్రసాద్, ప్రణవి
చైత్ర, వివేక్ ప్రేమించుకుంటారు. ఇంట్లో మన ప్రేమ గురించి ఎప్పుడు చెప్తావ్ అని వివేక్ తొందరపెడుతుంటాడు. చైత్రనేమో.. మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత ఇంట్లో చెప్దాం అంటుంది. ఈలోపు వివేక్ నెలరోజులు వేరే ప్రాంతానికి ఆఫీస్ ప్రాజెక్ట్ పని మీద వెళ్లాల్సి వస్తుంది. వెళ్లి వచ్చిన తర్వాత చైత్ర ఇంట్లో ఈ విషయం చెప్పాలంటాడు వివేక్. నెలరోజులు పూర్తయిన తర్వాత వివేక్ తిరిగి వచ్చేస్తాడు. ముందే అనుకున్న ప్రకారం చైత్ర వాళ్ల ఇంట్లో తమ ప్రేమ విషయం చెప్దామనుకుంటారు. చైత్రకు ఫోన్ చేసి విషయం చెప్తాడు. రేపు మధ్యాహ్నం కల్లా కాల్ చెయ్.. నేనే మీ ఇంటికి వస్తాను అని చెప్తాడు వివేక్. కానీ.. చైత్ర ఎంతకూ ఫోన్ చేయదు. ఏమైందో కనుక్కుందామని వివేక్ చైత్రకు ఫోన్ చేస్తాడు. చైత్ర ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. నేరుగా చైత్ర వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూస్తే వాళ్లు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతారు. ఎవరిని అడిగినా.. చైత్ర వాళ్లు ఎక్కడ ఉంటున్నారో చెప్పరు. ఆ తర్వాత ఏం జరిగింది? వివేక్ చైత్రను కలుసుకున్నాడా? వాళ్ల ప్రేమ ఇంట్లోవాళ్లకు చెప్పుకున్నారా? ఈ ప్రేమకథ ప్రయాణం చివరికి ఎటు చేరింది? అనేది మిగిలిన కథ.

Total views 33,345+(ఏప్రిల్ 5 నాటికి) Published on Mar 30, 2019
chaitram


ఉండిపోరాదే..


దర్శకత్వం: శరత్ అంకిత్ నడిమింటి
నటీనటులు : రవితేజ మహాదాస్యం, శ్రీనిధిరెడ్డి, గోపినాథ్ ఆదిమూలం, శ్రవణ్
ఓ అబ్బాయి ఆఫీసు పని మీద హైదరాబాద్ వస్తాడు. ఈ క్రమంలో తన ఫ్రెండ్ రూమ్‌కి వెళ్తాడు. బోర్ కొట్టి ఆన్‌లైన్ చాటింగ్ చేస్తుంటే ఓ అమ్మాయి దీపికా పడుకునే ఫొటోతో చాట్ చేస్తుంది. ఈ అబ్బాయి కూడా రణ్‌బీర్ కపూర్ ఫొటోతో చాట్ చేస్తాడు. ఇద్దరూ ఆరోజు సాయంత్రం కలుద్దామనుకుంటారు. అనుకున్నట్టుగానే ఇద్దరూ ఓ రెస్టారెంట్‌లో కలుస్తారు. ఎైగ్జెట్‌గా ఫీలవుతారు. చాలా విషయాలు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నంత సేపు ఇద్దరూ ఆ ఇద్దరి నటుల పేర్లతోనే పిలుచుకుంటారు. ఎవరూ నిజమైన పేర్లు చెప్పుకోరు. ముందుగా ఆ అమ్మాయి తన పేరు చెప్పుకోడానికి ఇష్టపడదు. ఇద్దరి అభిరుచులు దాదాపు ఒకేలా ఉంటాయి. ఆ తర్వాత వీరి పరిచయం ఎటు పోయింది? ఇద్దరూ మళ్లీ కలిశారా? అసలు ఆన్‌లైన్ చాటింగ్, యాప్ చాటింగ్ వల్ల ఇద్దరు వ్యక్తులు కలిసే అవకాశం ఉందా? వారిద్దరి మధ్య ఉన్నది ఏంటి? స్నేహమా? ప్రేమా? తెలియాలంటే.. యూట్యూబ్‌లో ఈ షార్ట్‌ఫిలిం చూడండి.

Total views Mar 31, 2019+ (ఏప్రిల్ 5 నాటికి) Premiered Mar 19, 2019
undiporaadey


వాటర్


దర్శకత్వం: శంకర్
నటీనటులు : రవి రాజమౌళి
ఓ వ్యక్తి ఒంటరిగా ఇంట్లోంచి బయల్దేరుతాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత అతడికి దాహం వేస్తుంది. నీళ్ల కోసం వెతుకుతూ ఉంటే.. దూరంగా ఓ బోరింగు కనిపిస్తుంది. ఆబగా వెళ్లి బోరింగ్ కొడుతాడు. అందులోంచి చుక్క నీరు కూడా రావు. ఆ పక్కనే వేపచెట్టుకు ఒక డబ్బాలో నీళ్లు నింపి ఉంటాయి. ఆ పక్కనే ఓ అట్టముక్క మీద ఈ డబ్బాలో నీళ్లు ఆ బోరింగులో పోసి కొడితే నీళ్లు వస్తాయి అని రాసి ఉంటుంది. పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ డబ్బాలోంచి సగం నీళ్లు బోరింగులో పోసి కొడుతాడు. నీళ్లు రావు. మిగతా సగం కూడా పోసి కొడుతాడు. అయినా.. రావు. శక్తి సన్నగిల్లి బోరింగు పక్కనే కూర్చుంటాడు. అప్పటిదాకా కొట్టడం వల్ల నీరు కొంచెం పైకి వచ్చి బోరింగులోంచి కొన్ని చుక్కల నీళ్లు కారుతాయి. మళ్లీ పెట్టి బోరింగు కొడుతాడు. నీళ్లు వచ్చి డబ్బా నిండుతుంది. ఆ నీళ్లు తాగి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సహజ వనరులను వృథా చేస్తే.. భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఓ లుక్కేయండి. మంచి సందేశమున్న షార్ట్‌ఫిలిం ఇది.

Total views 2,620+ (ఏప్రిల్ 5 నాటికి) Published on Mar 22, 2019
water


ప్రవీణ్‌కుమార్ సుంకరి, సెల్: 9701557412

685
Tags

More News

VIRAL NEWS