గోడెక్కిన పచ్చందాలు


Sun,April 14, 2019 01:31 AM

హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వకార్యాలయాలు, ైైఫ్ల్లెఓవర్లు పచ్చని మొక్కలతో ఆహ్లాదం పంచుతున్నాయి. షేడ్‌ట్రీస్, వర్టికల్ గార్డెనింగ్‌తో కొత్త సొబగులు అద్దుకున్నాయి. పచ్చని అందాలతో సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు అంటే నాలుగు టేబుళ్లు, కుర్చీలు, ఫైల్స్ ఇవ్వే కనబడుతాయి. అయితే హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ సెంట్రల్ జోనల్ కార్యాలయానికి వెళితే అక్కడి నుంచి తిరిగి రావాలనిపించదు. కార్యాలయంలోని గోడలన్నీ చెట్లతో నిండి ఉండడమే దీనికి కారణం. ఆఫీస్ మెయిన్ గేట్‌కు రెండువైపులా.. గోడల నిండా పచ్చని మొక్కలు ఏర్పాటు చేశారు. అక్కడ అసలు గోడ ఉందా? పచ్చని మొక్కలతోనే అందమైన గోడను నిర్మించారా? అనిపించేలా అందంగా తయారు చేశారు. షేడ్ ట్రీస్ పేరిట నిండుగా అందమైన మొక్కల్ని పెంచుతున్నారు. ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉండి.. పచ్చదనంతో కళకళలాడుతూ ఆహ్లాదం పంచుతున్నాయి. ఈ మొక్కలకు నీటిని పోసేందుకు ప్రత్యేక డ్రిప్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు. నిజంగా ఈ అందాలను చూస్తే ఇది ప్రభుత్వ కార్యాలయమా లేక నర్సరీ కేంద్రమా.. అని ఆశ్చర్యపోవడం ఖాయం.
vertical-garden1

పిల్లర్లకు కూడా.

కేవలం కార్యాలయంలోనే కాదు. నగరంలోని ైఫ్లెఓవర్ పిల్లర్లకు కూడా వెర్టికల్ గార్డెన్స్(నిలువుగా మొక్కల పెంపకం)ను ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో ఉన్న ైైఫ్ల్లెఓవర్ల ప్లిలలకు ఏర్పాటు చేసిన గార్డెనింగ్ కనువిందు చేస్తున్నాయి. ఫిల్లర్లను ఖాళీగా ఉంచడంతో సినిమా పోస్టర్లు, వాల్‌రైటింగ్, అడ్వర్టయిజింగ్ పేరుతో వాటిని అందవిహీనంగా మార్చుతున్నారు. వాటిని నివారించడంతో పాటు ఆహ్లాదాన్ని పంచడం, పర్యాటకులను ఆకర్శించడం లక్ష్యంగా వెర్టికల్ గార్డెనింగ్‌ను చేపట్టారు. ప్రతి వెర్టికల్ గార్డెన్ ఆటోమేటెడ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ఉంటుంది. రోజుకు 100 మిల్లీ లీటర్ల డోస్‌తో నీరు అందుతుంది. ఈ గార్డెన్ ఒక్కోసైడ్ యూనిక్ డిజైన్ ఉండేలా చూశారు. ఈ పిల్లర్లకు అలంకారప్రాయమైన గ్రీన్ వాల్స్ మొక్కలను నాటారు. త్వరలోనే నగరంలోని చాలా చోట్ల ఈ గార్డెన్లతో కవర్ చేయనున్నారు. ఈ వెర్టికల్ గార్డెన్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వేడిని తగ్గించడంతోపాటు పొగమంచు, గాలి కాలుష్యాన్ని తగ్గిస్తుంది. పక్షులు, కీటకాలు ఆరోగ్యకరమైన నివాసాన్ని ఏర్పరుచుకుంటాయి. బయోడైవర్సిటీని పెంచుతుంది. ప్రధానంగా ఈ మార్గం వెంట వెళ్లే వాహనదారులు, పాదాచారులకు చక్కటి ఆహ్లాదాన్ని పంచుతుందని అధికారులు చెబుతున్నారు.
vertical-garden

446
Tags

More News

VIRAL NEWS