వాస్తు


Sun,April 14, 2019 01:14 AM

మేం మా కిచెన్‌కు దక్షిణంలో ద్వారం పెట్టొచ్చా?వడ్లమాను నాగేశ్వర్, కొత్తూరు

అవసరం కోసం ద్వారాలు ఇంటికి నలువైపులా పెట్టుకోవచ్చు. కానీ మనం పెట్టే ద్వారం ప్రశ్నగా మారకుండా ఉండాలి. ఇంటికి ముందు తూర్పు వైపు, ఉత్తరం వైపు ద్వారాలు వచ్చి ఉంటే మిగతా దిశలకు ద్వారాలు పెటుకొనే యోగ్యత కలుగుతుంది. ఉత్తరంలో గూటికి తలుపు ఉన్నప్పుడు మాత్రమే కిచెన్‌లో దక్షిణం ద్వారం పెట్టుకోవాలి. అది కూడా కిచెన్‌కు తూర్పు వైపు పెట్టుకోవద్దు దక్షిణంలో మాత్రమే పెట్టాలి. అది కిచెన్ గదికి నైరుతి అయినా సరే. ద్వారాలు సృష్టిలోని శక్తిని స్వీకరించే గొప్ప మార్గాలు అవే ఇంట్లో నెగిటివ్, పాజిటివ్ ఎనర్జీని నింపడానికి దోహదపడుతుంటాయి. కాబట్టి శాస్త్ర పద్ధతిని అనుసరించి నిర్ణయాలు చేయాలి.
white-appliances

మనిషి ప్రయత్నంతో సాధించలేనిది లేనప్పుడు ఈ శాస్ర్తాలు ఎందుకు? వ్యాపారం కాదా?-ఇంద్రగంటి వెంకటలక్ష్మి, ఖమ్మం

నిజమే. ప్రయత్నం మనిషిని మహోన్నతుడిని చేసింది. ఇప్పుడు కనిపించే ఈ ఆధునిక ప్రపంచం ఎలక్ట్రానిక్ విప్లవం అంతా మనిషి మేధస్సు పెట్టిన భిక్ష. ఆ మెదడు పుట్టుక ఎక్కడ? ఆ మేధ (మెదడు) ఎందులో ఉంటే పనిచేస్తుంది. ఒక శరీరంలోంచి దానిని బయటకు తీసి పని చేయించగలమా? లేదు. ఎందుకు? శక్తి అంతటా ఉంటుంది. అది కార్యరూపం దాల్చాలి. అంటే ఒక సాధనం (ఉపాధి) కావాలి అదే గృహం. సెల్ ఉంటేనే సిగ్నల్స్ ఉపయోగం కదా. మనిషి గొప్పవాడే.. అతడు ఎన్నో కనుగొంటూ ఉన్నాడు. ఉన్న ఈ ప్రకృతి నుండే. తనకు తానుగా భూమిని, సూర్యుడిని సృష్టించలేదన్నది మరువద్దు. మనిషి ప్రకృతి ముందు పసిబిడ్డ. ఆ తల్లి వేలు పట్టుకొని నడిస్తేనే అనేక అద్భుతాలు చేయగలడు. వాస్తు వ్యాపారం కాదు విజ్ఞానం. ప్రయత్నం అన్నది మనిషికి ప్రాణాధారం. ఆ ప్రయత్నం చేయాలంటే ప్రకృతి తోడ్పాటు ఉండాలి. విషం - అమృతం రెండూ ఈ సృష్టిలో లభిస్తాయి. దేనిని దేనితో కలిపితే అది మనకు అమృతమో శాస్త్రం చెబుతుంది. కలుపడం ప్రయత్నం. ప్రయత్నం ఒక్కటే ఉంటే ఫలితం లేదు. ప్రకృతి ఉంటేనే అది మనిషి కన్నా ముందే ఏర్పాటు చేయబడింది. దాని తరువాత నీ ప్రయత్నంతో అన్ని లభిస్తున్నాయి. ఎవరు ముందు? మనిషి ఆలోచన పుట్టే చోట ఉండే (శక్తి) పొదుగు అది సృష్టి కల్పించినదే కదా. ఉన్నదాని నుంచి ఉన్నతికి చేర్చే మార్గం శాస్త్రం తెలుపుతుంది. ఇది ఋషివరం వదులుకో, వాడుకో, ఊరుకో నీ ఇష్టం.

పోర్టికో ఉత్తర, ఈశాన్యంలో ఎలా ఉంటే వెడల్పు వేసుకోవాలి?-మాచవరం లక్ష్మణ్, జడ్చర్ల

ఇంటిముందు విశాలమైన పోర్టికో వేసుకోవాలని అందరూ అనుకుంటారు. కొందరు ద్వారానికి ఎదురుగా వేస్తారు అది ఉత్తరం మధ్యలో కావచ్చు, తూర్పు ఈశాన్యంలో కావచ్చు. ఎక్కడ వేసినా పోర్టికోలు పిల్లర్స్‌తో పందిరిలాగా వేయవద్దు. అలా వేస్తే ఇంటి వెడల్పు ఎంత ఉంటే అంత వేయాలి. మనం స్లాబులోనే పిల్లర్స్ లేకుండా తూర్పులో ఉండే ఖాళీ స్థలాన్ని బట్టి ఎంతవరకు అవకాశం ఉంటే అంత వేసుకోవచ్చు. స్లాబు పెంచుకొని ఇంటి పూర్తి వెడల్పు వేయడం (ఇంటి వెడల్పులో సమానంగా) ద్వారా ఇంట్లో ఒక చక్కని సమశాతం వాతావరణం ఉత్పన్నం అవుతుంది.

పడకగదికి దక్షిణంలో కామన్ టాయిలెట్ పెట్టుకోవచ్చా?-వి.భువనేశ్వరి, కొండగట్టు

మన అవసరాలకు అనుగుణమైనదే గృహం. కానీ అవి సక్రమ రీతిలో ఉండాలి. శరీరంలో ప్రతీ అవయవం మన జీవితానికి అవసరమైనవే కానీ వాటి అమరికలో ఒక క్రమపద్ధతి, శాస్త్రీయత ఉంది. కళ్లు, తలలో పైన ఉన్నాయి. మోకాళ్లలో లేవు కారణం చూపు వినియోగం పైన ఉంటేనే ప్రయోజనం, లేదంటే బొక్కాబోర్లా పడతాం ఏమీ కనబడక. ఇంట్లో టాయిలెట్ దక్షిణం, పడమర, ఆగ్నేయ, వాయవ్యాలలో అమర్చుకోవచ్చు. మీరు పడక గదికి దక్షిణం అన్నారు. మాస్టర్ బెడ్‌రూమ్‌కు దక్షిణంలో వస్తే ఇంటి మొత్తానికి నైరుతి టాయిలెట్ అవుతుంది. అది ఆమోదయోగ్యం కాదు. హాలు నుంచి ప్రత్యేకంగా మీరు కట్టుకున్నా ఇంటి ఆరోగ్యాన్ని అది చెడగొడుతుంది. మీ హాలుకు దక్షిణంలో కామన్ టాయిలెట్ కట్టుకోవచ్చు. లేదా కిచెన్‌కు దక్షిణంలో హాలు నుంచి వెళ్లేలా టాయిలెట్ ఏర్పాటు చేసుకోవచ్చు.

559
Tags

More News

VIRAL NEWS